8, సెప్టెంబర్ 2008, సోమవారం

స్నానం విశిష్టత__ డాక్టర్ మంతెన సత్యనారాయణ raju

ప్రతి ఒక్కరికీ సామాన్యంగా ఉదయం స్నానం చేయడం అలవాటు వుంటుంది. కానీ ఆ స్నానాన్ని ఏదో నాలుగు చెంబులు చేసేస్తే పని అయిపోతుందని మ్రోక్కుబడిగా గడిపేస్తారు. స్నానం ఎంత ఆరోగ్యమో తెలిస్తే అలా చేయలేము. మన శరీరంలో చలిని స్వీకరించే కణాలు ఎక్కువగా ఉంటాయి. వేడిని స్వీకరించేవి కొద్దిగా వుంటాయి. పెద్దలు చన్నీటిని సజీవమని, వేడి నీటిని చచ్చిన నీరని అంటుంటారు. చన్నీటి స్నానం చేయడం వలన చర్మానికి, కండరాలకు, రక్తనాళాలకు సంకోచ వ్యాకోచాలు రెండూ ఉంటాయి. అదే వేడి నీరు చేసినప్పుడు వ్యాకోచించడమే జరుగుతుంది. ఉదయం స్నానం చన్నీటి తో తలకు చేయాలి. ఎక్కువమంది స్నానం మెడవరకే చేస్తారు. తల మనది కాదంటారా? శరీరం సుభ్రమయితే సరిపోతుందంటారా? తల అక్కరలేదా ? అనింటి కంటే మనస్సుని చల్లబరచడం చాల ముఖ్యం. ౨౪ గంటలూ ఎక్కువ పని చేసే మనస్సు నిద్రలో కూడా ఎంతోకొంత పని చేస్తూనే వుంటుంది. అలాంటి మనస్సును చల్లబరిస్తే ప్రశాంతంగా వుంటుంది. చన్నీటిని తలకు పోసుకోవడం వలన తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చన్నీటితో భుజాల వరకు పోసుకుని, తల మీద చన్నీరు పోయనప్పుడు భుజాల నుండి క్రింద భాగాలలో వేడి అంతా తలకు ఎక్కుతుంది. ఉదాహరణకు వేసవి కాలంలో కాలే నేల మీద నీరు పోస్తే నెలలోని వేడి అంతా పైకి వస్తుంది కదా! అలాగే చన్నీటితో తల తడవనప్పుడు, శరీరం తడపడం ద్వారా వచ్చిన వేడి వెను వెంటనే పై ప్రదీశానికి ఎక్కుతుంది. మనస్సు వేడెక్కకోడదంటారు. చల్ల బరచ వలసిన మనస్సును వేదేక్కిస్తున్నాము. రోజంతా లేనిపోని కోపాలు, టెన్షన్లు, చిరాకులు, పోట్లాతలతో, మనస్సును వేడెక్కించింది చాలక ఆఖరుకు స్నానం చేసేటప్పుడు కూడానా? తెలిసో, తెలియకో మనిషి ఎంత పొరపాటు చేస్తున్నాడు! మన పెద్దలు ఉదయం చన్నీటిని తలకు తప్పనిసరిగా పోసుకునేవారు. వేసవిలో వారు బుర్ర వేడెక్కకుండా నెత్తికి గొడుకు, కాళ్ళకు చెప్పులు తప్పనిసరిగా వాడేవారు. మరి ఇప్పటి అందరి అలవాట్లు ఎలావున్నాయి అంటే ప్రతి రోజూ స్నానం చేసేది ఒక పూట. అదీ వేడి నీటితో వంటికి మాత్రమే . పైగా చేయివేస్తే జర్రున జారి, నురుగులు వచ్చే సబ్బులు, నాలుగు చుక్కలు షాంపూ వేస్తే రుద్దీ రుద్దకుండానే పొంగిపోయే నురుగులు. సబ్బులలో మురుకిని పోగొట్టి, నురుగు వచ్చేటట్లు చేసే పదార్దాలు వుంటాయి. వాటిని సర్ ఫేస్ యాక్టివ్ ఏజెంట్లు అంటారు. అవి చర్మం మీద మురికితోబాటు చర్మంపైన సున్నితమైన పొరను పోగొడతాయి. అందుకనే సబ్బుపెట్టి స్నానం చేసిన తరువాత చర్మం పొడిగా, తెల్లగా, ఎండిపొయినట్లు వుంటుంది. అలావస్తుందని మరలా చర్మం మీద కోల్డ్ క్రీములు గానీ నూనె గానీ రాసుకుంటారు. చర్మం ఎప్పుడూ నిగ నిగలాడుతూ ఉండాలనుకుంటారు. అందరికీ చర్మం ఎప్పుడూ అలాగే వుంటుంది. దానిని రోజూ సబ్బులు వాడి పోగొట్టుకుని మరలా క్రీములు రాసుకుంటూ ఉంటాము. చలికాలంలో కూడా చర్మం పగుళ్ళు కానీ, తెలుపుగా గానీ సబ్బులు రుద్దకుండా వుంటే రాదు. ఏ క్రీములు నూనెలు రాసే అవసరమే లేదు. సబ్బు రుద్దడం వలన ఇంకో నష్టం ఏమిటంటే, సబ్బురాసుకుని రెండుసార్లు పైకి క్రిందకి చేతిని కదిపేసరికి నురుగు వచ్చేస్తుంది. అందరి అభిప్రాయం ఏమిటంటే నురుగు వస్తే కుళ్ళు వదిలి నట్లేనని. ఆ నురుగులో చర్మంపై నున్న దుమ్ము, మురికి, జిగురు పోవచ్చు. చర్మాన్ని రుద్ద కుండానే నురుగులు రావడమే ఇక్కడ నష్టం. అది ఎలాంటిదంటే ఉప్పు, కారాలు ఎక్కువుగా ఉన్నా ఆహారపు ముద్దను నోట్లో పెట్టుకున్నప్పుడు, నమలకుండానే లాలాజలం ఊరి ముద్దను త్వరగా మింగేస్తాము. సరిగా నమలనందు వలన ఆహారం అరగదు. సబ్బులలో నున్న మందుల కారణంగా, రుద్దకుండా, నురుగు రావడంతో, చర్మాన్ని చేతులతో మర్దన చేయడం తగ్గిపోతుంది. మన పెద్దలు సబ్బు వాడేవారు కాదు. వారు సున్నిపిండితోనో, వట్టి చేతులతోనో చర్మాన్ని రుద్దేవారు. చర్మంపై మట్టి పోవాలని అలా రుద్దే వారు. అలా రుద్దడం వలన చర్మం వేడెక్కుతుంది. ఎందు వల్లనంటే చర్మాన్ని రుద్దేటప్పుడు లోపలవున్న రక్తం ఎక్కువ చర్మానికి వస్తుంది. తద్వారా స్నానం చేసేటప్పుడు చర్మానికి రక్తప్రసరణ బాగా జరగడం ఒక ప్రయోజనం. రెండవది చర్మ రంధ్రాలలో నున్న చెడు పదార్ధం కూడా స్నానం చేసేటప్పుడు గట్టిగా రుద్దడం వలన బయటకు వచ్చేస్తుంది. మామూలుగా చర్మానికి రక్తప్రసరణ మెల్లగా జరుగుతుంది, చర్మం చివ్వరి భాగం కాబట్టి. బంతి భోజనాలలో ముందు కూర్చున్నవాడికి వంటలు లోటులేకుండా త్వరగా అందుతాయి కదా! అలాగే గుండె కూడా దగ్గరవున్న భాగాలకు రక్తాన్ని త్వరగా అందించి, దూరంగా వున్నవాటికి అలస్యంగా అందిస్తుంది. అందువలనే చర్మ వ్యాధులు తొందరగా తగ్గవు.
**** అలాగే మన చర్మానికి రక్తప్రసరణ బాగా జరగాలంటే శరీరాన్ని స్నానం చేసేటప్పుడు బాగా వేడెక్కేటట్లు రుద్దడం మంచిది. సబ్బులు వుంటే ఎక్కువ సేపు రుద్దలేరు. అందువల్ల సబ్బులు వాడడం మంచిది కాదు. సబ్బులు లీనప్పుడు మురికి వదలాలని చేతులతో భాగాలన్నితిని గట్టిగా రుద్దగలుగుతాము. శరీరాన్ని రుద్దేటప్పుడు కళ్ళను క్రిందనుండి పైకి రుద్దుకోవాలి. అలాగే చేతులను క్రింద నుంచి భుజాల వైపు రుద్దుకూవాలి. మనకు రక్తం ఆ విధంగానే పైకి నడుస్తున్నది కాబట్టి. అలా చేయడం వలన పైకి గుండెకు చేరే రక్తాన్ని మనం చేతులతో క్రిందకు నెట్టడం జరుగుతుంది. మనం విరుద్ధమైన పని చేసి నట్లవుతుంది. స్నానం చేసే ఒక మంచి పద్దతిని వివరిస్తాను.....____
స్నానం చేయడానికి వేళ్ళముందు ఒక మెత్తటి, తెల్లని నాప్కిన్ (జేబురుమాలు గుడ్డ) తీసుకుని వెళ్ళండి. రాసుకుంటే స్నానానికి ముందు నూనె రాసుకోవచ్చును. ఒక బాత్ రూంలో సబ్బులు లేకుండా చేయండి. ముందు శరీరాన్నంతిటినీ ఒక బకెట్ నీటితో పూర్తిగా తడపండి, ఆ మెత్తటి నాప్కిన్ ను తడిపి, పిండేసి, దానితో శరీరం అంతటినీ రుద్దండి. ఆఖరుకు తలను కూడా ఆ గుడ్డతోనే రుద్దుకోవచ్చు. సుమారు ౧౦-౧౫ నిమిషాలు రుద్దటానికి పట్టవచ్చు. ౧౫ నిమిషాలు గడిచే సరికి చర్మం వేడెక్కి, చమటలు పడుతుంటాయి. ఆ తెల్లటి నాప్కిన్ మట్టితో నల్లగా అయిపోతుంది. చర్మ రంధ్రాలలో నుంచి మురికి ఈ విధంగా స్నానం చేస్తే పూర్తిగా బయటకు పోతుంది. ౧౦-౧౫ నిమిషములు గుడ్డతో పూర్తిగా చర్మాన్ని రుద్దుకోవడం అయిన తరువాత మరల ఒక బకెట్ చల్లని నీళ్ళను తలపై నుండి పోసుకోవాలి. అలా పోయడం వలన రుద్దినప్పుడు వేడికి వ్యకోచించిన రక్తనాళాలు, చర్మ రంధ్రాలు అన్నీ మరలా చలికి మూసుకుపోతాయి. (సంకోచిస్తాయి) గుడ్డతో పాదాలను బాగా రుద్దుకోవడం వలన మట్టి బాగా పోయి పగుళ్ళు దరి చేరవు. ఈ విధంగా స్నానం చేయడం వలన చర్మ వ్యాధులు వచ్చే అవకాసం తగ్గుతుంది. సబ్బుల ఖర్చు ఉండదు. మనలో నుంచి ఎంత మురికి వచ్చిందీ ఆ తెల్లటి నాప్కిన్ ను చూస్తే తెలుస్తుంది. స్నానం చేసిన తరువాత మొహం, చర్మం ఎంత ఫ్రెష్ గా వుంటాయో, సాయంత్రం స్నానం చేసే వరకూ కూడా అలాగే వుంటాయి. దీనిని 'సంపూర్ణ స్నానం' అంటారు. చెప్పినట్లు చేయండి, మీరే ఒప్పుకుంటారు. ఇన్నాళ్ళూ స్నానం పేరు చెప్పుకొని, సబ్బుల పీరు చెప్పుకుని చర్మాన్ని ఎంత మోసం చేసామో అర్ధమౌతుంది.