7, ఏప్రిల్ 2008, సోమవారం

దంతధావన క్రియ ___ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

ఇక పళ్ళు తోముకునే విషయం ఆలోచిద్దామా ! మనకు శరీరం లోపల ఎంత స్వచ్చత ఉన్నదనేది నోట్లో వచ్చే వాసన తెలియజేస్తుంది. అలాగే నాలిక శరీరానికి అడ్డం లాంటిది. శరీరం ఆరోగ్యం గా ఉన్నదీ, అనారోగ్యం గా ఉన్నదీ నాలిక చూస్తే తెలిసిపోతుంది. శరీరంలో ఎంత రక్తం ఉన్నదీ నాలికను చూసి చెప్పవచ్చు. విరోచనం సాఫీగా అవని వారికి, ప్రేగులలో చెడు, బాక్టీరియా ఎక్కువ వున్నవారికి, లివరులో (toxins) ఎక్కువ వున్నవారికి మరియు విసర్జకావయవాలలో చెడు బయటకు సరిగ్గా పోనివారికి నిద్ర లేవగానే నోరు దుర్వాసన వస్తుంది. మిగితా జీవులలో ఏవైనా పళ్ళు తోముకునేవి ఉన్నాయా? వేటి నోరైనా వాసన వస్తుందా? మరి మనిషి నోరు వాసన రావడానికి కారణాలేమిటి? మాట్లాడేటప్పుడు నోట్లోనుంచి ఎదుటివారికి లాలాజలం ఇంత పడితే సహించలేము. చీ ! అనుకుంటాము. తిట్టుకుంటాము, తరువాత కడుగుకుంటాము కూడా. మరి చంటి పిల్లవాడి ఎంగిలైతే ఎవ్వరూ పట్టించుకోరు. సంతోషంగా తుడుచుకుంటారు. అదే పిల్లవాడు పెద్దవాడైనప్పుడు మరల అదే విధంగా పడితే ముందు సంతోషంగా తుడుచుకున్న వ్యక్తే అసహ్యముగా తుడుచుకుంటాడు. ఇంత జరగడానికి కారణం ఆలోచిస్తే చంతిపిల్లవాడు స్వచ్చమైన ఆహారంతో స్వచ్చమైన మనస్సు కలిగి వుంటాడు. పెద్దవాడైన తరువాత రుచులు గల ఆహారాలు తిని కలుషితమైన మనస్సుతో ఉంటాడు కాబట్టి వాడి నోరు వాసన అనిపిస్తుది. తను పెంచుకునే కుక్క చేత నాకిన్చుకుని త్రుప్తి పడుతుంటాడు. మన ఇంట్లో కుక్క మనం తినే ఆహారం తిని మనతోబాటు జీవిస్తూ వుంటుంది. అది పళ్ళు తోముకోదు. అయినా దాని నోరు వాసన రాదు. మనం రోజుకు ఒకసారి లేదా రెండు సార్లో బ్రష్ చేసుకుంటూ ఉంటాము. పైగా మంచి వాసనలు వచ్చే, నురుగులు చిమ్మే పేస్టులతో కదా! మరి మనిషి ఇంత చేసినా నూరు మాట్లాడుతుంటే వాసన వస్తూనే వుంటుంది. కుక్క ఎంగిలిని అయినా మనిషి సహించగలుగుతున్నాడుగానీ ప్రక్కవాడి చొంగ ఇంత పడితే తట్టుకోలేడు.


నోరు రాత్రిపూట ౬-౭ గంటలు నిద్రలో కదపకుండా అలా వుంచి నందుకు లాలాజలం కదలికలు లేక, నోటిలో ఉండే బాక్టీరియా కారణంగా, గాలి తగలనందువలన, నోటిలో లాలాజలం దుర్వాసన వస్తూ వుంటుంది. అలాగే గొంతులో వుండే లారింక్స్, ఫారింక్స్ భాగాల దగ్గర ఊపిరితిత్తుల నుండి వచ్చి చేరిన కఫం నిలువ వుంటుంది. భగవంతుడిచ్చిన ప్రకృతి ఆహరం తింటే అసలు నోరు పుక్కిలించవలసిన అవసరం వుండదు. బృష్లతో పనే వుండదు. మసాలాలు, స్వీట్స్ తినడంవలన నోటి దుర్వాసనలు ఎక్కువగా ఉంటాయి. పళ్ళు ఊడిపోవడానికి కారణాలు కూడా ఇవే. కిళ్ళీలు, వక్కపోడులు వాడటం వలన కూడా పళ్ళు తొందరగా ఊడిపోతై. మనిషి ఆరోగ్యంగా వుంటే జీవితకాలంలో పళ్ళు ఊడవు. ఒక్క పన్ను కూడా కదలదు. ముసలివారికి పళ్ళు ఊడతాయి. ఇది సహజం అని అందరమూ అనుకుంటాము. అందరూ ఉప్పులు, మసాలాలు, స్వీట్లు తిన్నవారే కదా! మరి ముసలి జంతువులకు పళ్ళు ఊడిపోవడం లేదు గదా! ఇదంతా మన ఆహార లోపం వలననే గదా! పళ్ళు ఊడితేపళ్ళు కట్టించుకోవచ్చులే అని, ఎవరికి వారు ఉన్న పళ్ళు పాడవకుండా చూసుకోవాలని అనుకోవడం లేదు.
పేస్టులు పెట్టి పళ్ళు తోముకోవడము వలన నోట్లో లాలాజలం ఎక్కువ తయారవదు. అదే వేపపుల్ల అయితే చేదుకు లాలాజలం ఎక్కువ ఊరుతూ వుంతుంది. పైగా చేదుకి నోట్లో క్రిములు కదిలి బయటకు పోతాయి. బావిలో పాత నీరు తోడే కొద్దీ కొత్త నీరు ఊరుతూ వుంటుంది కదా! అలాగే నోట్లో చెడు లాలాజలం అంతా వేప చేదుకు బయటకు కారిపోయి, క్రొత్తది ఊరుతూ వుంటుంది. అందువల్ల వేపపుల్ల పెట్టి కడిగితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే గానుగు, మర్రి ఊడ, ఉత్తరేణి పుల్లలతో కడిగితే నోట్లో నురుగు కూడా వస్తుంటుంది. పెద్దలు నాలిక గీసేతప్పుడు వ్రేళ్ళు అంగిటి లోనికి పెట్టి డోకు కునే వారు . దీనివల్ల గొంతులో స్వరపేటిక వద్ద ఉండిపోయిన శ్లేష్మం అంతా బయటకు తెగి పడిపోయేది. మరి యిప్పుడు ఇంట్లో పళ్ళు తోముకోవడం కదా! కాన్ద్రిస్తే మోత వస్తుందని, మెల్లగా పని పూర్తి చేస్తారు. గొంతులోకి రాత్రి నుండి చేరిన చెడు, పళ్ళు తోముకునే తప్పుడు ఉమ్మివేయకపోతే అది తినేటప్పుడు మరల ఆహరం ద్వారా లోపలికి పోతుంది. పళ్ళు తోముకునేతప్పుడు గొంతులోని కఫాన్ని కాండ్రించి ఉమ్మివేయడం చాల మంచింది. కుదిరినప్పుడు పళ్ళు తూము పుల్లతో తోముకోవడం నోటి ఆరోగ్యానికి మంచిది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి