8, ఏప్రిల్ 2008, మంగళవారం

చెమట దాని కధ __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

చర్మం ఒక విసర్జకావయవము. చర్మాన్ని మూడవ కిడ్నీ అంటారు. ప్రతి రోజూ చర్మాన్ని రెండు లీటర్ల వ్యర్ధ పదార్ధాలను విసర్జిస్తుంది. మనలో వున్నా మాలిన్యాలు కొన్ని చర్మ రంద్రాల ద్వారా చెమట రూపంలో బయరకు పోతుంటాయి. చెమట పట్టనప్పుడు చర్మపు పోరలలోనే దాగి ఉంటాయి. చెమట పట్టినవారికి, ఆ చెమటతో కలిసి బయటకు రావడానికి వీలుంటుంది. ఉదాహరణకు మనం ఇల్లు నీటితో కడుగుతుంటాము. ఇంటిలోని మురికి, నీటితో కలిసి, కరిగి, నీటి ద్వారా బయటకు పోతుందిగదా ! అలాగే చర్మంలోని మురికి చెమట పట్టిన వారికే బాగా బయటకు వస్తుంది కానీ చెమట పట్టని వారికీ రాదు. అందుకనే మన పెద్దలు చెమట పట్టిన వాడికే తినే అర్హత వుంటుంది అనేవారు. ఇది మహాత్మా గాంధీగారు చెప్పిన మాట. వారు అన్నది అక్షరాలా నిజం అనిపిస్తుంది ఇక్కడ. చెమట పట్టాలంటే శరీరం వేడెక్కాలి. శరీరం వేడెక్కాలి అంటే పని చెయ్యాలి. అంటే పని చేసిన వాడికే శరీరం వేడెక్కుతుంది అని అర్ధం. శరీరం వేడెక్కినప్పుడు రక్త ప్రవాహం అన్ని భాగాలకు, కణాలకు స్పీడుగా జరుగుతుంది. పనిచేసే వారికి ఊపిరితిత్తులు ఎక్కువ గాలిని పీల్చుకుంటూ వుంటాయి. ఎక్కువ గాలి శరీరంలోకి వెళ్ళడం వలన వేడి ఎక్కడం ప్రారంభమవుతుంది. శరీరం లోని చెడు దహన మవడానికి, బయటకు విసర్జించబడడానికి ఎక్కువ ప్రాణ శక్తి కావాలి. ఖాళీగా కూర్చుంటే ప్రాణ శక్తి లోపలకు వెలితే ఎక్కువ చెమట వెంటనే పడుతుంది. పనిచేసే వారికి పట్టే చెమటలో చెడు - చర్మం ద్వారా బహిష్కరించబడుతూ వుంటుంది. కదల కుండా ఇంట్లో కూర్చున్నప్పుడు గాలి ఆడక పట్టే చెమటలో నీరు వుంటుంది గాని చెడు పదార్ధాలు వుండవు. అప్పుడు పట్టిన చెమటకు క్రొవ్వు కరగదు. ఆరోగ్యం రాదు. ఎక్కువ ప్రాణ శక్తి పీల్చుకోవడం వలన, పనిలో పట్టే చెమట ఆరోగ్యదయకము. అది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చెమట పట్టనివాడు మూడు పూటలా భోజనం చేస్తూవుంటే, ఆహారం జీర్ణమైన తరువాత ఆహరం ద్వారా వచ్చిన చెడు పదార్ధం మరి ఎక్కడ నుండి బహిష్కరింప బడుతుంది ? అదే చెమట పట్టేవాడికి అయితే చర్మం తో బాటు మిగితా విసర్జకావయవాలు కూడా చెడును విసర్జిస్తూ వుంటాయి. చెమట పట్టేవాడు బాగా నీరు తాగుతాడు. అందు వల్ల మూత్రం లో వెళ్లవలసిన చెడు వెళ్లి పోతుంది. చెమట పట్టేతట్లు పని చేయడం వలన ఆకలి బాగా అవుతుంది. ఆ ఆకలితో ఎక్కువ భోజనం తృప్తిగా తినగాలుగుతాడు. తినే ఆహారంలో పీచుపదార్ధం ఎక్కువగా ఉన్నట్లయితే విరోచానము ఎక్కువగా తయారవుతుంది. ఎక్కువ విరోచానము త్వరగా ప్రేగులలో కదిలి బయటకు విసర్జించ బడుతుంది. పని చేసే వాడు ఎక్కువ ఒక్సిజేన్ ను శ్వాసలో దీర్ఘంగా తీసుకోగలుగుతాడు. ఎప్పుడైతే ఎక్కువ ఒక్సిజేన్ ను ఊపిరితిత్తులలోనికి వెళ్ళిందో గాలి బయటకు వచ్చేటప్పుడు కార్బోన్ డై ఆక్సైడ్ ఎక్కువగా వచ్చేస్తుంది . అందువల్ల ఊపిరితిత్తుల ద్వారా పోవలసిన చెడు వాటి ద్వారా ఏ రోజుకారోజు పనిచేసే వారికి బయటకు పోతుంది. ఊపిరితిత్తులు, మూత్రము, చెమట, మలం, ఈ నాల్గింటి ద్వారా చెడు ఏ రోజు కారోజు బయటకు పోతే అయిదవది అయిన "లివరు" తీలిక అవుతుంది. పని వారు సక్రమంగా పనిచేస్తుంటే యజమానికి సుఖం గా వుంటుంది గదా! ఇక్కడా కూడా అంతే! ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతే వేరే వారికి భారం వుండదు కదా. అలాగే "లివరు" గారికి కూడా శ్రమ వుండదు. "లివరు" దేహం నుండి అన్ని విసర్జకావయవముల ద్వారా పంపవలసిన చెడును బయటకు పంపెతట్లు చూసుకుంటూ వుంటుంది.
అందుకని చెమట పట్టిన వాడికి యివన్నీ జరుగుతాయా? శరేరం వేడెక్కినప్పుడు ఆ వేడికి చెడు పదార్ధం త్వరగా కణాల నుంచి బహిష్కారానికి సిద్దమవుతుంది. ఏదైనా వేడికి విశాలమవుతుంది. చలికి బిగుసుకుంటుంది. మనం కూడా చూడండి. వేసవి కాలంలో విశాలంగా చాపుని పడు కుంటాము. చలికాలంలో ముడుచుకుని పడు కుంటాము. వేడి కి ఏ పదార్ధమైనా వ్యాకోచిస్తుంది. వ్యామం ద్వారా వేడెక్కినప్పుడు రక్తనాళాలు, కండరాలు, కణాలు వ్యాకోచించి ప్రసరణలు పెరుగుతాయి. అందువల్ల కణాలలోని చెడు త్వరగా బయటకు రావడానికి అవకాసము ఎక్కువ వుంటుంది. పని చేయకుండా భోజనం చేస్తే తయారయిన చెడు లోపలే వుండి రోగ కణాలను తయారు చేస్తుంది. చెమట ద్వారా పోవలసిన చెడు, చెమట లేనప్పుడు చర్మపు పోరలలోనే ఉండిపోతుంది. మనిషికి రోగాలు పుట్టడం అక్కడే మొదలవుతుంది.

7, ఏప్రిల్ 2008, సోమవారం

దంతధావన క్రియ ___ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

ఇక పళ్ళు తోముకునే విషయం ఆలోచిద్దామా ! మనకు శరీరం లోపల ఎంత స్వచ్చత ఉన్నదనేది నోట్లో వచ్చే వాసన తెలియజేస్తుంది. అలాగే నాలిక శరీరానికి అడ్డం లాంటిది. శరీరం ఆరోగ్యం గా ఉన్నదీ, అనారోగ్యం గా ఉన్నదీ నాలిక చూస్తే తెలిసిపోతుంది. శరీరంలో ఎంత రక్తం ఉన్నదీ నాలికను చూసి చెప్పవచ్చు. విరోచనం సాఫీగా అవని వారికి, ప్రేగులలో చెడు, బాక్టీరియా ఎక్కువ వున్నవారికి, లివరులో (toxins) ఎక్కువ వున్నవారికి మరియు విసర్జకావయవాలలో చెడు బయటకు సరిగ్గా పోనివారికి నిద్ర లేవగానే నోరు దుర్వాసన వస్తుంది. మిగితా జీవులలో ఏవైనా పళ్ళు తోముకునేవి ఉన్నాయా? వేటి నోరైనా వాసన వస్తుందా? మరి మనిషి నోరు వాసన రావడానికి కారణాలేమిటి? మాట్లాడేటప్పుడు నోట్లోనుంచి ఎదుటివారికి లాలాజలం ఇంత పడితే సహించలేము. చీ ! అనుకుంటాము. తిట్టుకుంటాము, తరువాత కడుగుకుంటాము కూడా. మరి చంటి పిల్లవాడి ఎంగిలైతే ఎవ్వరూ పట్టించుకోరు. సంతోషంగా తుడుచుకుంటారు. అదే పిల్లవాడు పెద్దవాడైనప్పుడు మరల అదే విధంగా పడితే ముందు సంతోషంగా తుడుచుకున్న వ్యక్తే అసహ్యముగా తుడుచుకుంటాడు. ఇంత జరగడానికి కారణం ఆలోచిస్తే చంతిపిల్లవాడు స్వచ్చమైన ఆహారంతో స్వచ్చమైన మనస్సు కలిగి వుంటాడు. పెద్దవాడైన తరువాత రుచులు గల ఆహారాలు తిని కలుషితమైన మనస్సుతో ఉంటాడు కాబట్టి వాడి నోరు వాసన అనిపిస్తుది. తను పెంచుకునే కుక్క చేత నాకిన్చుకుని త్రుప్తి పడుతుంటాడు. మన ఇంట్లో కుక్క మనం తినే ఆహారం తిని మనతోబాటు జీవిస్తూ వుంటుంది. అది పళ్ళు తోముకోదు. అయినా దాని నోరు వాసన రాదు. మనం రోజుకు ఒకసారి లేదా రెండు సార్లో బ్రష్ చేసుకుంటూ ఉంటాము. పైగా మంచి వాసనలు వచ్చే, నురుగులు చిమ్మే పేస్టులతో కదా! మరి మనిషి ఇంత చేసినా నూరు మాట్లాడుతుంటే వాసన వస్తూనే వుంటుంది. కుక్క ఎంగిలిని అయినా మనిషి సహించగలుగుతున్నాడుగానీ ప్రక్కవాడి చొంగ ఇంత పడితే తట్టుకోలేడు.


నోరు రాత్రిపూట ౬-౭ గంటలు నిద్రలో కదపకుండా అలా వుంచి నందుకు లాలాజలం కదలికలు లేక, నోటిలో ఉండే బాక్టీరియా కారణంగా, గాలి తగలనందువలన, నోటిలో లాలాజలం దుర్వాసన వస్తూ వుంటుంది. అలాగే గొంతులో వుండే లారింక్స్, ఫారింక్స్ భాగాల దగ్గర ఊపిరితిత్తుల నుండి వచ్చి చేరిన కఫం నిలువ వుంటుంది. భగవంతుడిచ్చిన ప్రకృతి ఆహరం తింటే అసలు నోరు పుక్కిలించవలసిన అవసరం వుండదు. బృష్లతో పనే వుండదు. మసాలాలు, స్వీట్స్ తినడంవలన నోటి దుర్వాసనలు ఎక్కువగా ఉంటాయి. పళ్ళు ఊడిపోవడానికి కారణాలు కూడా ఇవే. కిళ్ళీలు, వక్కపోడులు వాడటం వలన కూడా పళ్ళు తొందరగా ఊడిపోతై. మనిషి ఆరోగ్యంగా వుంటే జీవితకాలంలో పళ్ళు ఊడవు. ఒక్క పన్ను కూడా కదలదు. ముసలివారికి పళ్ళు ఊడతాయి. ఇది సహజం అని అందరమూ అనుకుంటాము. అందరూ ఉప్పులు, మసాలాలు, స్వీట్లు తిన్నవారే కదా! మరి ముసలి జంతువులకు పళ్ళు ఊడిపోవడం లేదు గదా! ఇదంతా మన ఆహార లోపం వలననే గదా! పళ్ళు ఊడితేపళ్ళు కట్టించుకోవచ్చులే అని, ఎవరికి వారు ఉన్న పళ్ళు పాడవకుండా చూసుకోవాలని అనుకోవడం లేదు.
పేస్టులు పెట్టి పళ్ళు తోముకోవడము వలన నోట్లో లాలాజలం ఎక్కువ తయారవదు. అదే వేపపుల్ల అయితే చేదుకు లాలాజలం ఎక్కువ ఊరుతూ వుంతుంది. పైగా చేదుకి నోట్లో క్రిములు కదిలి బయటకు పోతాయి. బావిలో పాత నీరు తోడే కొద్దీ కొత్త నీరు ఊరుతూ వుంటుంది కదా! అలాగే నోట్లో చెడు లాలాజలం అంతా వేప చేదుకు బయటకు కారిపోయి, క్రొత్తది ఊరుతూ వుంటుంది. అందువల్ల వేపపుల్ల పెట్టి కడిగితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే గానుగు, మర్రి ఊడ, ఉత్తరేణి పుల్లలతో కడిగితే నోట్లో నురుగు కూడా వస్తుంటుంది. పెద్దలు నాలిక గీసేతప్పుడు వ్రేళ్ళు అంగిటి లోనికి పెట్టి డోకు కునే వారు . దీనివల్ల గొంతులో స్వరపేటిక వద్ద ఉండిపోయిన శ్లేష్మం అంతా బయటకు తెగి పడిపోయేది. మరి యిప్పుడు ఇంట్లో పళ్ళు తోముకోవడం కదా! కాన్ద్రిస్తే మోత వస్తుందని, మెల్లగా పని పూర్తి చేస్తారు. గొంతులోకి రాత్రి నుండి చేరిన చెడు, పళ్ళు తోముకునే తప్పుడు ఉమ్మివేయకపోతే అది తినేటప్పుడు మరల ఆహరం ద్వారా లోపలికి పోతుంది. పళ్ళు తోముకునేతప్పుడు గొంతులోని కఫాన్ని కాండ్రించి ఉమ్మివేయడం చాల మంచింది. కుదిరినప్పుడు పళ్ళు తూము పుల్లతో తోముకోవడం నోటి ఆరోగ్యానికి మంచిది.

4, ఏప్రిల్ 2008, శుక్రవారం

నీతి వాక్యాలు-౧

౧. వివేకి మౌనం, మూర్ఖత్వం; మూర్ఖుడికి మౌనం, వివేకం.
*
౨. తనలో తాను త్రుప్తి పొందలేని వాడు బయట ఎక్కడా దానిని పొందలేడు
**
౩. అన్ని మోసాలలోనూ ఆత్మవంచనే అధమాధమం.
***
౪. ఊర్పు అనేది వెగటుగా వుంటుంది. దాని ఫలం మాత్రం అమృతం.
****
౫. కాలమే ఉత్తమ గురువు - ప్రపంచమే ఉత్తమ గ్రంధం.
*****
౬. ఎంతకాలం జీవించడం అనేది కాదు. ఏమి సాదించామనేది ముఖ్యం.
******
౭. చేసిన చెడ్డ పని తిరిగి చేయకపోవడమే నిజమైన పశ్చాతాపం.
*******
౮. నీచమైన దానికోసం ఉన్నతమైన దానిని విడిచి పెడితే, అది త్యాగం అనిపించుకోదు.
********
౯. అందం కాంతిని ఆకట్టుకుంటుంది. సౌశీల్యం హృదయాన్ని దోచుకుంటుంది.
*********
౧౦. సారధి సమర్దుడైతే ఇంద్రియాలనే గుర్రాలు అదుపులో ఉండే ఉత్తమాశ్వాలు అవుతాయి.
**********
౧౧. క్షమా, దయ, రుజువర్తనం నిత్య సంతృప్తికి సులభ మార్గాలు.
***********
౧౨. గెలవక పోతే నిరాశ వద్దు. కానీ తిరిగి ప్రయత్నించక పోతే సర్వ నాశనం తప్పదు.
************
1౩. ఆర్ద్రత వారి మాటలు ఆచరనీయాలుకావు.
*************
౧౪. కలుషితమైన మనస్సు వున్న విషయాలను వున్నట్లుగా అర్ధం చేసుకోనివ్వదు.
**************
౧౫. పుట్టుక పుట్టినందుకు భగవంతుడు సంతోషించే పని ఏదైనా ఒకటి చెయ్యి.

_____________________________

3, ఏప్రిల్ 2008, గురువారం

వడ దెబ్బ తగల కూడదంటే __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

ఎండలో మనం తిరిగేటప్పుడు, ఎండా నుండి మన చర్మము రక్షించుకునేందుకు మన శరీరము తనలో ఉన్నా నీటిని ఆవిరి చేస్తూ, చర్మాన్ని చల్లబరచుకుంటూ ఉంటుంది. శరీరం ఈ కార్యక్రమాన్ని చేయాలంటే తన లోపల సరిపడా నీరు ఉండాలి. ఆ నీరు కూడా, ఎందలోనికి వెళ్ళే వారికి, లోపల ఉన్న నీరు కొంత చర్మానికి ఖర్చు అవ్వడంతో, శరీరంలో అవసరానికి సరిపడా నీరు తగ్గిపోతుంది. శరీరంలో నీరు తగ్గే సరికి తలకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం, అందులో నీటి శాతం తగ్గటం ఇవన్నే కలిసి తల సున్నితమైన భాగం కాబట్టి ఇక కళ్లు తిరగటం, తూలడం మొదలగునవి జరుగుతూ ఉంటాయి. రోహిణీ కార్తేలలో కూడా వేడి మనల్ని ఏమి చీయకుండా వెన్నెల్లో తిరిగినట్లుగా ఎండలో తిరగాలంటే.
చిట్కాలు:
౧) ఎప్పుడు బయటకు వెళ్ళినా మీ కూడా నీరు ఉంచుకుని పొట్ట ఖాళీగా ఉన్నప్పుడల్లా గంటకు ౨,౩, గ్లాసుల చొప్పున త్రాగుతూ ఉండాలి.
౨) దాహం వీసినప్పుడు నీటినే త్రాగండి. తప్ప ఇతర పానీయాలు త్రాగాకండి. అవి దాహాన్ని తీర్చావు. రక్తంలోనికి నీటిలా ఆ క్రింక్స్ త్వరగా చీరావు.
౩) వేసవి ఎండలో కూడా మూత్రం సాఫీగా వచ్చేటట్లు మనం నీటిని త్రాగుతూ ఉండాలి
౪) ఎండలో తిరిగేవారు తెల్లని కాటన్ బట్టలు వేసుకుంటే ఆ వేడిని త్రిప్పి కోడతై

1, ఏప్రిల్ 2008, మంగళవారం

శుభోదయం__ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

మన పూర్వీకులు ఆచరించిన మంచి ఆహారపు అలవాట్లను, మన ఇప్పటి ఆహారపు అలవాట్లను పరిశీలిద్దాం.
ప్రాతః కాలం లో నిద్ర లేస్తే ఆరోగ్యానికి మంచిదంటారు పెద్దలు. పడుకునేసరికి అర్ధరాత్రి దాటిపోతుంది. ఇక తెల్లవారుజామున లేవాలంటే ఏమి లేవగలరు? పెద్దలు ఆ వాతావరణం ఎంత మంచిదన్న ఏమి చేయగలరు ? వ్యాపారాలు, ఉద్యోగాలు జీవితానికి తప్పవు గదా ! రాత్రి పూట ఐతే నలుగురూ చేరడానికి, కలవడానికి వీలుంటుంది. మేము ఉద్యోగస్తులముమెందలకడనే ఇంటికి చేరాలంటే ఎలా కుదురుతుంది అంటారు? అందుచేత ఉదయం లేచేసరికే పావు ప్రొద్దు గడిచిపోతుంది. లేవగానే పాచిముఖాన్నే బెడ్ కాఫీలు, టీలు కావలనిపిస్తుంది. నిద్రాలో శరీరం చెడులు విసర్జించే కార్యక్రమం లో వుంటుంది. నిద్ర నుంచి మేలుకున్న తరువాత కూడా అదే పని కొనసాగుతూ వుంటుంది. నిద్రలేచిన వెంటనే మన నరాల శక్తి ఎక్కువ పెద్ద ప్రేగులామీద పనిచేస్తూ వుంటుంది. ఎందువల్లనంటే శరీరం లో ఎక్కువ వ్యర్ధ పదార్ధం అక్కడే నిలువ వుంటుంది. కాబట్టి రాత్రంతా అక్కడకు నెత్తిన చెడును బయటకు పంపించే వరకు మనస్సుకు విశ్రాంతి ఉండదు. అంటే రాత్రి అంతా చిన్న ప్రేగులలో, పొట్టలో ఉన్నా చెడును, విసర్జక పదార్దాలన్నింటినీ, మలశాయానికి చేర్చి ఉంచుతుంది. మనం నిద్ర లేచిన వెంటనే పనులు ఏమీ చీయకుండా వుంటే, మనలోని శక్తి అంతా సాఫీగా విరోచనము అయ్యేటట్లు సహకరిస్తుంది. అలా కాకుండా, మనం లేచిన వెంటనే, విరోచనం కాక ముందే బెడ్ కాఫీ తగుతామనుకోండి, మనలోని శక్తి మలం ఉన్నా ప్రేగు నుండి వెంటనే పొట్టలోకి వచేస్తుంది. మరి కాఫీని జీర్ణం చీయడానికి శక్తి కావాలి కదా. విరోచనం సంగతి తరువాత అని పోత్తపని ముందు చీపడుతుంది. నిద్రలేచిన దగ్గర నుండి మనము ఏదో ఒక టిఫిన్ తినే వరకు ఇంకా విసర్జించే పనిలో వుంటుంది.
ఉదయం పూట సూర్యుడి వీడి కిరణాలు ప్రారంభమయ్యే దగ్గర నుండి చెడును విసర్జించే కార్యక్రమం తగ్గుముఖం పడుతూ వుంటుంది. సూర్యుడి వేడి పెరిగే కొద్దీ ఆకలి పెరుగుతూ ఉంటుంది. సూర్య కిరణాలు వేదేక్కడం ప్రారంబించిన దగ్గర నుండి మనం తినడం ప్రారంభించవచ్చు. మనం ౮ లేచామనుకోండి, లేచిన తరువాత జరుగవలసిన విసర్జనకు అవకాసం ఉండదు. అప్పుడే ౮ గంటలు ఐఏపొయిన్ధిఅని, వెంటనే ముఖం కదిగీసుకుని టిఫిన్ తినడం జరిగుతుంది. అదీ తెల్లవారుజామున ౪,౫ గంటలకు లేచామనుకోండి, మన పూర్వీకులకులాగా ఎక్కువ సమయం సుమారు ౨,౩ గంటలు టిఫిన్ తినే ముందు పొట్ట ఖాళీగా వుంటుంది. ఆ సమయంలో శరీరం చెడును విసర్జించడానికి ఎంతో ముధ్యమైనది. తెల్లవారు జామున లేచిన వెంటనే నీరు త్రాగి మల విసర్జన చేస్తే చాలావరకు తేలిక అనిపిస్తుంది. ఆ తరువాత శారీరక శ్రమ గానీ, లెదా యోగాసనములు ప్రాణాయామం లాంటివి కూడా రాత్రి కదిలిన చెడును విసర్జక అవయవాల ద్వారా బయటకు పంపడానికి అవసరం. అదీ విధంగా నీరు ఒక లీటరుకు పైగా త్రాగడం వలన రక్తంలోనికి వచిన చెడు, కనాలలో రాత్రి సమయంలో కదిలిన చెడు, ఈ నీటిలోనికి వాచి అది చెమట, మల మూత్రాల ద్వారా బయటకు విసర్జించబడుతుంది. మరల ఇంకొక లీటరు నీటిని త్రాగి చెడును విసర్జించే కార్యక్రమంలో శరీరానికి సహకరించాలి. ఇలా నిద్ర లేచిన తరువాత ౨,౩, గంటలు శరీరానికి నీటిని తప్ప వేరే పదార్ధం ఇవ్వకుండా శారీరక వ్యాయామం చేస్తూ వుంటే అప్పుడు శరీరం దాని ధర్మాన్ని అది (విసర్జించడం) పూర్తిగా నెరవేరుస్తుంది. ఇది మన ఆరోగ్యానికి శుభోదయం.

పరిచయం__ మంతెన సత్యనారాయణ రాజు

తీగకు పందిరి పరిచయమితేఆ తీగ, పందిరి బంధం పెనవేసుకుంటుంది. మనిషికి మంచి అలవాట్లతూ పరిచయం - మంచి మనస్సుకు ఆరోగ్యానికి అనుబంధం. పెద్దల నుండి అలవాట్లు పిన్నలకు పరిచయమవుతూ ఉంటాయి. మంచివారితో పరిచయం మంచి అలవాట్లకు, చెడ్డవారితో పరిచయం చెడ్డ అలవాస్త్లకు దారితీస్తుంది. భగవద్గీతలో చెప్పినట్లు ఉత్తములైన వారు వేటిని ప్రమాణంగా తీసుకుని ఆచరిస్తారో, వాటిని మిగితా వారు అనుసరిస్తారు. మనం ఎలాంటి తిండి తింటే అలాంటి ఆలోచనలు వస్తాయి. మనకు ఎలాంటి ఆలోచనలు వస్తే అలాంటి పనులు చేస్తాము.
'''' ఎలాంటి తిండో అలాంటి త్రేపు '''' అన్నట్లు ఎలాంటి అలవాట్లు మనకు ఉంటాయో, అలాంటి ఆరోగ్యం మనకు ఉంటుంది.

కడుపు నొప్పి తగ్గాలంటే__ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

కడుపు నొప్పి వస్తే నొప్పికి మాత్ర వేసుకుని నొప్పిని పూర్తిగా తగ్గించుకొని, కడుపుని వదిలి వీస్తారు. దానితో మరలా మరలా వస్తూ ఉంటుంది. ముఖ్యముగా పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం బాగా ఉనవారిలో ఈ సమస్య ఉంటుంది. కారణాలు చూస్తే, పొట్ట నిండా భోజనం తిన్న తరువాత, ఈ బరువు వెళ్లి మలం ప్రేగులపై పడితే ఆ ఒత్తిడికి నొప్పి కొందరికి తిన్నాక వస్తుంది. విరేచనం అయ్యాక, అది పూర్తిగా కాక నొప్పి వస్తుంది. ప్రేగులలో బంక బాగా ఉన్నప్పుడు అది కదిలేతప్పుడు నొప్పి కలుగావచు. ప్రేగులలో గ్యాసు పట్టేసి కడుపు నొప్పి రావచు. అసలు విరేచనం రాక ప్రేగులు బిగదీసి ఇంకొందరికి రావచు. ఏ కారణాల చేత వచ్చినా మనకు నొప్పి తగ్గాలి, నొప్పికి మూలమైన మలమూ పోవాలి.
చిట్కాలు:-
౧) ఎప్పుడూ నొప్పిగా ఉన్నా ఆ నొప్పి భాగంపై నూనె రాసి వేడి నీటి బ్యాగ్ కాపడం రోజుకి 2,3సార్లు పెట్టుకోవచు.
౨) ఎనిమాని రెండుపూటలా 2,3 రోజుల పాటు చేస్తే ప్రేగులలో మలం అంతా పోతుంది.
౩) అన్నం కూరలు పెట్టడం మని పళ్ల రసాలు, పండ్లు, మజ్జిగ కొబ్బరి నెలలు, తేనే నెలలు, మంచి నీళ్లు మొదలగు ద్రవాహారాలతో రెండు రోజులుంచండి మంచిది.
౪) రోజూ రెండు పూటలా ఎనిమాకి ముందు పొత్తి కడుపు ఫై తడిగుడ్డ లేదా మట్టిపట్టీ గాని 20 నిమిషాలు ఉంచి తీసివేస్తే మలం బాగా కదులుతుంది.
౫) మలబద్దకం మళ్ళీ మళ్ళీ రాకుండా ఆహారం తిని, నీళ్లు బాగా తాగి రోజుకు 2,3, సార్లు విరేచనం ఐతే ఇక నొప్పిరాదు.

నడుం నొప్పి తగ్గాలంటే __ మంతెన సత్యనారాయణ రాజు

మెడ దగ్గర నుండి ముడ్డి భాగం వరకూ వెన్నుపూసలు ఒకదానిపై ఒకటి పేర్చి ఉంటాయి. ఇటుకకు ఇటుకకు మధ్య సిమెంట్ పొర ఉన్నట్లే పూసకు పూసకు మధ్య ఒక మెత్తి దిండు లాంటి భాగం ఉంటుంది. దానినే డిస్క్ అంటారు. మనం బరువును పట్టుకున్నప్పుడు లేదా మోస్తున్నప్పుడు ఆ బరువు పూసలమీద పడకుండా పూసకు పూసకు మధ్య డిస్కులు స్ప్రింగ్ లాగ వత్తిడి తెలియకుండా మెత్త దనాన్నిస్తై. కారు గూతులలో వెళ్ళినా లోపలున్న వారికి కుదుపుడు తెలియకుండా స్ప్రింగులు కాపాడినట్లే డిస్కులుమన వెన్నుముకను కాపాడుతూ ఉంటాయి. ఎప్పుడూ ముందుకి వంగికూర్చుని ఆఫీసుల్లో పని చేసుకునేవారికి, వంకర టింకరగా కూర్చునే వారికి, మెత్తటి పరిపుల మీద పడుకునే వారికి, స్కూటర్ల మీద ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి ఈ డిస్కులు వత్తిడికి గురి అవుతాయి. దీని కారణంగా నడుము నొప్పి, కాలుజాలు మొదలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ఎక్కువ శ్రమ చేసినప్పుడు నడుము కండరాలు కూడా వతిడికి గురి అవుతాయి. దీనివల్ల నడుము మధ్య భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది. ముందుకు వంగితే ఎక్కవ అవుతూ ఉంటుంది. విశ్రాంతిలో బాగుంటుంది.
చిట్కాలు:
౧) స్పాంజి పరుపులు మాని పలుచని బొంతలాంటి వాటిపై పాడుకోవడం మంచిది.
౨) నడుము భాగానికి నూనె రాసి రబ్బరు బ్యాగ్లో వేడి నీరు పోసి రెండు పూతల కాపడం పెట్టుకుంటే కండరాలకు ఉపశమనం కలుగుతుంది.
౩) నడుమును ముందుకు వంచే పనులు మాని ఎక్కడ కూర్చున్న నిటారుగా కూర్చుంటే మంచిది.
౪) ప్రతిరూజూ కూడా నడుమును ముందుకు వంచే వ్యాయామాలు పూర్తిగా మాని, కేవలం వెనక్కి వంచే ఆసనాలను మాత్రమే చేస్తే మంచిది. అవి భుజంగాసనము, ధనురాసనము, ఉష్ట్ట్రాసనం మొదలగునవి. అవకాశముంటే రెండుపూటలా వీటిని చేస్తే త్వరగా తగ్గుతుంది.