1, ఏప్రిల్ 2008, మంగళవారం

నడుం నొప్పి తగ్గాలంటే __ మంతెన సత్యనారాయణ రాజు

మెడ దగ్గర నుండి ముడ్డి భాగం వరకూ వెన్నుపూసలు ఒకదానిపై ఒకటి పేర్చి ఉంటాయి. ఇటుకకు ఇటుకకు మధ్య సిమెంట్ పొర ఉన్నట్లే పూసకు పూసకు మధ్య ఒక మెత్తి దిండు లాంటి భాగం ఉంటుంది. దానినే డిస్క్ అంటారు. మనం బరువును పట్టుకున్నప్పుడు లేదా మోస్తున్నప్పుడు ఆ బరువు పూసలమీద పడకుండా పూసకు పూసకు మధ్య డిస్కులు స్ప్రింగ్ లాగ వత్తిడి తెలియకుండా మెత్త దనాన్నిస్తై. కారు గూతులలో వెళ్ళినా లోపలున్న వారికి కుదుపుడు తెలియకుండా స్ప్రింగులు కాపాడినట్లే డిస్కులుమన వెన్నుముకను కాపాడుతూ ఉంటాయి. ఎప్పుడూ ముందుకి వంగికూర్చుని ఆఫీసుల్లో పని చేసుకునేవారికి, వంకర టింకరగా కూర్చునే వారికి, మెత్తటి పరిపుల మీద పడుకునే వారికి, స్కూటర్ల మీద ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి ఈ డిస్కులు వత్తిడికి గురి అవుతాయి. దీని కారణంగా నడుము నొప్పి, కాలుజాలు మొదలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ఎక్కువ శ్రమ చేసినప్పుడు నడుము కండరాలు కూడా వతిడికి గురి అవుతాయి. దీనివల్ల నడుము మధ్య భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది. ముందుకు వంగితే ఎక్కవ అవుతూ ఉంటుంది. విశ్రాంతిలో బాగుంటుంది.
చిట్కాలు:
౧) స్పాంజి పరుపులు మాని పలుచని బొంతలాంటి వాటిపై పాడుకోవడం మంచిది.
౨) నడుము భాగానికి నూనె రాసి రబ్బరు బ్యాగ్లో వేడి నీరు పోసి రెండు పూతల కాపడం పెట్టుకుంటే కండరాలకు ఉపశమనం కలుగుతుంది.
౩) నడుమును ముందుకు వంచే పనులు మాని ఎక్కడ కూర్చున్న నిటారుగా కూర్చుంటే మంచిది.
౪) ప్రతిరూజూ కూడా నడుమును ముందుకు వంచే వ్యాయామాలు పూర్తిగా మాని, కేవలం వెనక్కి వంచే ఆసనాలను మాత్రమే చేస్తే మంచిది. అవి భుజంగాసనము, ధనురాసనము, ఉష్ట్ట్రాసనం మొదలగునవి. అవకాశముంటే రెండుపూటలా వీటిని చేస్తే త్వరగా తగ్గుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి