8, సెప్టెంబర్ 2008, సోమవారం

స్నానం విశిష్టత__ డాక్టర్ మంతెన సత్యనారాయణ raju

ప్రతి ఒక్కరికీ సామాన్యంగా ఉదయం స్నానం చేయడం అలవాటు వుంటుంది. కానీ ఆ స్నానాన్ని ఏదో నాలుగు చెంబులు చేసేస్తే పని అయిపోతుందని మ్రోక్కుబడిగా గడిపేస్తారు. స్నానం ఎంత ఆరోగ్యమో తెలిస్తే అలా చేయలేము. మన శరీరంలో చలిని స్వీకరించే కణాలు ఎక్కువగా ఉంటాయి. వేడిని స్వీకరించేవి కొద్దిగా వుంటాయి. పెద్దలు చన్నీటిని సజీవమని, వేడి నీటిని చచ్చిన నీరని అంటుంటారు. చన్నీటి స్నానం చేయడం వలన చర్మానికి, కండరాలకు, రక్తనాళాలకు సంకోచ వ్యాకోచాలు రెండూ ఉంటాయి. అదే వేడి నీరు చేసినప్పుడు వ్యాకోచించడమే జరుగుతుంది. ఉదయం స్నానం చన్నీటి తో తలకు చేయాలి. ఎక్కువమంది స్నానం మెడవరకే చేస్తారు. తల మనది కాదంటారా? శరీరం సుభ్రమయితే సరిపోతుందంటారా? తల అక్కరలేదా ? అనింటి కంటే మనస్సుని చల్లబరచడం చాల ముఖ్యం. ౨౪ గంటలూ ఎక్కువ పని చేసే మనస్సు నిద్రలో కూడా ఎంతోకొంత పని చేస్తూనే వుంటుంది. అలాంటి మనస్సును చల్లబరిస్తే ప్రశాంతంగా వుంటుంది. చన్నీటిని తలకు పోసుకోవడం వలన తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చన్నీటితో భుజాల వరకు పోసుకుని, తల మీద చన్నీరు పోయనప్పుడు భుజాల నుండి క్రింద భాగాలలో వేడి అంతా తలకు ఎక్కుతుంది. ఉదాహరణకు వేసవి కాలంలో కాలే నేల మీద నీరు పోస్తే నెలలోని వేడి అంతా పైకి వస్తుంది కదా! అలాగే చన్నీటితో తల తడవనప్పుడు, శరీరం తడపడం ద్వారా వచ్చిన వేడి వెను వెంటనే పై ప్రదీశానికి ఎక్కుతుంది. మనస్సు వేడెక్కకోడదంటారు. చల్ల బరచ వలసిన మనస్సును వేదేక్కిస్తున్నాము. రోజంతా లేనిపోని కోపాలు, టెన్షన్లు, చిరాకులు, పోట్లాతలతో, మనస్సును వేడెక్కించింది చాలక ఆఖరుకు స్నానం చేసేటప్పుడు కూడానా? తెలిసో, తెలియకో మనిషి ఎంత పొరపాటు చేస్తున్నాడు! మన పెద్దలు ఉదయం చన్నీటిని తలకు తప్పనిసరిగా పోసుకునేవారు. వేసవిలో వారు బుర్ర వేడెక్కకుండా నెత్తికి గొడుకు, కాళ్ళకు చెప్పులు తప్పనిసరిగా వాడేవారు. మరి ఇప్పటి అందరి అలవాట్లు ఎలావున్నాయి అంటే ప్రతి రోజూ స్నానం చేసేది ఒక పూట. అదీ వేడి నీటితో వంటికి మాత్రమే . పైగా చేయివేస్తే జర్రున జారి, నురుగులు వచ్చే సబ్బులు, నాలుగు చుక్కలు షాంపూ వేస్తే రుద్దీ రుద్దకుండానే పొంగిపోయే నురుగులు. సబ్బులలో మురుకిని పోగొట్టి, నురుగు వచ్చేటట్లు చేసే పదార్దాలు వుంటాయి. వాటిని సర్ ఫేస్ యాక్టివ్ ఏజెంట్లు అంటారు. అవి చర్మం మీద మురికితోబాటు చర్మంపైన సున్నితమైన పొరను పోగొడతాయి. అందుకనే సబ్బుపెట్టి స్నానం చేసిన తరువాత చర్మం పొడిగా, తెల్లగా, ఎండిపొయినట్లు వుంటుంది. అలావస్తుందని మరలా చర్మం మీద కోల్డ్ క్రీములు గానీ నూనె గానీ రాసుకుంటారు. చర్మం ఎప్పుడూ నిగ నిగలాడుతూ ఉండాలనుకుంటారు. అందరికీ చర్మం ఎప్పుడూ అలాగే వుంటుంది. దానిని రోజూ సబ్బులు వాడి పోగొట్టుకుని మరలా క్రీములు రాసుకుంటూ ఉంటాము. చలికాలంలో కూడా చర్మం పగుళ్ళు కానీ, తెలుపుగా గానీ సబ్బులు రుద్దకుండా వుంటే రాదు. ఏ క్రీములు నూనెలు రాసే అవసరమే లేదు. సబ్బు రుద్దడం వలన ఇంకో నష్టం ఏమిటంటే, సబ్బురాసుకుని రెండుసార్లు పైకి క్రిందకి చేతిని కదిపేసరికి నురుగు వచ్చేస్తుంది. అందరి అభిప్రాయం ఏమిటంటే నురుగు వస్తే కుళ్ళు వదిలి నట్లేనని. ఆ నురుగులో చర్మంపై నున్న దుమ్ము, మురికి, జిగురు పోవచ్చు. చర్మాన్ని రుద్ద కుండానే నురుగులు రావడమే ఇక్కడ నష్టం. అది ఎలాంటిదంటే ఉప్పు, కారాలు ఎక్కువుగా ఉన్నా ఆహారపు ముద్దను నోట్లో పెట్టుకున్నప్పుడు, నమలకుండానే లాలాజలం ఊరి ముద్దను త్వరగా మింగేస్తాము. సరిగా నమలనందు వలన ఆహారం అరగదు. సబ్బులలో నున్న మందుల కారణంగా, రుద్దకుండా, నురుగు రావడంతో, చర్మాన్ని చేతులతో మర్దన చేయడం తగ్గిపోతుంది. మన పెద్దలు సబ్బు వాడేవారు కాదు. వారు సున్నిపిండితోనో, వట్టి చేతులతోనో చర్మాన్ని రుద్దేవారు. చర్మంపై మట్టి పోవాలని అలా రుద్దే వారు. అలా రుద్దడం వలన చర్మం వేడెక్కుతుంది. ఎందు వల్లనంటే చర్మాన్ని రుద్దేటప్పుడు లోపలవున్న రక్తం ఎక్కువ చర్మానికి వస్తుంది. తద్వారా స్నానం చేసేటప్పుడు చర్మానికి రక్తప్రసరణ బాగా జరగడం ఒక ప్రయోజనం. రెండవది చర్మ రంధ్రాలలో నున్న చెడు పదార్ధం కూడా స్నానం చేసేటప్పుడు గట్టిగా రుద్దడం వలన బయటకు వచ్చేస్తుంది. మామూలుగా చర్మానికి రక్తప్రసరణ మెల్లగా జరుగుతుంది, చర్మం చివ్వరి భాగం కాబట్టి. బంతి భోజనాలలో ముందు కూర్చున్నవాడికి వంటలు లోటులేకుండా త్వరగా అందుతాయి కదా! అలాగే గుండె కూడా దగ్గరవున్న భాగాలకు రక్తాన్ని త్వరగా అందించి, దూరంగా వున్నవాటికి అలస్యంగా అందిస్తుంది. అందువలనే చర్మ వ్యాధులు తొందరగా తగ్గవు.
**** అలాగే మన చర్మానికి రక్తప్రసరణ బాగా జరగాలంటే శరీరాన్ని స్నానం చేసేటప్పుడు బాగా వేడెక్కేటట్లు రుద్దడం మంచిది. సబ్బులు వుంటే ఎక్కువ సేపు రుద్దలేరు. అందువల్ల సబ్బులు వాడడం మంచిది కాదు. సబ్బులు లీనప్పుడు మురికి వదలాలని చేతులతో భాగాలన్నితిని గట్టిగా రుద్దగలుగుతాము. శరీరాన్ని రుద్దేటప్పుడు కళ్ళను క్రిందనుండి పైకి రుద్దుకోవాలి. అలాగే చేతులను క్రింద నుంచి భుజాల వైపు రుద్దుకూవాలి. మనకు రక్తం ఆ విధంగానే పైకి నడుస్తున్నది కాబట్టి. అలా చేయడం వలన పైకి గుండెకు చేరే రక్తాన్ని మనం చేతులతో క్రిందకు నెట్టడం జరుగుతుంది. మనం విరుద్ధమైన పని చేసి నట్లవుతుంది. స్నానం చేసే ఒక మంచి పద్దతిని వివరిస్తాను.....____
స్నానం చేయడానికి వేళ్ళముందు ఒక మెత్తటి, తెల్లని నాప్కిన్ (జేబురుమాలు గుడ్డ) తీసుకుని వెళ్ళండి. రాసుకుంటే స్నానానికి ముందు నూనె రాసుకోవచ్చును. ఒక బాత్ రూంలో సబ్బులు లేకుండా చేయండి. ముందు శరీరాన్నంతిటినీ ఒక బకెట్ నీటితో పూర్తిగా తడపండి, ఆ మెత్తటి నాప్కిన్ ను తడిపి, పిండేసి, దానితో శరీరం అంతటినీ రుద్దండి. ఆఖరుకు తలను కూడా ఆ గుడ్డతోనే రుద్దుకోవచ్చు. సుమారు ౧౦-౧౫ నిమిషాలు రుద్దటానికి పట్టవచ్చు. ౧౫ నిమిషాలు గడిచే సరికి చర్మం వేడెక్కి, చమటలు పడుతుంటాయి. ఆ తెల్లటి నాప్కిన్ మట్టితో నల్లగా అయిపోతుంది. చర్మ రంధ్రాలలో నుంచి మురికి ఈ విధంగా స్నానం చేస్తే పూర్తిగా బయటకు పోతుంది. ౧౦-౧౫ నిమిషములు గుడ్డతో పూర్తిగా చర్మాన్ని రుద్దుకోవడం అయిన తరువాత మరల ఒక బకెట్ చల్లని నీళ్ళను తలపై నుండి పోసుకోవాలి. అలా పోయడం వలన రుద్దినప్పుడు వేడికి వ్యకోచించిన రక్తనాళాలు, చర్మ రంధ్రాలు అన్నీ మరలా చలికి మూసుకుపోతాయి. (సంకోచిస్తాయి) గుడ్డతో పాదాలను బాగా రుద్దుకోవడం వలన మట్టి బాగా పోయి పగుళ్ళు దరి చేరవు. ఈ విధంగా స్నానం చేయడం వలన చర్మ వ్యాధులు వచ్చే అవకాసం తగ్గుతుంది. సబ్బుల ఖర్చు ఉండదు. మనలో నుంచి ఎంత మురికి వచ్చిందీ ఆ తెల్లటి నాప్కిన్ ను చూస్తే తెలుస్తుంది. స్నానం చేసిన తరువాత మొహం, చర్మం ఎంత ఫ్రెష్ గా వుంటాయో, సాయంత్రం స్నానం చేసే వరకూ కూడా అలాగే వుంటాయి. దీనిని 'సంపూర్ణ స్నానం' అంటారు. చెప్పినట్లు చేయండి, మీరే ఒప్పుకుంటారు. ఇన్నాళ్ళూ స్నానం పేరు చెప్పుకొని, సబ్బుల పీరు చెప్పుకుని చర్మాన్ని ఎంత మోసం చేసామో అర్ధమౌతుంది.

6, ఆగస్టు 2008, బుధవారం

చుండ్రు తగ్గాలంటే...

1. చుండ్రు తగ్గాలంటే: - మన పెద్దలకు చుండ్రు అనే సమస్య తెలియదు. ఈ రోజుల్లో చుండ్రు అంటే తెలియని వారు ఉండరు. సహజంగా మన చర్మం వాతావరణం ని రక్షించుకోవడానికి ఒక రకమైన జిగురులాగా ఉండే క్రొవ్వు పదార్ధాన్ని వదులుతూ ఉంటుంది. దీనివలన చర్మం మెత్తగా ఉంచబడుతుంది. తలలో ఈ జిగురు గాలి సరిగా తగలక పేడుగా కట్టి పెచ్చులు పెచ్చులుగా ఊడుతూఉంటుంది. స్నానం రోజు శరీరం వరకే చేసి తల మనది కాదన్నట్లుగా కొందరు వదిలేస్తారు. దాని వలన తల శుభ్రం కాక చుండ్రు వస్తుంది. షాంపూలు తరచుగా వాడేవారికి కూడా అందులో కెమికల్స్ చర్మం ఫై పొరను పాడు చేసి ఎక్కువ పొట్టు రాలేతట్లు చేస్తాయి. షాంపూ పెట్టిన రోజున బాగానే వుండవచ్చు కాని తరువాత రోజునుండి వాటి నష్టం బయటపడుతుంది. చుండ్రును పోగొట్టే షాంపూ అని మనం మోసపోతున్నాము. కేవలం తల స్నానం చేయనందువల్ల వచ్చే సమస్యను పరిష్కరించుకోవటానికి ఎంత డబ్బు వృధా చేస్తున్నారు, దీని కోసం ఈ మందులు వాడవద్దు.
***
చిట్కాలు:
1. ప్రతిరోజు చన్నీళ్ళ తల స్నానం చేయండి, వేడి నీళ్లు తలకు పోయకూడదు. నీళ్లు మరీ చల్లగా వుంటే కొద్దిగా వేడి నీరు కలిపి (బావిలో నీటి లాగా) ఆ నీళ్లు పోసుకోండి.
***
2. వారానికి, పడి రోజుల కొకసారి కుంకుడు కాయ రసంతో తలన్తుకోండి. చుండ్రు మరీ ఎక్కువగా వున్నప్పుడు పొడి తలకు ఆ రసం బాగా పట్టించి 5, 10 నిమిషములు అలా వుంచి అప్పుడు చన్నీటి స్నానం చేయండి. ప్రతి రోజు ఇలా కుంకుడు రసంతో ఏడు, ఎనిమిది రోజులు చేయవచ్చు (సమస్య ఎక్కువగా వున్నవారే ప్రతిరోజూ కుంకుడు రసం వాడండి).
***
3. తల ఆరిన తరువాత కొబ్బరి నూనె రాసుకోండి. నూనె రాస్తే చుండ్రు ఎక్కువ అవుతుంది అనుకుంటారు. రోజూ తల స్నానం చేసేవారికి ఏమీ కాదు. చలి కాలంలో చర్మం తెల్లగా పొట్టు లేస్తున్నప్పుడు మనం కొబ్బరి నూనె రాస్తే అది కరుచుకుపోయి సమస్య తగ్గినట్లే. చుండ్రుకు కూడా నూనె రాయవచ్చు. మన పెద్దలు నూనె బాగా రాసుకున్నందుకే చుండ్రు రాలేదు.
***
4. తల నూనె జిడ్డుగా వుంటే ప్రతి రోజూ (ఒక చేకా లేదా కాయ) నిమ్మరసాన్ని తలకు (తల పై చర్మానికి) రాసుకొని తల స్నానం చేస్తే జిడ్డు పోతుంది. తలలో జిగురు గ్రంధులు ఊరించే ఎక్కువ జిగురును శుభ్రం చేయడానికి నిమ్మరసం బాగా పనికొస్తుంది.
***************

5, ఆగస్టు 2008, మంగళవారం

దొంగ గుర్రం___

ఒక బట్టల వ్యాపారి దగ్గర ఒక గుర్రం వుండేది. అతను ఆ గుర్రం వీపుపైన బట్టల మూటలు వుంచి, ఒరూరు తిరిగుతూ వ్యాపారం చేసేవాడు. ఆ పని చేయడం గుర్రానికి అస్సలు ఇష్టం వుండేది కాదు. ఎలాగైనా అక్కడి నుండి బయట పడి స్వేచ్చగా బ్రతకాలని ఆరాట పడసాగింది. యజమాని ఎంత బాగా చూసినా దానికి అసంతృప్తి గానే వుండేది.
***
ఒక రోజు ఒక దొంగ వ్యాపారి ఇంటికి కన్నం వేసాడు. ఆ సమయంలో వ్యాపారి ఘాడ నిద్రలో వున్నాడు. దొంగ వ్యాపారి ఇంటిలోకి చొరబడి ధాన్యపు మూటలు ఒక్కొక్కటి ఇంటి వెనకాల నిలబెట్టివున్న బండి పైకి చేరవేయ సాగాడు.
***
జరుగుతున్న తతంగాన్ని పసికట్టింది గుర్రం. యజమానిని అప్రమత్తం చేయాలన్న ఆలోచనే దానికి రాలేదు. నిశ్సబ్దంగా చూస్తూ వుండిపోయింది. దొంగ చివరి బస్తాను మోసుకు వెల్లుతుండటంతో....
***
"అయ్యా అదే చేత్తో నా కట్లు కూడా విప్పండి" అని అడిగింది.
***
"ఎందుకు?" దొంగ అడిగాడు.
***
"ఇక్కడ బ్రతకడం నాకు ఇష్టం లేదు"
***
"మరి నీ కట్లు విప్పితే నాకేంటి లాభం?" దొంగ అడిగాడు.
***
"కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి వుంటాను" అంది.
***
దాని మాటలకు ఒక్క క్షణం అలోచించి చిన్నగా నవ్వాడు దొంగ. "అవునూ... నేను దొంగని. నీకా విషయం ఇప్పటికే అర్ధమయి వుండాలి. మరి నీ యజమానిని నిద్రలేపలేదేమి.
***
"నాకు నా యజమాని అంటే అసహ్యం. అతని సొత్తు పోతే నాకేం? చూడు... నువ్వు దొంగిలిస్తుంటే నీ పనికి అవకాసం వున్నా అడ్డు పడలేదు నేను. మరి కృతజ్ఞతగా నేను చెప్పిన పని చేయడం నీ ధర్మం" అంది గుర్రం.
***
గుర్రం మాటలకు నవ్వాడు దొంగ, " కృతజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీలో అవి వున్నాయా? నిన్ను సంరక్షించే నీ యజమాని పట్ల నీకు క్రుతగ్నతే లేదు. వుంటే నువ్విలా స్వార్ధంగా ప్రవర్తించవు. నీలాంటి దాన్ని వెంట తీసుకుపోయి వుంచుకోవటం ఎప్పటికీ ప్రమాదమే. విశ్వాసం లేని పని వాడికి యజమాని అయ్యే కంటే అసలు.... పని వాడు లేక పోవడమే మేలు..." అంటూ అక్కడి నుంచి నిశ్సబ్దంగా జారుకున్నాడు దొంగ.
***
ఒక దొంగలో వున్న నీతి తనలో లేనందుకు విచారిస్తూ మౌనంగా నిలబడిపోయింది గుర్రం.

4, ఆగస్టు 2008, సోమవారం

ఈజీ వే ......

" ఈ గొర్రెల మందలోని గొర్రెలను ఎవరు ముందుగా లెక్క పెడతారో చూద్దాం" ఉపాద్యాయుడు పడి మంది విద్యార్దులకు పోటీ పెట్టాడు.
***
అందులో గణేష్ అందరికంటే ముందు లెక్కబెట్టి బహుమతి గెల్చుకున్నాడు.
***
'అందరి కంటేముందు నువ్వు ఎలా లెక్క బెట్టగలిగావు' అడిగాడు ఉపాద్యాయుడు ఆశ్చర్యకరంగా
***
ఈముంది సార్ ఈజీ. ముందు గొర్రెల కాళ్ళను చక చకా లెక్కబెట్టాను. తర్వాత నలుగుతో భాగించానంటే' జవాబిచ్చాడు గణేష్.

ద్విన చర్య ......

ఒక ప్రసిద్ధ కదా కదారచయితను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు ఓ విలేఖరి.
***
"మీ దిన చర్య ఎలావుంతుందండీ" అడిగాడు.
***
"ఉదయం ఆరుగంటలకు నిద్రలేస్తాను. వెంటనే పళ్ళు తోముకొని కాఫీ తాగి స్నానం వగైరాలు ముగించుకొని టిఫిన్ చేస్తాను, గంట సేపు పేపర్లన్నీ చదివి కాసేపు పిల్లలతో గడిపి ఆఫీసుకు వెళ్ళిపోతాను. సాయంత్రం క్లుబ్బుకెళ్ళి ఫ్రెండ్స్ తో గడిపి తొమ్మిది గంటలకు ఇంటికొచ్చి స్నానం చేసి భోంచేసి నిద్రపోతాను" అని చెప్పాడు రచయిత.
***
"మరి మీరు రచనలు ఎప్పుడు చేస్తారండీ" విలేకరి అడిగాడు.
***
"అవి మరుసటి రోజు చేసుకుంటాను" జవాబిచ్చాడు రచయిత.
-------------

స్పెషల్ ...

"ఎంటీ? మామూలు కాఫీ రొండు రూపాయలు. స్పెషల్ కాఫీ ఆర్రూపాయలా ? ఏమిటయ్యా స్పెషల్ ?" సర్వర్ని అడిగాడు సుందరం.
****
"అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీకు మొదటి సారి కాఫీ ఎలా ఇస్తారో మా స్పెషల్ కాఫీ ఎప్పుడూ అలాగే ఉంటుంది." చెప్పాడు సర్వర్.
-----------

నెట్టండి... నెట్టండి.....

విమానం కొద్ది సేపట్లో ఎగురుతుందనగా ఓ పల్లెటూరి ఆసామి క్యాబిన్లోకి వెళ్లి పైలెట్ ని ఇలా అడిగాడు ... "సార్ విమానంలో పెట్రోలుందో లేదో చెక్ చీసుకున్నారు కదా?"
***
"ఆ" పైలెట్ జవాబు ఇచ్చాడు.
***
"ఇంజన్ బాగా పని చేస్తోంది కదా?"
***
"ఆ అన్నీ సరిగ్గానే ఉన్నాయి"
***
"బ్యాటరీ గీట్రే అన్నీ బాగానే ఉన్నాయి కదా?" అన్నాడు ఆ ఆసామీ.
***
"దేనికడుగుతున్నారు ఇదంతా?"
***
పైలట్ అడిగాడు సందేహంగా.
***
"విమానం మద్యలో ఆగిపోయిందనుకోండి... దిగి నెట్టండి బాబూ అంటారు... అందుకే ముందే అడుగుతున్న" అన్నాడు ఆ పల్లెటూరి అతను.
*******

31, జులై 2008, గురువారం

లంఖణం ని పరమ ఔషధం అని ఎందుకు అన్నారు ?

శరీరానికి ఏదైనా ఇబ్బంది (జబ్బు) వచ్చి నప్పుడు అది కూరినట్లుగా మనము తినకుండా, తిరగకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే శరీరంలో సుమారు ౭౫ శాతం శక్తి పొడుపు చీయబడుతుంది. ఆ పొదుపైన శక్తిని శరీరం రోగం నుంచి రక్షించుకునే పనిలో వాడుకుంటుంది. శరీరంలో ఎక్కడ జబ్బు ఉందో ఆ జబ్బు రావడానికి ఏ క్రిములు కారణమో ఆ క్రిములు ఎక్కడ ఎన్ని దాగి ఉన్నాయో శరీరానికి తెలుసు. ఒక్కొక్క సారి ఎన్ని రక్త పరీక్షలు చసిన జ్వారానికి కారణాలు తెలియవు. పరీక్షలు చేసే పరికరాలకు ఒక్కో సారి విషయం అందాకా పోవచ్చు గానీ ఈ శరీరానికి మాత్రం లోపల జరిగేదంతా తెలుసు. ఏ రకమైన ఇన్ఫెక్షన్ లోపల ఉన్నా దానిని త్రిప్పి కొట్టడానికి ఆ సూక్ష్మ జీవుల చర్యకు ప్రతి చర్యను చేపడుతుంది. మామూలు పరిస్థితిలో కంటే లంఖణం చేసినప్పుడు శక్తి పొదుపుకావడం వలన, వేరే పనులు నిర్వర్తించే బాధ్యత లేకపోవడం వలన, శరీరం మరింత ఉత్సాహంగా శక్తివంతంగా తన సైన్యాన్ని (యాంటీ బాడీస్) రోగ క్రిముల పైకి పంపుతుంది. శరీరంలో ప్రవేశించిన రోగ క్రిముల సంఖ్యను బట్టి, బలాన్ని బట్టి అప్పటికప్పుడు క్రొత్త గా యాంటీ బాడీస్ ని శరీరం తయారు చేసుకోగలుగుతుంది. ఈ యాంటీ బాడీస్ అనేవి చెడ్డ సూక్ష్మ జీవులను (బాక్టీరియా). హాని కలిగించే క్రిములను చంపుతాయే తప్ప, శరీరానికి పనికివచ్చే బ్యాక్టీరియాని మాత్రం చంపావు. అదే యాంటీ బయోటిక్ మందులు వాడితే చెడ్డ క్రిములతో పాటు శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా మరియు ఆరోగ్యంగా ఉండే కొన్ని కణాలు కూడా చనిపోతూ వుంటాయి. ఉదాహరణకు ఈ మధ్య ఇరాక్ కు, అమెరికాకు జరిగిన యుద్దంలో అమెరికా వారు ప్రయోగించిన మారణాయుధాల వల్ల ఇరాక్ సైనికులతో పాటు అనేక మంది సామాన్య పౌరులు కూడా మరణించడం జరిగిందీ. అదే లంఖణం చేస్తే మనలోని శక్తి అంతా రోగనిరోధక శక్తిని ప్రేరేపించే దాని ద్వారా ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ తో మన శరీరంలో చేసే యుద్దము ధర్మ యుద్దము లాంటిది. మన దేశ స్వరాజ్యం కొరకు గాంధీగారు పోరాడిన పోరాటం లాగా మన శరీరం లంఖణం లో పోరాడుతుంది. లంఖణం లో ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ మన శరీరంలో నిలువయింది అలాంటి క్రిములు, సూక్ష్మ జీవులు శరీరంలోకి మళ్ళీ ఎప్పుడైనా ప్రవేసించితే వెంటనే వాటిని చంపివేయడానికి సిద్దంగా ఉంటాయి. ఇంతకు ముందు వచ్చిన ఇబ్బంది లాంటిది మళ్ళీ ఇప్పట్లో రాకుండా శరీరం కాపలా కాస్తూ ఉంటుంది. లంఖణం లు చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ బయోటిక్ మందులు వాడితే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. మన శరీరము రోగాన్ని త్రిప్పి గొట్టడానికి నేను యాంటీ బాడీస్ ను తయారు చేయలేకపోతున్నానని మనల్ని హెచ్చరించినపుడు మనం యాంటీ బయోటిక్ మందులు వాడటం తప్పు కాదు. ముందు శరీరానికి కొంచెం కూడా అవకాశమివ్వకుండా డైరెక్టుగా మందు జోలికి వెళ్ళడమే పెద్ద పొరపాటు. ఈ ప్రపంచంలో ఈ మందునైనా ఔషదమే అని అంటారు. ఏ మందునీ పరమౌషధం అని ఇంతవరకూ పిలవలేదు. ఒక్క లంఖణం ని మాత్రమే పరమౌషధమని ఎందుకన్నారంటే ప్రతి ఔషధం ఒక పదార్దం నుండీ తయరైనదే. శరీరం తయారు చేసుకునే ఈ ఔషధం మాత్రమే పదార్ధం లేని, ఔషధం కాని ఔషధం. అందుకే దీనిని పరమౌషధం అన్నారు. లంఖణం చెయ్యని ప్రాణి అంటూ ఈ భూమి మీద ఉండదు. అవన్నీ నాచురల్ యాంటీ బయోటిక్ ఐన లంఖణం ని సందర్భానికి వాడుతూ ఉంటాయి. మనము కూడా ఇక నుండీ అవసరానికి లంఖణం చేస్తూ, సలక్షణంగా బ్రతుకుదాము.

9, జులై 2008, బుధవారం

పొట్టను మాడిస్తే జబ్బులేలా తగ్గుతాయి?

మన శరీరానికి ఏదన్నాసమస్య వచ్చినప్పుడు తనంతట తానుగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అలవాటు శరీరానికి పుట్టుకతో వచ్చింది. అదే మన అదృష్టం. శరీరము ఈ పని చెయ్యకపోతే మనం ఏనాడో చచ్చిపోయేవాళ్ళము . (వాస్తవానికి చచ్చేది మనము కాదు శరీరము). తనకు వచ్చిన ఇబ్బంది నుండి రక్షించుకోవడానికి శరీరానికి అదనంగా శక్తి కావలసి వస్తుంది. మన శరీరములోని శక్తిలో ఎక్కువ భాగం ఆహారాన్ని అరిగించడానికి, శ్రమ చేయడానికి ముఖ్యమ్గా ఖర్చు ఐపోతూ ఉంటుంది. సుమారుగా మనలో ఉన్నా శక్తిలో 75 శతం శక్తిని ఈ రెండు పనులు చెయ్యడానికి శరీరం ప్రతి రోజూ ఖర్చు చేయవలసి ఉంటుంది. శరీరానికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బంది నుండి రక్షించుకోవడానికి తనలో రోజూ ఖర్చు అయ్యే ఈ 75 శతం శక్తిని పొడుపు చేసుకుని, రక్షణ కార్యక్రమానికి ఉపయోగించే పన్నాగం పన్నుతుంది. రోజంతా మనిషి అలవాటుగా తింటూ ఉంటే, అలాగే తిరుగుతూ ఉంటే మనలో శక్తి పొడుపు కాదు కాబట్టి, తినకుండా తిరగకుండా చేయడానికి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. నూరు తియ్యగా లాలాజలం ఊరుతూ ఉంటే తినాలని ఉంటుంది కాబట్టి నాలుకను పాచితో నింపి, దాన్ని చేదుగా చేసి, లాలాజలం ఊరకుండా చేసి మనకు ఆహరం మీద వాంఛ లేకుండా చేసి, పొట్టలో ఆహరం పడకుండా మొదటి జాగ్రత్త చర్య తీసుకుంటుంది. మనం హుషారుగా ఉంటే అటూ ఇటూ తిరుగుతూ పనిచేస్తాము కాబట్టి, తిరగకుండా ఉంచడం కోసం ఒళ్ళు నొప్పులుగా, పులపరంగా, నీరసంగా చేసి పడుకుంటే బాగుంటుందని మనకనిపించేతట్లుగా చేసి రెండవ జాగ్రత్త చర్య తీసుకుంటుంది. ఇలా రెండు రకాలుగా శరీరం శక్తిని పొదుపు చేసే ప్రయత్నం చేసి, రక్షణ కార్యాన్ని నిర్వహించడానికి ఆ శక్తి వినియోగిస్తూ ఉంటుంది. ఆ రక్షణ పని పూర్తయ్యే వరకూ మనకు తినాలని ఉండదు, తిరగాలని ఉండదు. ఇది శరీర ధర్మం. మీకు పుట్టాక ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా వచ్చాయా? రాలేదని ఎవరూ అబద్దం చెప్పలేరు. మనం తింటే తినవచ్చు, తిరిగితే తిరగవచ్చు. ఒక్క సారి ఆలోచించండి! శరీరం ఎవరిని బాగుచేయడానికి ఈ కష్టమంతా పడుతోంది. మన సుఖం గురించే కదా దాని తాపత్రయమంతా. అమెరికా నుండి బుష్ ను అడిగి కాస్త శక్తి అప్పుగా తెచ్చి ఇవ్వమని మనల్ని ఇబ్బంది పెట్టడం లేదే! మనల్ని నూతులలో, గోతుల్లో దూకమనడం లేదే! రక్షణ కార్యక్రమం చేపట్టడానికి కావలసిన శక్తి అంతా నాలో ఉన్నది నాకు సరిపోతుంది, నీవు ఆ శక్తిని వృధా చేయకుండా ఉంటే అదే నా అదృష్టంగా భావిస్తానంటుంది. అది అడిగింది ఒక చిన్న కోరికే గదా! ఇన్నాళ్ళూ నీవు శుభ్రంగా తినేటట్లు, తిరిగేతట్లు చేశాను, ఐనా ఈనాడు ఒక సారి కూడా థాంక్స్ చెప్పిన పాపాన పోలేదు. ఐనా పట్టించుకోకుండా నా డ్యూటీని నేను చీసుకుంటూ పోతున్నాను. కానీ, ఈ రోజు నాకు బాగోలేదు కాస్త రెస్టు ఇవ్వమని అడిగినా నా మాట వినవా! అని శరీరం సందర్భమొచ్చినప్పుడు ప్రదీయపడుతూ ఉంటుంది. ప్రతి రోజూ పట్టించుకోక పోయినా కనీసం ఆపద వచ్చినప్పుడైనా ఆదుకుంటే మన జీవనయానం, సుఖంగా సగేతట్లు చేస్తుంది గదా ! శరీరం గోడు వినిపించుకోవడానికి చదువు సంధ్యలు, తెలివి తేటలు, వైద్య శాస్త్రాలు అవసరం లేదు. అసలు మనకు ఆ గోడు వినిపించక పోవడానికి ఇవే అడ్డుగోడలు. పొట్టను మాడిస్తే జబ్బులేలా తగ్గుతాయి? అవన్నీ మూఢ నమ్మకాలు, సైంటిఫిక్ విషయాలు కాదు అని కొందరు వైద్యులు తిడుతూ ఉంటారు. పొలాన్ని దున్ని ఎండ గట్టినప్పుడే గట్టినప్పుడే తెగుళ్ళు తగ్గుతాయి. విద్యా శాస్త్రాలు, సైన్సు అనే మాట పుట్టక ముందే అసలు మనిషి పుట్టక ముందే పొట్టను మాడ పెడితే జబ్బులు తగ్గుతాయనే సైన్సు పుట్టింది. అదే ప్రకృతి సైన్సు. ఈ సైన్సు ను ఎవ్వరూ మార్చడానికి లేదు. జీవులున్నంత వరకూ ఈ సైన్సు వాటిని రక్షించేది కూడా. చివరకు మనకు కూడా అదే గతి. నమ్మిన వాడు ఆ జంతువుల్లాగా బాగుపడతాడు. నమ్మని వాడు మనిషిలా బాధపడతాడు.

7, జులై 2008, సోమవారం

పిక్కల నెప్పులు పోవాలంటే ... మంతెన సత్యనారాయణ రాజు

బలహీనత వల్ల ఎక్కువగా పిక్కల నొప్పులు వస్తూ వుంటాయి. ఆహరం మంచిగా తినకుండా ఎక్కువ పని చేసుకునే వారికి ఆ నీరసంలో ముందు పిక్కలు లాగుతాయి. ఎక్కువగా నడిచే వారికి ఆ కండరాలు శ్రమను తట్టుకోలేక వస్తూ వుంటాయి. శరీరంలో ఉప్పు, మెగ్నీషియం లాంటి లవణాలు తక్కువగా ఉన్నా పిక్కలు పట్టేస్తూ వుంటాయి. ఉప్పును పూర్తిగా మానిన వారికి క్రొత్తలో వారం, పది రోజులు వచ్చి ఆ తరువాత తగ్గుతుంటాయి. దీనికి పరిష్కారం ఏమిటంటే మనం చేసే పనికి శరీరం తట్టుకునేతట్లు మంచి ఆహరం తింటే సరిపోతుంది.

***

చిట్కాలు:

౧. తెల్లటి అన్నం మాని ముడి బియ్యం అన్నాన్ని వండుకొని రెండు పూటలా సరిపడా తింటే ౧౫, ౨౦ రోజులలో తగ్గుతాయి. ఎక్కువ పని వలన వచ్చే పిక్కల నొప్పులు ముడి బియ్యం అన్నానికి తగ్గిపోతాయి.

౨. ప్రతి రోజూ మధ్యాహ్నం భోజనంలో ఆకు కూరలను ముఖ్యమ్గా పాల కూర లాంటి వాటిని రోజూ వండుకుని బాగా తింటే లవణాల లోపం తగ్గుతుంది.

౩) పిక్కలు పట్టేస్తూ వుంటే లేదా ప్రయాణాలలో నడక ఎక్కువగా నడిచినందుకు నొప్పిగా వుంటే కొద్దిగా కొబ్బరి నూనె పిక్కలకు రాసి మర్దనా చేసి వేడి నీటి కాపడం ౧౦ నిమిషాలు పెట్టుకుంటే ఆ బడలిక అంతా పోతుంది.

4, జులై 2008, శుక్రవారం

లంఖణం ( ఉపవాసం) ని కనిపెట్టింది ఎవరు.... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు..,.,

దాహం వేస్తే నీరు త్రాగాలని మనకు తెలుస్తున్నది. శరీరానికి నీరు కావలసి వచ్చినప్పుడు అది అడుగుతోంది. మనము త్రాగుతున్నాము. ఈ విషయంలో అన్ని జంతువులు ఇలానే ప్రవర్తిస్తాయి. దాహానికి నీరు త్రాగాలనే విషయం తెలియడానికి ఇంకొకరు మనకి చెప్పనవసరం లేదు. మనం ఇంకొకరిని అడగవలసిన పని లేదు. దాని కొరకు చదువుకోవలసిన పని లేదు. వైద్యుల సలహా అక్కర్లేదు. ఆకలి వేస్తే శరీరం నాకు ఆహారము కావాలని మనల్ని అడుగుతుంది. అప్పుడు మనం తింటే దాని అవసరం తీరి ఊరుకుంటుంది. ఆకలి వేస్తే ప్రతి జంతువు శరీరానికి ఆహారాన్ని అందించాలని తెలుసుకుని అందిస్తున్నాయి. అలాగే శరీరము అలసిపోతే, నాకు అలసటగా ఉందని తెలియ చేస్తుంది. అప్పుడు మనం విశ్రాంతి తీసుకుని దానికి సహకరిస్తున్నాము. జంతువులన్నీ అలసిపోతే విశ్రాంతి తీసుకోవాలని తెలుసుకుని అలానే తీసుకుంటున్నాయి. ఈ విషయంలో కూడా వాటికీ ఎవరూ బోధించవలసిన పనిలేదు. పైన చెప్పిన మూడు విషయాలలో జంతువులు, మనము కూడా ఒకే విధముగా ప్రవర్తిస్తున్నాము. ఏ శరీరమైనా ఈ ధర్మాలు ఒక్కటేనని మనకు తెలుస్తున్నది. ఇప్పుడు నాలుగో విషయం ఆలోచిద్దాము. శరీరానికేప్పుడైనా బాగోకపోయినా, ఆకలి లేకపోయినా, పొట్ట మందంగా ఉన్నా, జ్వరంలా వచ్చినా అప్పుడు శరీరం, నాకు బాగోలేదు, ఈ రోజుకి నీవు కాస్త తినడం మాని, తిరగకుండా పడుకుంటే బాగుంటుందని కోరుకుంటుంది. అప్పుడు మనకు వెంటనే శరీరం చెప్పినట్లు విందామనిపిస్తుంది. మనకు బుడ్డి, జ్ఞానమున్నది కదా! కాసేపటికి వేరే విధముగా ఆలోచనలు మారతాయి. అప్పుడు మనం ఏమి చేస్తాము. మన అమ్మకో, నాన్నకో లేదా ఇంట్లో పెద్దవారికో మన పరిస్థితి చెప్పుకుంటాము. ఇప్పటికే భోజనం లేటు అయ్యింది, తినకపోతే నీరసం వస్తుంది, ఈ పూటకు తిను, సాయం కాలం డాక్టరు దగ్గరకు పోదాములే అని సలహా ఇస్తారు. వండింది వేస్తూ అవుతుంది అనో, తినక పోతే నీరసం వస్తుందనో, ప్రక్కవారు తినమన్నారనో మనకు ఇష్టం లేకపోయినా తింటాము. మనం ఇక్కడ శరీరం కోరినట్లుగా కాక దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి చివరకు డాక్టరు దగ్గరకు పోయి శరీరాన్ని అప్పగిస్తాము. ఈ విషయంలో 84 లక్షల జీవరాసులు ఏమి చేస్తాయో చూద్దాము.

***

శరీరం నాకు బాగోలేదు, నీవు తినవద్దు, తిరగ వద్దు అని కోరింది కాబట్టి వెంటనే ఆ క్షణం నుండీ తినడాన్ని పూర్తిగా ఆపేస్తాయితినవలసిన పనిలేకపోతే ఇంకా తిరగవలసిన పని వాటికేముంటుంది. కాబట్టి విశ్రాంతి కూడా శరీరం కోరినట్లు ఇచ్చి హాయిగా పడుకుంటాయి. తిండి మనడం, విశ్రాన్తినివ్వడం అనే రెండు పనులు చెయ్యడానికి వల్ల అమ్మ, నాన్నలనో, ప్రక్కనుండే స్నీహితులతోనో ముచ్చటించవలసిన పనిలేదు. ఇక్కడ ఇవి శరీర ధర్మాన్ని గౌరవించి వట్టిగా పాడుకుంటాయి. "ధర్మో రక్షతి రక్షితః" అన్నట్లు ఆ ధర్మమే వాటిని కాపాడుచున్నది. ఇలా శరీరం వద్దన్నానని రోజుల పాటు విశ్రాంతి నిచ్చి, మరలా నాకు ఆహరం కావాలని శరీరం కోరినప్పుడు తినడం ప్రారంభిస్తాయి. ఇలా శరీరం వద్దన్నప్పుడు ఆహారాన్ని తినడం మాని, విశ్రాంతి నివ్వడం అనేదాన్ని ఆనాటి నుండీ ఈనాటి వరకూ ఆచరించి చూపుతూ వాటి ఆరోగ్యాన్ని అవే కాపాడు కుంటున్నాయి. ఈ ధర్మాన్ని అవి వాటి పిల్లలకు, మనుమలకు అలా బోధించవలసిన పని లేకుండా, తరతరాలుగా ప్రతి జీవికి పుట్టుకతో ఈ జ్ఞానం తెలుస్తూనే ఉంటున్నది. ఈ జ్ఞానం జంతువుల వలె మనిషికి కూడా అనాదిగా వస్తూ ఉన్నది. మనిషి కూడా నియమం తప్పకుండా ఈ శరీర ధర్మాన్ని గౌరవించడం జరిగిందీ. పేరు పెట్టడం వరకే మనిషి హస్తం తప్ప లంఖణం ని మనిషి కనిపెట్టలేదు. మనిషి పుట్టక ముందే లంఖణం పుట్టింది. అది ఈ భూమి పై జీవులు శరీరాన్ని ధరించినప్పటి నుండీ ఉన్నా ధర్మం. దాహానికి నీరు, ఆకలికి ఆహరం, అలసటకు విశ్రాంతి ఎలాంటి ధర్మాలో రోగానికి లంఖణం ఉండడం అలాంటి ధర్మమే. ఈ లంఖణం అనేది ఒక మతానికి గాని, ఒక కులానికి గానీ, ఒక దేశానికి గానీ, ఒక జాతికి గానీ, ఒక ప్రకృతి వైద్యానికే గానీ సంబంధించినది కాదు. శరీరమున్న ప్రతి జీవికి సంబంధించిన విషయం. ఇదేదీ మూదాచారమూ కాదు. చదువుకొని, వైద్య శాస్త్రం తెలియని మన పెద్దలు కనిపెట్టింది కాదు. అది శరీరానికి పుట్టుకతో వచ్చే సహజ ధర్మమూ. ఇన్ని కూతల రకాల శరీర నిర్మాణ సారధి ఎవరో, ఆయన ఈ శరీరాలకు ఆరోగ్య నిమిత్తం ఇచ్చిన వరం. దానిని జంతువుల వలె మనిషి కూడా గౌరవిస్తే ఆరోగ్యం వరం. లేదా రోగాల పరం.

3, జులై 2008, గురువారం

మనం చేసే పెద్ద పొరపాటు ___ మంతెన సత్యనారాయణ రాజు

వివేకముతో ఆలోచిస్తే మనం వేరు. మన శరీరం వేరు. మనం జన్మ తీసుకున్తున్నమంటే (పుడుతున్నామంటే) శరీరాన్ని ధరించి భూమి పైకి వస్తున్నాం. చనిపోతున్నమంటే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. విశేషమేమిటంటే పుట్టుక నుండి చావు వరకు మనము, మన శరీరము ఒకటిగానే జీవిస్తున్నాము. శరీరము లేకుండా జీవితమనేదే లేదు. చావుపుట్టుకలు మన చేతిలో లేవు గాని ఆ రెండింటి మధ్యన వుండే జీవితం మన చేతిలోనే వుందిఅలాంటి జీవితం ఆరోగ్యమ్గా, సుఖంగా సాగినా లేదా అనారోగ్యంతో, బాధలతో సాగినా దానికి మనమే బాధ్యులం తప్ప శరీరానికి సంబంధం లేదు. ఈ శరీరానికి ఏ ఇబ్బందులు వచ్చినా ఆ తప్పు మనదే. శరీరం మనం ప్రయాణిస్తున్న వాహనం కాబట్టి మనం చెప్పినట్లు అది నడవాలి. అలాగే మనం దాన్ని ఇబ్బంది లీకుండా నడిపించుకోవాలంటే అది చెప్పినట్లు కూడా మనం వింటూ వుండాలి. అపుడే జీవితమనే ప్రయాణం గమ్యం చేరే వరకు సుఖంగా సాగుతుంది. కానీ మనం అందరం చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే శరీరం చెప్పినట్లు మనం వినడం లేదు. దాని అవసరాల్ని మనం పట్టించుకోవడం లేదు. అందు చేతనే రకరకాల రోగాలతో ఇబ్బందులు పడుతున్నాము. మన ఇష్టా ఇష్టాలు దానిమీద రుద్దుతున్నాము తప్ప దానిగోడు వినిపించుకోవడం లేదు. ప్రతి జీవి శరీరము ఒక ఆటోమాటిక్ యంత్రము లాంటిది. శరీరానికి తనంతట తనే బాగు చేసుకునే శక్తి పుట్టుకతోనే వచ్చింది. ఆ శక్తి పనిచెయ్యాలంటే శరీరము చెప్పినట్లుగా మనం విని దానికి అనుకూలంగా మనం ప్రవర్తించాలి. ఈ శ్రుష్టిలో 84 లక్షల జీవరాసులుంటే, అవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాటి శరీరాన్ని ఏ డాక్టరుకి అప్పగిస్తున్నాయి? ఏ రకాల రక్తపరీక్షలు, ఎక్స్ రే లు తీయించు కుంటున్నాయి? వాటి ఆరోగ్య రహస్యం ఏమిటి? నూటికి నూరు శాతం అవి ఆరోగ్యాన్ని పొందడానికి అవి ఆచరించే ఆరోగ్య రహస్యం ఒక్కటే. అదే శరీరం చెప్పినట్లు వినడమే.
***
మనిషి కూడా కొన్ని వేళ సంవత్సరాలు ఇదే ధర్మాన్ని ఆచరించి డాక్టరు లేకుండా రోగం రాకుండా జీవించగాలిగాడు.
***
ఇంతమంది వైద్యులు, ఇన్ని రకాల వైద్య విధానాలు ఉంచుకుని కూడా పూర్తి ఆరోగ్యాన్ని ఎందుకు పొందలేకపోతున్నాడు? మనకి వైద్యుడికి అవకాసమిద్దామని తెలుస్తోంది కానీ వైద్యుడి కంటే ముందు శరీరానికి అవకాసమిద్దామని తెలియడం లేదు. అసలు శరీరానికి జబ్బులు తగ్గించుకునే గుణం ఉన్నట్లే చాలా మందికి తెలియదు. మనం తాయారు చేసిన వాహనానికి ఏదైనా రిపేరు వస్తే తనంతట తానూ బాగు చేసుకోలేదు. దానిని తయారు చేసినది మనిషే కాబట్టి చివరికి మనిషే దానిని రిపేరు చేయవలసి వస్తున్నది. మరి మన శరీరాన్ని మనం తయారు చేసామా? మనం తయారు చేసినది కాదు కాబట్టే మన ఊహకు అందని, మన తెలివితేటలకు సాధ్యం కాని అద్భుతమైన యంత్రాంగం ఈ శరీరంలో ఉంది. ఆటోమాటిక్ గా నడిచే కార్లు ఇంతవరకు మనిషి కనిపెట్టలేక పోయాడు కానీ మనం ప్రయాణించే ఈ శరీరమనే కారు మాత్రం ఆటోమాటిక్ గా నడుస్తుంది. అలానే ఆటోమాటిక్ గా రిపేరు చేసికొనే శక్తి కూడా దానికి వుంది. ఆ శక్తిని మనం చెడగొట్టకుండా ఉంటే చాలు, దాని పని దానికి వుంది. ఆ శక్తిని మనం చెడగొట్టకుండా ఉంటే చాలు, దాని పని అదే చేసుకొని పోతుంది. మనకు తెలియకుండానే మనం శరీరానికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ వుంటాము. దానికి నెలలు కావలసి వచ్చినప్పుడు నీళ్లు త్రాగం. మనకి ఇష్టమైనప్పుడు త్రాగుతాం. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాం. నాకిప్పుడు రెస్ట్ తీసుకునే టైము అయిపోయింది నేనిక అరిగించలేను అని అది చెప్తున్నా వినకుండా రాత్రి పొద్దుపోయి అన్నం పెడతాము. మనం తిన్నదంతా అరిగించి మిగిలిన వేస్ట్ విసర్జించడానికి రెడీ గా పెట్టుకొని ఉన్నా దానిని బయటకు పంపకుండా ఆపేస్తాము. ఏదైనా రోగ పదార్ధము లోపలికి ప్రవేశించినప్పుడు దానిని బయటకు పంపే ప్రయత్నంలో జ్వరం రూపంలో నోరు చెడు రూపంలో మనకి అది సూచనలిచ్చినా పట్టించుకోకుండా, దానికి బాగు చేసుకునే అవకాసం ఇవ్వకుండా డాక్టరు దగ్గరకు వెంటనే పరిగెడతాము. డాక్టరు ఏదో మందు వేస్తాడు. దానితో తను చెయ్యాల్సిన పని ఆపేస్తుంది. ఇలా మందులు వేస్తూ వుండటం వల్ల శరీరానికి వున్నా రోగాన్ని నిరోధించుకునే శక్తి క్రమంగా తగ్గిపోతుంది. జబ్బులను తగ్గించే అవకాసము ముందు మన శరీరనికిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరమే ఒక గొప్ప డాక్టరు అని గ్రహించాలి. మన శరీరము తగ్గించలేనపుడు మందు వేసుకోవడం తప్పు కాదు. ముందు శరీరం కోరినట్లుగా మనం మారడం, దానికి అనుకూలంగా బ్రతకడం అలవాటు చేసుకుందాం.

1, జులై 2008, మంగళవారం

ఫుడ్ ఎలేర్జీ తగ్గాలంటే ?... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

మంచికీ, చెడుకీ మధ్యా ఘర్షనే ఎలేర్జీ అంటే. భార్యా భర్తలిద్దరూ మంచివారైతే వారిద్దరి మధ్యా ఈ గొడవలు రాకుండా జీవితం సాఫీ గా నడుస్తుంది. అదీ మాదిరిగా అటు ఆహారము, ఇటు శరీరము రెండూ (ఆహారము ప్రకృతి సిద్దముగా ఉంది, శరీరము కూడా సహజంగా ఉంటే) ఒకే విధంగా ప్రకృతి సహజముగా ఉంటే వాటి మధ్య ఏ గొడవా (ఎలర్జీ) రాదు. భార్యాభర్తలిద్దరూ చేద్దవారైనా వారి మధ్యా ఏ గొడవలూ ఉండవు. వాళ్ళిద్దరూ బాగా కలిసిపోతారు. అలాగే, అటు ఆహారము చెడ్డదిగాఉండి ఇటు శరీరము కూడా చేదిపూయి అసహజంగా ఉంటే ఈ రెండూ కలిసిపోయి ఏ ఎలర్జీ రాదు. ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారు అయినప్పుడీ గొడవలు మొదలయ్యేది. ఈ మధ్య జనాలకు, తేనెకు, కొబ్బరికి, నిమ్మకాయలకు ఇతర పులుపులకు, ఎండకు, మంచుకు, దుమ్ముకు, కూరగాయలకు, గింజలకు (ఇవన్నీ ప్రకృతి సిద్దమైనవి) మొదలగు వాటితో ఎలేర్జీ వస్తున్నది. ఇలాంటి వాటికి ఎలర్జీ వస్తున్నదంటే శరీరంలో అసహజమైనవి నిల్వయుండి, ఎలర్జీని కలిగించే పదార్ధాలు పుట్టి, లోపల అసహజంగా మారి పైన చెప్పినలాంటివి తగిలే సరికి దురదలు, దద్దుర్లు, వాపులు, గొంతులో తీదాలు మొదలగునవి వచ్చేస్తాయి. అవి పడటం లేదు కాబట్టి, వాటిని పూర్తిగా మానేస్తే పోతుంది గదా అని వాటిని మానివేస్తూ ఉంటారు. లోపల అసహజత పెరుగుతూ నిదానంగా ఇతర ప్రకృతి సిద్దమైన ఆహారాలకు కూడా ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది. మాంసం పడటం లేదని కానీ, ఆవకాయ పడటంలేదని, చాక్లెట్లు, బిస్కెట్లు పడటంలేదని డాక్టరు దగ్గరకు వెళ్లి వీటికి నాకు ఎలర్జీ వస్తుందనే వారు ఎవరన్నా ఉన్నారా? ఇలాంటివి శరీరానికి బాగా పడుతున్నాయి. మన శరీరం చెడిపోయి ఉండేసరికి చెడులో చెడు పడే సరికి కలిసి పోతున్నాయి. రా, రా ! మనమిద్దరం ఫ్రెండ్స్ అంటూ కలుస్తాయి. ఎలర్జీ పూవాలంటే వేటినీ మనడం పరిష్కారం కాదు, మనలో ఎలర్జీ లకి మూలాన్ని కదిగివేసి శరీరాన్ని సహజంగా మార్చుకుంటే అన్నీ మళ్ళీ పడతాయి.
చిట్కాలు:
1) మంచినీరు తక్కువగా త్రాగే వారికి ఎకువగా ఎలర్జీలు వస్తాయి. కాబట్టి 5 లీటర్లు నీరు ప్రతిరోజూ అలవాటు చేసుకోవాలి.
2) ముందు 2,3 రోజుల పాటు తేనె నీళ్ళలో ఉపవాసం (నిమ్మపడక పోతే మానివేసి వట్టి తేనె + నీళ్లు త్రాగవచ్చు) చేస్తే మంచిది. ఉపవాసంలో అవసరమైతే కొబ్బరినీళ్లు రెండవ, మూడవ రోజుగానీ త్రాగవచ్చు.
3) నాల్గవ రోజు నుండీ ఏ పళ్ళు పడితే, ఏ రసాలు పడితే వాటితోనే రోజుకి 5,6సార్లుగా అందులోనే తేనె వీసుకుని త్రాగుతూ 3,4 రోజులుంటే మంచిది. చెరుకురసం పడితే త్రాగవచ్చు.
4) ఆ తరువాత రోజు నుండే ఉదయం పూట 8 గంటలకు రసాలు, 9,10 గంటలకు పండ్లు తిని మద్యాహ్నం భోజనంలో పుల్కాలతో చప్పటి కూర (ఏది పడితే అది కూర) తో తిని, సయంకాలం 5,6 పండ్లు తిని ఆపాలి. ఇలా 5,6 రోజులు చీస్తే శరీరం లోపల శుభ్రం అయి, రక్తం మారి కొంత సహజత్వము వస్తుంది.
5) ఇలా 10, 12 రోజులు గడిచాక మీకు పడని వాటిని మెల్లగా ఒక్కటీ అలవాటు చేసుకుంటే అవే సరిపడుతుంటాయి. లేదా ఇంకో 10 రోజుల తారవాతైనా అలవాటు చేసుకోండి. ఎవరికన్నా ఇంకా తగ్గకపోతే ఆహారము, ఉప్పు నూనెలు సాంతం మాని తింటే అప్పుడు పూర్తిగా తగ్గి పోతాయి.

ఆకలి మందం తాగ్గాలంటే...?

చాలామంది టైం అయ్యిందని తింటారేతప్ప ఆకలి తెలియదు. ఆకలి మందం అనేది ముఖ్యంగా పిల్లలలో ఉంటుంది. దీనికి ముఖ్య కారణం మలబద్దకం. ఎవరిలో మలబద్దకం ఉన్నా వారికి ముందు ఆకలి తగ్గిపోతుంది. విరేచనం సాఫీగా కానందుకు మలం ప్రేగంతా మలంతో నిండిపోయి ఉంటుంది. అది వెళ్ళాక పోయినా పైనుండి తినేది ఆపరు. బయటకు వెళ్ళే దాన్ని బట్టి లోపలకు వచ్చేది ఆదారపడి ఉంటుంది. ప్రేగుల వాతావరణం చెడిపోయి ఆకలి మందగిస్తుంది. ఆకలి లేకపోయినా తినకపోతే నీరసం అని తినేసరికి ఇంకా సమస్య మరీ ముదిరిపోతుంది.
చిట్కాలు:
1) 5,6 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం పూట ఎనిమా చేసి ప్రేగులను శుభ్రపరచుకోవడం మంచిది.
2) ఉదయం పాలు, జావలు, టిఫిన్లు మొలక గింజలు మొదలగునవి పూర్తిగా మనాలి, నీళ్లు త్రాగడం పూర్తయ్యాక 8, 9 గంటలకు టిఫిన్ కింద బొప్పాయి, సపోటా, ఖర్జూరం పండు, దానిమ్మ లాంటి పండ్లను సరిపడా తినవచ్చు.
3) మద్యాహ్నం తేలికగా అరిగేతట్లు కూరలను చప్పగా చేసుకును (ఆకుకూరలు, దుంపలు, కండి, పెసరపప్పు) పులకాలతో ఎక్కువ కూర పెట్టుకుని తినాలి.
4) రాత్రికి భోజనంగా 5,6, గంటలకే పండ్లు తిని ఆపాలి. పొట్టను రాత్రికి మాడ పెట్టడం వల్ల ఆకలి పుడుతుంది. సమస్య తగ్గాక రోజూ విరేచనం సాఫీగా అయ్యేటట్లుగా చూసుకుంటే ఆకలి మందం కలగదు.

నరాల కొంకర్లు తగ్గాలంటే.... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

నరాలు కొంకర్లు తగ్గాలంటే :- ఒక్కొక్క సారి చేతి వ్రేళ్ళు గాని, కళ్ళ వ్రేళ్ళు గానీ బిగుసుకొని పోయి క్రిందకు వంగిపోయినట్లుగా అవుతాయి. (వ్రేళ్ళ మీద వ్రేళ్ళు ఎక్కుతుంటాయి.) అలా కాసేపు ఆగిపోయి విపరీతమైన భాద కలుగుతుంది. అలా తరుచుగా ఎవరికన్నా వస్తున్నాయంటే వారిలో కాల్షియం బాగా తగ్గినట్లు గ్రహించాలి.
చిట్కాలు: 1) దొరికినప్పుడల్లా లేదా వారికి 2,3 సార్లు తమలపాకులను (1,2 ఆకులూ) తినండి. తంబూలంగా వద్దు, వట్టి ఆకులను నమలవచ్చు. లేదా వాటికి తేనె పూసుకుని తింటే నూరు పొక్కకుండా ఉంటుంది. తమల పాకుల్లో కాల్షియం బాగా ఉంటుంది.
2) తెల్ల నువ్వులను రోజుకు 3,4స్పూన్లు తింటే మంచిది. విడిగా తినలేనప్పుడు వాటిని తేనెతో కానీ ఖర్జూరంతో కానీ దంచి ఉండగా చేసి ఒక ఉండ తింటే త్వరగా తగ్గిపోతుంది.
3) రాగులు మొలక గట్టుకొని కానీ రాగులపిందిని జావగా చేసుకొని కానీ త్రాగితీ వీటిలో ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల పైన చెప్పిన ఇబ్బంది రాకుండా నివారించుకోవచ్చు. కాల్షియం మాత్రలు మాని పైన చెప్పిన సూచనలు పాటించండి.

అర్ధ రూపాయి ....

భిక్షగాడు : బాబూ అర్ధరూపాయి ధర్మం చేయండి..

ఎదుటి వ్యక్తి: అర్ధ రూపాయికి ఏమొస్తుంది... కొంచెం ఎక్కువ అడుక్కోవచ్చుగా....

భిక్షగాడు: నేను మనుషుల్ని బట్టి అడుగుతాను బాబయ్య....

ఎందుకు ?...

'మీ అబ్బాయి ఏడుస్తున్నప్పుడు నువ్వెందుకు లాలిపాట పాడి సముదాయించవు ?' అడిగింది రాణిని మిత్రురాలు.

'నేను జోల పాట పాడినప్పుడల్లా పక్కింటివాళ్ళు వచ్చి మాకు పిల్లాడి ఏడుపే బావుంది. అంటున్నారు' అంది రాణి విచారంగా.
---------------

24, జూన్ 2008, మంగళవారం

ఇష్టం...

"విద్యార్ధులూ మీకు మీ స్కూల్లో ఎవరంటే ఇష్టం?" అని అడిగారు డి. ఈ. ఓ .
***
"అటెండర్ అంటే మాకు చాలా ఇష్టం సార్"! అన్నారు విద్యార్ధులు
**
"ఎందుకని?" అడిగారు డి.ఈ. ఓ.
***
"మేము తొందరగా ఇళ్ళకు వెళ్ళాలంటే బెల్ కొట్టవలసింది .... అతనే కదా సార్ ! అని పెద్ద గోల చేసారు ....

---------

దుర్వార్త ___

గైనకాలజిస్ట్ : (రిపోర్ట్ చూస్తూ) : మీకొక సుభ వార్త శ్రీమతి రామా దేవి.

రమాదేవి: శ్రీమతి రామా దేవి కాదు, కుమారి రామా దేవి.

డాక్టర్: ఐతే మీకొక దుర్వార్త కుమారి రమాదేవి.......

ఆమె ___

బస్సులో ప్రయాణికుడు చాల సేపట్నుంచి తుమ్ముని ఆపుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. తుమ్మదానికి ఏదో టెక్నిక్ ఉపయోగించి ఆపసాగాడు.
**
పక్కనున్నతను సహనం కోల్పోయి అన్నాడు,, "ఎందుకండి తుమ్మును ఆపడానికి ప్రయత్నిస్తారు.. తుమ్మేస్తే పోతుంది కదా?"

***
మొదటతను "మా ఆవిడ చెప్పింది. 'మీకు ఎప్పుడు తుమ్ము వచ్చినా నేను నిన్ను గుర్తుచేసుకుంటున్నాను.. నువ్వు నా వద్దకు రావాలి అని అర్ధం' అని చెప్పిందండీ' అన్నాడు ముక్కును నలుపుకుంటూ.
***
ఐతీ ఏంటి వెళ్ళొచ్చు గా ....
..." ఆవిడా చనిపోయిందండీ

.................

8, జూన్ 2008, ఆదివారం

డాక్టర్ అంటే ... ?... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

వైద్యో నారాయణో హరిః. వైద్యుడనే వాడు నారాయణుడని, భగవంతుడని మన పెద్దలు చెప్పారు. అసలు వైద్యుడనే మాటకు అర్ధం చూస్తే వైద్యం చూస్తే వైద్యం చేసేవాడు వైద్యుడు అంటారు. వైద్యము అంటే చికిత్స అని అర్ధము. చికిత్స చేసేవాడు వైద్యుడు. డాక్టర్ అనే మాటకు ఇంకొక అర్ధం చూస్తే భోదించేవాడు అని చెప్పబడింది. డాక్టర్ యొక్క అసలు డ్యూటీఏమిటంటే రోగికి చికిత్స చేయడం, ఆ తరువాత బోధించడం అనే రెండూ పనులు చేయడం. వచ్చిన జబ్బుకు చికిత్స చేసిన ఆ తరువాత రోగికి మళ్ళీ ఈసారి ఆ జబ్బు రాకుండా చూసుకోవాలంటే, ఏమి తప్పు చేస్తే ఆ జబ్బు వచ్చిందో, ఆ జబ్బు రాకుండా ఏమి చేయాలో, ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఆరోగ్యాన్ని ఎలా కాపడుకోవాలో అవగాహన కలిగించే బోధన చేయాలి. వైద్య శాస్త్రం లెక్కల ప్రకారం చేయవలసినది ఇది. డాక్టరు చెప్పిన మాట పరమాత్ముడు చెప్పిన మాటగా అనుకుని చెప్పినది చెప్పినట్లుగా విని, ఆచరించమని మన పెద్దల మాటలు. ఈ రోజులలో ఎక్కువ మంది వైద్యులు చికిత్సే తప్ప బోధన విషయాన్ని ప్రక్కనబెట్టారు. వచ్చిన జబ్బులను పోగొట్టి, లేని జబ్బులు రాకుండా కాపాడుకునే మార్గాన్ని చూపవలసినది వైద్యులే. అలాంటి అవగాహన ప్రజల్లో లేకే రోజు రోజుకి రోగాలు పెరుగుతున్నాయి. వైద్యులు బోధించే విదంగా మారి అవగాహన కలిగిస్తూ ఉంటే, దాని ప్రజలు చెప్పినది చెప్పినట్లుగా ఆచరణలో పెట్టగలిగినప్పుడు ఈ సమాజం ఆరోగ్యవంతంగా మారితుంది. ఇలాంటి మంచి మార్పు ఇద్దరిలోనూ రావాలని కోరుకుందాము.

ఆరోగ్యం అంటే.... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

ఏ రోగం లేకుండా ఉండడాన్ని ఆరోగ్యం అని అనుకుంటున్నాము. కానీ అది వాస్తవం కాదు. ఏ రోగం ఇప్పుడు లేకపోయినా, వైద్య పరీక్షలలో ఏదో ఒక రోగం బయటపడుతున్నది. అంటే లోపల పుట్టిన రోగం పరీక్షలకు దొరికే స్థితికి వచ్చిందని అర్ధం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని రోజులలో అది పూర్తి రోగం రూపంలో బయటపడుతుంది. రోగం రూపంలో బయటకు రాకపోయినా వచ్చే గుణం లోపల ఉంటే దానిని ఆరోగ్యం అని అనవచ్చా? రోగం పునాదుల్లో ఉన్నా దానిని ఆరోగ్యం అని అనకూడదు. ప్రస్తుతం ఏ రోగం లేకుండా ఉంది దానితో పాటు మనలో ఏ రోగం రాకుండా ఉండే స్థితి కూడా ఉంటే దానిని ఆరోగ్యం అని అనుకోవచ్చు. శరీరంలో ప్రతి కానము, ప్రతి అవయవం అది ఎంత వరకూ పనిచేయగాలదో అంత శక్తివంతంగా పని చేస్తూ మిగితా అవయవాలతో సహకరిస్తూ శరీరాన్ని సుఖంగా ఉండేలా నడిపిస్తే ఆ శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లు. శరీరం ఆరోగ్యంగా ఉన్నదని చెప్పడానికి బాహ్యమ్గా కొన్ని లక్షణాల ద్వారా మనం అంచనా వేసికోవచ్చు. అవి ఏమిటంటే పరిశుభ్రంగా, కాంతిగా ఉండే చర్మం, మెరిసే కళ్లు (కాంతివంతముగాఎముకలను కప్పి ఉంచిన బలమైన కండరాలు, తియ్యటి శ్వాస, మంచి ఆకలి, ప్రశాంతమైన నిద్ర, మల మూత్రాదులు ఏ రోజుకారోజు బయటకు వెళ్ళిపోవడం, నోరు, పాచి, లాలాజలం, మలం, మూత్రం, చెమట మొదలగునవి పూర్తిగా వాసనా రాకుండా, కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు ఇబ్బంది లేకుండా కదలడం మొదలగునవి. ఇలా వుంటే శరీరం ఆరోగ్యముగా ఉన్నదని అర్ధము. ఒక్క శారీరక ఆరోగ్యము మాత్రమే సరిపోతుందా? మనిషికి తప్ప మిగితా జీవులన్నింటికీ అది సరిపోతంది. ఆ జీవులకు ఒక్క శరీరము ఆరోగ్యముగా ఉంటే జీవితము హాయిగా గడిచిపోతుంది. మనిషికి మనసంటూ ఒకటుంది కాబట్టి దాని ఆరోగ్యం కూడా శరీర ఆరోగ్యమ్తో పాటు అవసరమౌతుంది. ఆరోగ్యవంతమైన శరీరంతోపాటు, ఆరోగ్యవంతమైన మనసు ఉంటే ఆ వ్యక్తి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పవచ్చు. శరీర ఆరోగ్యాన్ని లెక్కలు వేయడాన్ని పరికరాలుఉన్నాయి కాని మానసికమైన ఆరోగ్యాన్ని తెలియజేయడానికి ఎలాంటి పరికరాలు కనిపెట్టలేదు. ఒక వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడు అనడానికి కొన్ని లక్షణాలు వైద్య శాస్త్రపరంగా ప్రామనికంగా తీసుకుంటారు. అవి ముఖ్యంగా మానసికంగా ఎలాంటి సంఘర్షణ లేకపోవడం, పరిస్థితులకు సర్దుకుని పోయే తత్వం కలిగి ఉండడం, ఆత్మ నిగ్రహం కలిగి ఉండడం, ప్రతి చిన్నదానికి క్రుంగి పోకుండా ఉండడం, స్వంత తెలివితేటలతో అలోచించి నిర్ణయం తేసుకోవడం, సమస్యలను ఎదుర్కొనే శక్తి ని కలిగి ఉండడం మొదలగునవి ముఖ్యం గా చెప్పుకోవచ్చు. ఈ రెండింటిల్లో ఆరోగ్యం గురుంచి చెప్పుకునేటప్పుడు మనం శరీరం గురుంచే ముఖ్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే శరీరము ఎక్కువగా రోగాలపాలు అవుతూ ఉంటుంది. కాబట్టి అలాగే మనసుకీ, శరీరానికీ అవినాభావ సంబంధముంది. మనసు ఆరోగ్యంగా లేకపోతే దాని ప్రభావం శరీరం పై తప్పని సరిగా పడుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు కూడా తప్పని సరిగా పడుతుంది. శరీరము ఆరోగ్యముగా ఉంటేనే మనసు కూడా ప్రశాంతముగా ఉంటుంది. అందుచేత ముందు శరీరాన్ని బాగుచేసుకునే ప్రయత్నం చేసి తర్వాత మిగితా వాటి సంగతి చూడాలి. శారీరక ఆరోగ్యం పై డాక్టరు పాత్రా ఎంత? వైద్య విధానాల పాత్ర ఎంత? అసలు ఆరోగ్యం ఏమి చేస్తే వస్తుంది. ఇలాంటి విషయాలను ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

5, జూన్ 2008, గురువారం

రింగు ....

రాజు: హాయ్ రాణి నీ బర్త్ డే ఎప్పుడు, నీకేమి గిఫ్ట్ కావాలి .

రాణి: నా బర్త్ డే రేపే, నాకు గిఫ్ట్ గా రింగ్ కావాలి రాజు

రాజు: ల్యాండ్ లైన్ నుంచా సెల్ నుంచా!
*************

ఫార్ములా..

టీచర్: ఏరా బుజ్జి వాటర్ ఫార్ములా చెప్పు?

బుజ్జి: HIJKLMNO టీచర్ ..

టీచర్: ఏరా తిక్కగా ఉందా, కరెక్టుగా చెప్పు.

బుజ్జి: H to O అని మీరే అన్నరుగా టీచర్

ఐడియా ...

టీచర్: స్టూడెంట్స్... ఇక వచ్చే వారం నుంచే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా మీకేమైనా డౌట్స్ఉంటే అడగండి.

స్టూడెంట్ : సార్. .. మా క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ ప్రింట్ అవుతాయో మీకేమైనా ఐడియా ఉందా?

---------------

29, మే 2008, గురువారం

అవకాసం....

తండ్రి: ఒరే! నా గుండె ఆగిపోయేలా ఉంది.

కొడుకు: లయర్ని పిలుచుకురానా నన్నారూ............. ?
----------

పాడైపోతుంది....

రాజేశ్వరి తన అన్నయ్య స్నేహితునితో...
టిఫిన్ తిని వెల్ల్దురుగానీ ఉండండి....

స్నేహితుడు: వద్దండీ ! ఈ సారి వచ్చినప్పుడు తప్పక తీసుకుంటాను.

రాజేశ్వరి: అప్పటికి ఇది పాడైపోతుందేమోనండి....
...........

టీచర్ - స్టూడెంట్ .....

౧) టీచర్: "టింకూ భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలని తెలియదా...?"
టింకూ : " ఆ అవసరం నాకు లేదు టీచర్.. మా అమ్మ చాల బాగా వంట చేస్తుంది..."

౨) టీచర్ : ఇంటి నీ హోమ్ వర్క్లో మీ నాన్న రాత కనిపిస్తోంది."
రవి: " మా నాన్న పెన్నుతో రాసాను టీచర్ "

ఎవరూ చూడనిది....

టీచర్ : పిల్లలూ.. మీ నలుగురూ ప్రపంచంలో ఎవరూ చూడని కాయలని నాకు చూపించాలి.
***
కిట్టు: ఇదిగోండి సార్.. నిమ్మకాయ
***
టీచర్: "ఒరేయ్ ఇది నిమ్మకాయని అందరికీ తెలుసు" అని దాన్ని వాడి నోట్లో కుక్కాడు. పాపం కిట్టు నొప్పితో ఏడ్చాడు.
***
చంటి: ఇదిగోండి సార్... జామకాయ
***
టీచర్: "ఒరేయ్ ఇది జమకాయని అందరికీ తెలుసు" అని దాన్ని వాడి నోట్లో కుక్కాడు. పాపం చంటి కూడా నొప్పి తో ఏడ్చాడు.
***
బుజ్జి: ఇదిగోండి సార్.. మామిడి కాయ
**
టీచర్ : "ఒరేయ్ ఇది మామిడి కాయ అని అందరికీ తెలుసు" అని దాన్ని వాడి నోట్లో కుక్కాడు. కాని బుజ్జి గాడు మాత్రం నవ్వుతూనే వున్నాడు..
***
బుజ్జి: "వెనుక లడ్డూ గాడు పనసకాయ తెస్తున్నాడు సార్"
******************

లేపండి ...

సుబ్బారావు : సార్ ఇరుకుపాలెంకు ఒక టికెట్ ఇవ్వండి.
***
కండక్టర్ : వెరీ గుడ్ .. చిల్లరిచ్చావ్...
***
సుబ్బారావు: బస్సుపై .... "టికెట్టుకు సరిపడా చిల్లరిచ్చి కండక్టర్ తో సహకరించండి" అని ఉంది కదా సార్ !
***
కండక్టర్: వెరీ గుడ్...
***
సుబ్బారావు: బస్సుపై.. "ప్రయాణికులు మన సంస్థకు నిధి, వారికి సీట్లిచ్చి గౌరవించడం మన విధి అని కూడా ఉంది కదా సార్..
***
కండక్టర్: అందుకే కదా నా సీటు ప్రయానికుడికి ఇచ్చాను. ఇక లేవు కదండీ....
***
సుబ్బారావు: ఐతే డ్రైవర్ ని లేపండి ......
***

28, మే 2008, బుధవారం

వెంగలప్ప...

వెంగలప్ప సినిమాకని వెళ్ళాడు.

బుకింగ్ వద్దకు వచ్చి నాలుగోసారి టికెట్ కొనుక్కుని వెళ్ళడం చూసి బుకింగ్ క్లేర్క్ అడిగాడు...

" ఏమయ్యా ! నువ్వు నాలుగు సార్లు వచ్చి నలుగు టికెట్లు కొనుక్కునే బదులు నాలుగు టికెట్లు ఒకేసారి కొనుక్కోవచ్చుగా.. "
దానికి వెంగలప్ప
'నాకు ఒక టికెట్టే అవసరం సార్. కాని గేటు దగ్గర ఉన్నా అతనేవరూ నా టికెట్ తీసుకెల్లినప్పుడల్లా చించేస్తున్నాడు' అని జవాబిచ్చాడు

ఇన్స్టంట్ - - -

ఒ జీబుదొంగకు వంద రూపాయల జరిమానా విదించాడు జడ్జి..
జేబుదొంగ జీబులో కేవలం యాభై నోటు మాత్రమే ఉంది
ఈ విషయాన్ని జడ్జికి చెబుతూ---
'సార్.. నా దగ్గర యాభై రూపాయలే ఉన్నాయి. నాకు కొద్దిగా టైం ఇవ్వండి. మిగితా యాభై రూపాయలు కడతాను అన్నాడు.'
జడ్జి ఇలా అన్నాడు--
'నువ్వు వెళ్ళడానికి వీలులేదు. ఎవర్నైనా ఇంటికి పంపించి డబ్బు తెప్పించుకో.
జేబుదొంగ--
అయ్యా! మా ఇంట్లో డబ్బు ఎందుకు ఉంటుందండీ --- మీరు ఒ రెండు గంటల పాటు కోర్టు ఆవరణలో తిరగడానికి అనుమతినిస్తే డబ్బు ఇట్టే కట్టేస్తాను.

టోర్టిల్ ఆలూ మసాలా

పిల్లలు ఆడుకుని వచ్చేలోగా వాళ్ళకి ఒక సింపుల్ స్నాక్స్ ఇవ్వాలంటే ఇదిగోండి మీ కోసం టోర్టిల్ ఆలూ మసాలా స్నాక్స్...

కావలసినవి...
టోర్టిల్సు - సరిపడినన్ని
ఆలూ - 2
మిరియాలుపొడి - సరిపడినంత
ఉప్పు - సరిపడినంత
కొత్తిమీర - 1 టీ స్పూన్
గరం మసాలా- చిటికెడు
తయారి :
ఆలుగడ్డలని ఉడకబెట్టి చల్లార్చి మెత్తగా చేసుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి చాట్ మసాలా, కొత్తిమీర కలిపి తాలింపు చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని టోర్టిలోస్ పైన అమర్చి పిల్లలకు అందించండి. 1/2 స్నాక్స్ గా వీటిని ఇష్టపడని వారుండరు. ఇంట్లో తయారు చేసుకునే చిన్న రోతీలతో, చిన్న పూరీలతో కూడా ఇలా చేసుకోవచ్చు.

అడ్డం ....

డాక్టర్ సుబ్బారావు ఒక కాన్వెంట్ స్కూల్లో హెల్త్ చెక్ అప్ చేస్తున్నాడు. ఒక పిల్లవాడిని పరీక్షిస్తూ...
'బాబూ! నీకు ముక్కు చెవులతో ఏం ఇబ్బంది రావడం లేదు కదా? అన్నాడు.
పిల్లవాడు: ఆ .. టీ షర్టు విప్పేటప్పుడు అడ్డమొస్తున్నాయి సార్.

.............

బలవంతంగా....

ఒక వ్యక్తి సైకిల్ పై వెళుతున్నాడు. అతని సైకిల్ వెనుక కూర్చున్న పిల్లడు బోరు బోరున గట్టిగా ఏడుస్తున్నాడు. ఇది చూసి దారిన పోతున్న వ్యక్తి...
...'పిల్లాడు' అలా ఏడుస్తున్నాడు. మీరు వాడి గురించి పట్టించుకోరేమిటి?
సైకిల్ పై ఉన్నా వ్యక్తి...
'పిల్లవాడిని బలవంతంగా ఎద్పించుకుంటూ తీసుకెల్తున్నాను. ఎందుకంటే సైకిల్ కు బెల్ లేదు' అన్నాడు.

7, మే 2008, బుధవారం

వెనక వెనకే ___

"మంత్రి గారి, బాడీ గార్డు, ఫై సంపాదన బాగా వుంటుంది అని చెప్పి నా గొంతు కోసేసారు'
బోరుమన్నది సుజాత.
"ఇప్పుదేమింది తల్లీ"... ఆందోళనగా అడిగింది సుజాత.
"ఇంకా ఏమి కావాలీ, ఇద్దరం బజారుకో సినిమాకో వెళ్తామా. పక్కన నడవకుండా వెనకే నడుస్తుంటాడు' చెప్పింది సుజాత.

సన్యాసం ___

'గురూజీ నా భార్యతో వేగలేక చస్తున్నా. కాస్త గుండె ధైర్యాన్ని ప్రసాదించండి' అని వేడుకున్నాడు ప్రసాదు.
***
పిచ్చివాడా ! అదే నాకుంటే భార్యను వదిలి సన్యాసం ఎందుకు పుచ్చుకుంటాను" అన్నాడు స్వామిజీ ...

మేమేమి చేస్తాము

'మొన్నమెషిన్ లో పడి వేళ్ళు చితికాయి కదా సార్. డాక్టర్ దగ్గరకు వెళ్ళితే చాల ఖర్చయ్యింది. ఆ బిల్లు కాస్త మీరే ఇప్పించాలి ' ఆఫీసరు రిక్వెస్ట్ చేసాడు మూర్తి.
***
'అలాగే అన్నాడు ఆఫీసరు.'
***
'సార్, నాకు కాస్త జీతం పెంచాలి సార్' అడిగాడు మురారి.
***
అదికాదు సార్, నేను పెళ్లి చేసుకోబోతున్నాను.'
***
చూడు బాబు ఆఫీసు బయట జరిగే ప్రమాదాలకు మా బాధ్యత ఉండదు' చెప్పాడు ఆఫీసర్.

మహారాణీ

మీ ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్పించిన తర్వాత ఏమైనా తేడా కనిపించిందా?

'ఆ , అది వరకు తనొక్కడే మహారాజు అనుకునే వాడు ఇప్పుడు నన్ను కూడా మహారాణీ అంటున్నారు.'

8, ఏప్రిల్ 2008, మంగళవారం

చెమట దాని కధ __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

చర్మం ఒక విసర్జకావయవము. చర్మాన్ని మూడవ కిడ్నీ అంటారు. ప్రతి రోజూ చర్మాన్ని రెండు లీటర్ల వ్యర్ధ పదార్ధాలను విసర్జిస్తుంది. మనలో వున్నా మాలిన్యాలు కొన్ని చర్మ రంద్రాల ద్వారా చెమట రూపంలో బయరకు పోతుంటాయి. చెమట పట్టనప్పుడు చర్మపు పోరలలోనే దాగి ఉంటాయి. చెమట పట్టినవారికి, ఆ చెమటతో కలిసి బయటకు రావడానికి వీలుంటుంది. ఉదాహరణకు మనం ఇల్లు నీటితో కడుగుతుంటాము. ఇంటిలోని మురికి, నీటితో కలిసి, కరిగి, నీటి ద్వారా బయటకు పోతుందిగదా ! అలాగే చర్మంలోని మురికి చెమట పట్టిన వారికే బాగా బయటకు వస్తుంది కానీ చెమట పట్టని వారికీ రాదు. అందుకనే మన పెద్దలు చెమట పట్టిన వాడికే తినే అర్హత వుంటుంది అనేవారు. ఇది మహాత్మా గాంధీగారు చెప్పిన మాట. వారు అన్నది అక్షరాలా నిజం అనిపిస్తుంది ఇక్కడ. చెమట పట్టాలంటే శరీరం వేడెక్కాలి. శరీరం వేడెక్కాలి అంటే పని చెయ్యాలి. అంటే పని చేసిన వాడికే శరీరం వేడెక్కుతుంది అని అర్ధం. శరీరం వేడెక్కినప్పుడు రక్త ప్రవాహం అన్ని భాగాలకు, కణాలకు స్పీడుగా జరుగుతుంది. పనిచేసే వారికి ఊపిరితిత్తులు ఎక్కువ గాలిని పీల్చుకుంటూ వుంటాయి. ఎక్కువ గాలి శరీరంలోకి వెళ్ళడం వలన వేడి ఎక్కడం ప్రారంభమవుతుంది. శరీరం లోని చెడు దహన మవడానికి, బయటకు విసర్జించబడడానికి ఎక్కువ ప్రాణ శక్తి కావాలి. ఖాళీగా కూర్చుంటే ప్రాణ శక్తి లోపలకు వెలితే ఎక్కువ చెమట వెంటనే పడుతుంది. పనిచేసే వారికి పట్టే చెమటలో చెడు - చర్మం ద్వారా బహిష్కరించబడుతూ వుంటుంది. కదల కుండా ఇంట్లో కూర్చున్నప్పుడు గాలి ఆడక పట్టే చెమటలో నీరు వుంటుంది గాని చెడు పదార్ధాలు వుండవు. అప్పుడు పట్టిన చెమటకు క్రొవ్వు కరగదు. ఆరోగ్యం రాదు. ఎక్కువ ప్రాణ శక్తి పీల్చుకోవడం వలన, పనిలో పట్టే చెమట ఆరోగ్యదయకము. అది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చెమట పట్టనివాడు మూడు పూటలా భోజనం చేస్తూవుంటే, ఆహారం జీర్ణమైన తరువాత ఆహరం ద్వారా వచ్చిన చెడు పదార్ధం మరి ఎక్కడ నుండి బహిష్కరింప బడుతుంది ? అదే చెమట పట్టేవాడికి అయితే చర్మం తో బాటు మిగితా విసర్జకావయవాలు కూడా చెడును విసర్జిస్తూ వుంటాయి. చెమట పట్టేవాడు బాగా నీరు తాగుతాడు. అందు వల్ల మూత్రం లో వెళ్లవలసిన చెడు వెళ్లి పోతుంది. చెమట పట్టేతట్లు పని చేయడం వలన ఆకలి బాగా అవుతుంది. ఆ ఆకలితో ఎక్కువ భోజనం తృప్తిగా తినగాలుగుతాడు. తినే ఆహారంలో పీచుపదార్ధం ఎక్కువగా ఉన్నట్లయితే విరోచానము ఎక్కువగా తయారవుతుంది. ఎక్కువ విరోచానము త్వరగా ప్రేగులలో కదిలి బయటకు విసర్జించ బడుతుంది. పని చేసే వాడు ఎక్కువ ఒక్సిజేన్ ను శ్వాసలో దీర్ఘంగా తీసుకోగలుగుతాడు. ఎప్పుడైతే ఎక్కువ ఒక్సిజేన్ ను ఊపిరితిత్తులలోనికి వెళ్ళిందో గాలి బయటకు వచ్చేటప్పుడు కార్బోన్ డై ఆక్సైడ్ ఎక్కువగా వచ్చేస్తుంది . అందువల్ల ఊపిరితిత్తుల ద్వారా పోవలసిన చెడు వాటి ద్వారా ఏ రోజుకారోజు పనిచేసే వారికి బయటకు పోతుంది. ఊపిరితిత్తులు, మూత్రము, చెమట, మలం, ఈ నాల్గింటి ద్వారా చెడు ఏ రోజు కారోజు బయటకు పోతే అయిదవది అయిన "లివరు" తీలిక అవుతుంది. పని వారు సక్రమంగా పనిచేస్తుంటే యజమానికి సుఖం గా వుంటుంది గదా! ఇక్కడా కూడా అంతే! ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతే వేరే వారికి భారం వుండదు కదా. అలాగే "లివరు" గారికి కూడా శ్రమ వుండదు. "లివరు" దేహం నుండి అన్ని విసర్జకావయవముల ద్వారా పంపవలసిన చెడును బయటకు పంపెతట్లు చూసుకుంటూ వుంటుంది.
అందుకని చెమట పట్టిన వాడికి యివన్నీ జరుగుతాయా? శరేరం వేడెక్కినప్పుడు ఆ వేడికి చెడు పదార్ధం త్వరగా కణాల నుంచి బహిష్కారానికి సిద్దమవుతుంది. ఏదైనా వేడికి విశాలమవుతుంది. చలికి బిగుసుకుంటుంది. మనం కూడా చూడండి. వేసవి కాలంలో విశాలంగా చాపుని పడు కుంటాము. చలికాలంలో ముడుచుకుని పడు కుంటాము. వేడి కి ఏ పదార్ధమైనా వ్యాకోచిస్తుంది. వ్యామం ద్వారా వేడెక్కినప్పుడు రక్తనాళాలు, కండరాలు, కణాలు వ్యాకోచించి ప్రసరణలు పెరుగుతాయి. అందువల్ల కణాలలోని చెడు త్వరగా బయటకు రావడానికి అవకాసము ఎక్కువ వుంటుంది. పని చేయకుండా భోజనం చేస్తే తయారయిన చెడు లోపలే వుండి రోగ కణాలను తయారు చేస్తుంది. చెమట ద్వారా పోవలసిన చెడు, చెమట లేనప్పుడు చర్మపు పోరలలోనే ఉండిపోతుంది. మనిషికి రోగాలు పుట్టడం అక్కడే మొదలవుతుంది.

7, ఏప్రిల్ 2008, సోమవారం

దంతధావన క్రియ ___ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

ఇక పళ్ళు తోముకునే విషయం ఆలోచిద్దామా ! మనకు శరీరం లోపల ఎంత స్వచ్చత ఉన్నదనేది నోట్లో వచ్చే వాసన తెలియజేస్తుంది. అలాగే నాలిక శరీరానికి అడ్డం లాంటిది. శరీరం ఆరోగ్యం గా ఉన్నదీ, అనారోగ్యం గా ఉన్నదీ నాలిక చూస్తే తెలిసిపోతుంది. శరీరంలో ఎంత రక్తం ఉన్నదీ నాలికను చూసి చెప్పవచ్చు. విరోచనం సాఫీగా అవని వారికి, ప్రేగులలో చెడు, బాక్టీరియా ఎక్కువ వున్నవారికి, లివరులో (toxins) ఎక్కువ వున్నవారికి మరియు విసర్జకావయవాలలో చెడు బయటకు సరిగ్గా పోనివారికి నిద్ర లేవగానే నోరు దుర్వాసన వస్తుంది. మిగితా జీవులలో ఏవైనా పళ్ళు తోముకునేవి ఉన్నాయా? వేటి నోరైనా వాసన వస్తుందా? మరి మనిషి నోరు వాసన రావడానికి కారణాలేమిటి? మాట్లాడేటప్పుడు నోట్లోనుంచి ఎదుటివారికి లాలాజలం ఇంత పడితే సహించలేము. చీ ! అనుకుంటాము. తిట్టుకుంటాము, తరువాత కడుగుకుంటాము కూడా. మరి చంటి పిల్లవాడి ఎంగిలైతే ఎవ్వరూ పట్టించుకోరు. సంతోషంగా తుడుచుకుంటారు. అదే పిల్లవాడు పెద్దవాడైనప్పుడు మరల అదే విధంగా పడితే ముందు సంతోషంగా తుడుచుకున్న వ్యక్తే అసహ్యముగా తుడుచుకుంటాడు. ఇంత జరగడానికి కారణం ఆలోచిస్తే చంతిపిల్లవాడు స్వచ్చమైన ఆహారంతో స్వచ్చమైన మనస్సు కలిగి వుంటాడు. పెద్దవాడైన తరువాత రుచులు గల ఆహారాలు తిని కలుషితమైన మనస్సుతో ఉంటాడు కాబట్టి వాడి నోరు వాసన అనిపిస్తుది. తను పెంచుకునే కుక్క చేత నాకిన్చుకుని త్రుప్తి పడుతుంటాడు. మన ఇంట్లో కుక్క మనం తినే ఆహారం తిని మనతోబాటు జీవిస్తూ వుంటుంది. అది పళ్ళు తోముకోదు. అయినా దాని నోరు వాసన రాదు. మనం రోజుకు ఒకసారి లేదా రెండు సార్లో బ్రష్ చేసుకుంటూ ఉంటాము. పైగా మంచి వాసనలు వచ్చే, నురుగులు చిమ్మే పేస్టులతో కదా! మరి మనిషి ఇంత చేసినా నూరు మాట్లాడుతుంటే వాసన వస్తూనే వుంటుంది. కుక్క ఎంగిలిని అయినా మనిషి సహించగలుగుతున్నాడుగానీ ప్రక్కవాడి చొంగ ఇంత పడితే తట్టుకోలేడు.


నోరు రాత్రిపూట ౬-౭ గంటలు నిద్రలో కదపకుండా అలా వుంచి నందుకు లాలాజలం కదలికలు లేక, నోటిలో ఉండే బాక్టీరియా కారణంగా, గాలి తగలనందువలన, నోటిలో లాలాజలం దుర్వాసన వస్తూ వుంటుంది. అలాగే గొంతులో వుండే లారింక్స్, ఫారింక్స్ భాగాల దగ్గర ఊపిరితిత్తుల నుండి వచ్చి చేరిన కఫం నిలువ వుంటుంది. భగవంతుడిచ్చిన ప్రకృతి ఆహరం తింటే అసలు నోరు పుక్కిలించవలసిన అవసరం వుండదు. బృష్లతో పనే వుండదు. మసాలాలు, స్వీట్స్ తినడంవలన నోటి దుర్వాసనలు ఎక్కువగా ఉంటాయి. పళ్ళు ఊడిపోవడానికి కారణాలు కూడా ఇవే. కిళ్ళీలు, వక్కపోడులు వాడటం వలన కూడా పళ్ళు తొందరగా ఊడిపోతై. మనిషి ఆరోగ్యంగా వుంటే జీవితకాలంలో పళ్ళు ఊడవు. ఒక్క పన్ను కూడా కదలదు. ముసలివారికి పళ్ళు ఊడతాయి. ఇది సహజం అని అందరమూ అనుకుంటాము. అందరూ ఉప్పులు, మసాలాలు, స్వీట్లు తిన్నవారే కదా! మరి ముసలి జంతువులకు పళ్ళు ఊడిపోవడం లేదు గదా! ఇదంతా మన ఆహార లోపం వలననే గదా! పళ్ళు ఊడితేపళ్ళు కట్టించుకోవచ్చులే అని, ఎవరికి వారు ఉన్న పళ్ళు పాడవకుండా చూసుకోవాలని అనుకోవడం లేదు.
పేస్టులు పెట్టి పళ్ళు తోముకోవడము వలన నోట్లో లాలాజలం ఎక్కువ తయారవదు. అదే వేపపుల్ల అయితే చేదుకు లాలాజలం ఎక్కువ ఊరుతూ వుంతుంది. పైగా చేదుకి నోట్లో క్రిములు కదిలి బయటకు పోతాయి. బావిలో పాత నీరు తోడే కొద్దీ కొత్త నీరు ఊరుతూ వుంటుంది కదా! అలాగే నోట్లో చెడు లాలాజలం అంతా వేప చేదుకు బయటకు కారిపోయి, క్రొత్తది ఊరుతూ వుంటుంది. అందువల్ల వేపపుల్ల పెట్టి కడిగితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే గానుగు, మర్రి ఊడ, ఉత్తరేణి పుల్లలతో కడిగితే నోట్లో నురుగు కూడా వస్తుంటుంది. పెద్దలు నాలిక గీసేతప్పుడు వ్రేళ్ళు అంగిటి లోనికి పెట్టి డోకు కునే వారు . దీనివల్ల గొంతులో స్వరపేటిక వద్ద ఉండిపోయిన శ్లేష్మం అంతా బయటకు తెగి పడిపోయేది. మరి యిప్పుడు ఇంట్లో పళ్ళు తోముకోవడం కదా! కాన్ద్రిస్తే మోత వస్తుందని, మెల్లగా పని పూర్తి చేస్తారు. గొంతులోకి రాత్రి నుండి చేరిన చెడు, పళ్ళు తోముకునే తప్పుడు ఉమ్మివేయకపోతే అది తినేటప్పుడు మరల ఆహరం ద్వారా లోపలికి పోతుంది. పళ్ళు తోముకునేతప్పుడు గొంతులోని కఫాన్ని కాండ్రించి ఉమ్మివేయడం చాల మంచింది. కుదిరినప్పుడు పళ్ళు తూము పుల్లతో తోముకోవడం నోటి ఆరోగ్యానికి మంచిది.

4, ఏప్రిల్ 2008, శుక్రవారం

నీతి వాక్యాలు-౧

౧. వివేకి మౌనం, మూర్ఖత్వం; మూర్ఖుడికి మౌనం, వివేకం.
*
౨. తనలో తాను త్రుప్తి పొందలేని వాడు బయట ఎక్కడా దానిని పొందలేడు
**
౩. అన్ని మోసాలలోనూ ఆత్మవంచనే అధమాధమం.
***
౪. ఊర్పు అనేది వెగటుగా వుంటుంది. దాని ఫలం మాత్రం అమృతం.
****
౫. కాలమే ఉత్తమ గురువు - ప్రపంచమే ఉత్తమ గ్రంధం.
*****
౬. ఎంతకాలం జీవించడం అనేది కాదు. ఏమి సాదించామనేది ముఖ్యం.
******
౭. చేసిన చెడ్డ పని తిరిగి చేయకపోవడమే నిజమైన పశ్చాతాపం.
*******
౮. నీచమైన దానికోసం ఉన్నతమైన దానిని విడిచి పెడితే, అది త్యాగం అనిపించుకోదు.
********
౯. అందం కాంతిని ఆకట్టుకుంటుంది. సౌశీల్యం హృదయాన్ని దోచుకుంటుంది.
*********
౧౦. సారధి సమర్దుడైతే ఇంద్రియాలనే గుర్రాలు అదుపులో ఉండే ఉత్తమాశ్వాలు అవుతాయి.
**********
౧౧. క్షమా, దయ, రుజువర్తనం నిత్య సంతృప్తికి సులభ మార్గాలు.
***********
౧౨. గెలవక పోతే నిరాశ వద్దు. కానీ తిరిగి ప్రయత్నించక పోతే సర్వ నాశనం తప్పదు.
************
1౩. ఆర్ద్రత వారి మాటలు ఆచరనీయాలుకావు.
*************
౧౪. కలుషితమైన మనస్సు వున్న విషయాలను వున్నట్లుగా అర్ధం చేసుకోనివ్వదు.
**************
౧౫. పుట్టుక పుట్టినందుకు భగవంతుడు సంతోషించే పని ఏదైనా ఒకటి చెయ్యి.

_____________________________

3, ఏప్రిల్ 2008, గురువారం

వడ దెబ్బ తగల కూడదంటే __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

ఎండలో మనం తిరిగేటప్పుడు, ఎండా నుండి మన చర్మము రక్షించుకునేందుకు మన శరీరము తనలో ఉన్నా నీటిని ఆవిరి చేస్తూ, చర్మాన్ని చల్లబరచుకుంటూ ఉంటుంది. శరీరం ఈ కార్యక్రమాన్ని చేయాలంటే తన లోపల సరిపడా నీరు ఉండాలి. ఆ నీరు కూడా, ఎందలోనికి వెళ్ళే వారికి, లోపల ఉన్న నీరు కొంత చర్మానికి ఖర్చు అవ్వడంతో, శరీరంలో అవసరానికి సరిపడా నీరు తగ్గిపోతుంది. శరీరంలో నీరు తగ్గే సరికి తలకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం, అందులో నీటి శాతం తగ్గటం ఇవన్నే కలిసి తల సున్నితమైన భాగం కాబట్టి ఇక కళ్లు తిరగటం, తూలడం మొదలగునవి జరుగుతూ ఉంటాయి. రోహిణీ కార్తేలలో కూడా వేడి మనల్ని ఏమి చీయకుండా వెన్నెల్లో తిరిగినట్లుగా ఎండలో తిరగాలంటే.
చిట్కాలు:
౧) ఎప్పుడు బయటకు వెళ్ళినా మీ కూడా నీరు ఉంచుకుని పొట్ట ఖాళీగా ఉన్నప్పుడల్లా గంటకు ౨,౩, గ్లాసుల చొప్పున త్రాగుతూ ఉండాలి.
౨) దాహం వీసినప్పుడు నీటినే త్రాగండి. తప్ప ఇతర పానీయాలు త్రాగాకండి. అవి దాహాన్ని తీర్చావు. రక్తంలోనికి నీటిలా ఆ క్రింక్స్ త్వరగా చీరావు.
౩) వేసవి ఎండలో కూడా మూత్రం సాఫీగా వచ్చేటట్లు మనం నీటిని త్రాగుతూ ఉండాలి
౪) ఎండలో తిరిగేవారు తెల్లని కాటన్ బట్టలు వేసుకుంటే ఆ వేడిని త్రిప్పి కోడతై

1, ఏప్రిల్ 2008, మంగళవారం

శుభోదయం__ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

మన పూర్వీకులు ఆచరించిన మంచి ఆహారపు అలవాట్లను, మన ఇప్పటి ఆహారపు అలవాట్లను పరిశీలిద్దాం.
ప్రాతః కాలం లో నిద్ర లేస్తే ఆరోగ్యానికి మంచిదంటారు పెద్దలు. పడుకునేసరికి అర్ధరాత్రి దాటిపోతుంది. ఇక తెల్లవారుజామున లేవాలంటే ఏమి లేవగలరు? పెద్దలు ఆ వాతావరణం ఎంత మంచిదన్న ఏమి చేయగలరు ? వ్యాపారాలు, ఉద్యోగాలు జీవితానికి తప్పవు గదా ! రాత్రి పూట ఐతే నలుగురూ చేరడానికి, కలవడానికి వీలుంటుంది. మేము ఉద్యోగస్తులముమెందలకడనే ఇంటికి చేరాలంటే ఎలా కుదురుతుంది అంటారు? అందుచేత ఉదయం లేచేసరికే పావు ప్రొద్దు గడిచిపోతుంది. లేవగానే పాచిముఖాన్నే బెడ్ కాఫీలు, టీలు కావలనిపిస్తుంది. నిద్రాలో శరీరం చెడులు విసర్జించే కార్యక్రమం లో వుంటుంది. నిద్ర నుంచి మేలుకున్న తరువాత కూడా అదే పని కొనసాగుతూ వుంటుంది. నిద్రలేచిన వెంటనే మన నరాల శక్తి ఎక్కువ పెద్ద ప్రేగులామీద పనిచేస్తూ వుంటుంది. ఎందువల్లనంటే శరీరం లో ఎక్కువ వ్యర్ధ పదార్ధం అక్కడే నిలువ వుంటుంది. కాబట్టి రాత్రంతా అక్కడకు నెత్తిన చెడును బయటకు పంపించే వరకు మనస్సుకు విశ్రాంతి ఉండదు. అంటే రాత్రి అంతా చిన్న ప్రేగులలో, పొట్టలో ఉన్నా చెడును, విసర్జక పదార్దాలన్నింటినీ, మలశాయానికి చేర్చి ఉంచుతుంది. మనం నిద్ర లేచిన వెంటనే పనులు ఏమీ చీయకుండా వుంటే, మనలోని శక్తి అంతా సాఫీగా విరోచనము అయ్యేటట్లు సహకరిస్తుంది. అలా కాకుండా, మనం లేచిన వెంటనే, విరోచనం కాక ముందే బెడ్ కాఫీ తగుతామనుకోండి, మనలోని శక్తి మలం ఉన్నా ప్రేగు నుండి వెంటనే పొట్టలోకి వచేస్తుంది. మరి కాఫీని జీర్ణం చీయడానికి శక్తి కావాలి కదా. విరోచనం సంగతి తరువాత అని పోత్తపని ముందు చీపడుతుంది. నిద్రలేచిన దగ్గర నుండి మనము ఏదో ఒక టిఫిన్ తినే వరకు ఇంకా విసర్జించే పనిలో వుంటుంది.
ఉదయం పూట సూర్యుడి వీడి కిరణాలు ప్రారంభమయ్యే దగ్గర నుండి చెడును విసర్జించే కార్యక్రమం తగ్గుముఖం పడుతూ వుంటుంది. సూర్యుడి వేడి పెరిగే కొద్దీ ఆకలి పెరుగుతూ ఉంటుంది. సూర్య కిరణాలు వేదేక్కడం ప్రారంబించిన దగ్గర నుండి మనం తినడం ప్రారంభించవచ్చు. మనం ౮ లేచామనుకోండి, లేచిన తరువాత జరుగవలసిన విసర్జనకు అవకాసం ఉండదు. అప్పుడే ౮ గంటలు ఐఏపొయిన్ధిఅని, వెంటనే ముఖం కదిగీసుకుని టిఫిన్ తినడం జరిగుతుంది. అదీ తెల్లవారుజామున ౪,౫ గంటలకు లేచామనుకోండి, మన పూర్వీకులకులాగా ఎక్కువ సమయం సుమారు ౨,౩ గంటలు టిఫిన్ తినే ముందు పొట్ట ఖాళీగా వుంటుంది. ఆ సమయంలో శరీరం చెడును విసర్జించడానికి ఎంతో ముధ్యమైనది. తెల్లవారు జామున లేచిన వెంటనే నీరు త్రాగి మల విసర్జన చేస్తే చాలావరకు తేలిక అనిపిస్తుంది. ఆ తరువాత శారీరక శ్రమ గానీ, లెదా యోగాసనములు ప్రాణాయామం లాంటివి కూడా రాత్రి కదిలిన చెడును విసర్జక అవయవాల ద్వారా బయటకు పంపడానికి అవసరం. అదీ విధంగా నీరు ఒక లీటరుకు పైగా త్రాగడం వలన రక్తంలోనికి వచిన చెడు, కనాలలో రాత్రి సమయంలో కదిలిన చెడు, ఈ నీటిలోనికి వాచి అది చెమట, మల మూత్రాల ద్వారా బయటకు విసర్జించబడుతుంది. మరల ఇంకొక లీటరు నీటిని త్రాగి చెడును విసర్జించే కార్యక్రమంలో శరీరానికి సహకరించాలి. ఇలా నిద్ర లేచిన తరువాత ౨,౩, గంటలు శరీరానికి నీటిని తప్ప వేరే పదార్ధం ఇవ్వకుండా శారీరక వ్యాయామం చేస్తూ వుంటే అప్పుడు శరీరం దాని ధర్మాన్ని అది (విసర్జించడం) పూర్తిగా నెరవేరుస్తుంది. ఇది మన ఆరోగ్యానికి శుభోదయం.

పరిచయం__ మంతెన సత్యనారాయణ రాజు

తీగకు పందిరి పరిచయమితేఆ తీగ, పందిరి బంధం పెనవేసుకుంటుంది. మనిషికి మంచి అలవాట్లతూ పరిచయం - మంచి మనస్సుకు ఆరోగ్యానికి అనుబంధం. పెద్దల నుండి అలవాట్లు పిన్నలకు పరిచయమవుతూ ఉంటాయి. మంచివారితో పరిచయం మంచి అలవాట్లకు, చెడ్డవారితో పరిచయం చెడ్డ అలవాస్త్లకు దారితీస్తుంది. భగవద్గీతలో చెప్పినట్లు ఉత్తములైన వారు వేటిని ప్రమాణంగా తీసుకుని ఆచరిస్తారో, వాటిని మిగితా వారు అనుసరిస్తారు. మనం ఎలాంటి తిండి తింటే అలాంటి ఆలోచనలు వస్తాయి. మనకు ఎలాంటి ఆలోచనలు వస్తే అలాంటి పనులు చేస్తాము.
'''' ఎలాంటి తిండో అలాంటి త్రేపు '''' అన్నట్లు ఎలాంటి అలవాట్లు మనకు ఉంటాయో, అలాంటి ఆరోగ్యం మనకు ఉంటుంది.

కడుపు నొప్పి తగ్గాలంటే__ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

కడుపు నొప్పి వస్తే నొప్పికి మాత్ర వేసుకుని నొప్పిని పూర్తిగా తగ్గించుకొని, కడుపుని వదిలి వీస్తారు. దానితో మరలా మరలా వస్తూ ఉంటుంది. ముఖ్యముగా పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం బాగా ఉనవారిలో ఈ సమస్య ఉంటుంది. కారణాలు చూస్తే, పొట్ట నిండా భోజనం తిన్న తరువాత, ఈ బరువు వెళ్లి మలం ప్రేగులపై పడితే ఆ ఒత్తిడికి నొప్పి కొందరికి తిన్నాక వస్తుంది. విరేచనం అయ్యాక, అది పూర్తిగా కాక నొప్పి వస్తుంది. ప్రేగులలో బంక బాగా ఉన్నప్పుడు అది కదిలేతప్పుడు నొప్పి కలుగావచు. ప్రేగులలో గ్యాసు పట్టేసి కడుపు నొప్పి రావచు. అసలు విరేచనం రాక ప్రేగులు బిగదీసి ఇంకొందరికి రావచు. ఏ కారణాల చేత వచ్చినా మనకు నొప్పి తగ్గాలి, నొప్పికి మూలమైన మలమూ పోవాలి.
చిట్కాలు:-
౧) ఎప్పుడూ నొప్పిగా ఉన్నా ఆ నొప్పి భాగంపై నూనె రాసి వేడి నీటి బ్యాగ్ కాపడం రోజుకి 2,3సార్లు పెట్టుకోవచు.
౨) ఎనిమాని రెండుపూటలా 2,3 రోజుల పాటు చేస్తే ప్రేగులలో మలం అంతా పోతుంది.
౩) అన్నం కూరలు పెట్టడం మని పళ్ల రసాలు, పండ్లు, మజ్జిగ కొబ్బరి నెలలు, తేనే నెలలు, మంచి నీళ్లు మొదలగు ద్రవాహారాలతో రెండు రోజులుంచండి మంచిది.
౪) రోజూ రెండు పూటలా ఎనిమాకి ముందు పొత్తి కడుపు ఫై తడిగుడ్డ లేదా మట్టిపట్టీ గాని 20 నిమిషాలు ఉంచి తీసివేస్తే మలం బాగా కదులుతుంది.
౫) మలబద్దకం మళ్ళీ మళ్ళీ రాకుండా ఆహారం తిని, నీళ్లు బాగా తాగి రోజుకు 2,3, సార్లు విరేచనం ఐతే ఇక నొప్పిరాదు.

నడుం నొప్పి తగ్గాలంటే __ మంతెన సత్యనారాయణ రాజు

మెడ దగ్గర నుండి ముడ్డి భాగం వరకూ వెన్నుపూసలు ఒకదానిపై ఒకటి పేర్చి ఉంటాయి. ఇటుకకు ఇటుకకు మధ్య సిమెంట్ పొర ఉన్నట్లే పూసకు పూసకు మధ్య ఒక మెత్తి దిండు లాంటి భాగం ఉంటుంది. దానినే డిస్క్ అంటారు. మనం బరువును పట్టుకున్నప్పుడు లేదా మోస్తున్నప్పుడు ఆ బరువు పూసలమీద పడకుండా పూసకు పూసకు మధ్య డిస్కులు స్ప్రింగ్ లాగ వత్తిడి తెలియకుండా మెత్త దనాన్నిస్తై. కారు గూతులలో వెళ్ళినా లోపలున్న వారికి కుదుపుడు తెలియకుండా స్ప్రింగులు కాపాడినట్లే డిస్కులుమన వెన్నుముకను కాపాడుతూ ఉంటాయి. ఎప్పుడూ ముందుకి వంగికూర్చుని ఆఫీసుల్లో పని చేసుకునేవారికి, వంకర టింకరగా కూర్చునే వారికి, మెత్తటి పరిపుల మీద పడుకునే వారికి, స్కూటర్ల మీద ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి ఈ డిస్కులు వత్తిడికి గురి అవుతాయి. దీని కారణంగా నడుము నొప్పి, కాలుజాలు మొదలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ఎక్కువ శ్రమ చేసినప్పుడు నడుము కండరాలు కూడా వతిడికి గురి అవుతాయి. దీనివల్ల నడుము మధ్య భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది. ముందుకు వంగితే ఎక్కవ అవుతూ ఉంటుంది. విశ్రాంతిలో బాగుంటుంది.
చిట్కాలు:
౧) స్పాంజి పరుపులు మాని పలుచని బొంతలాంటి వాటిపై పాడుకోవడం మంచిది.
౨) నడుము భాగానికి నూనె రాసి రబ్బరు బ్యాగ్లో వేడి నీరు పోసి రెండు పూతల కాపడం పెట్టుకుంటే కండరాలకు ఉపశమనం కలుగుతుంది.
౩) నడుమును ముందుకు వంచే పనులు మాని ఎక్కడ కూర్చున్న నిటారుగా కూర్చుంటే మంచిది.
౪) ప్రతిరూజూ కూడా నడుమును ముందుకు వంచే వ్యాయామాలు పూర్తిగా మాని, కేవలం వెనక్కి వంచే ఆసనాలను మాత్రమే చేస్తే మంచిది. అవి భుజంగాసనము, ధనురాసనము, ఉష్ట్ట్రాసనం మొదలగునవి. అవకాశముంటే రెండుపూటలా వీటిని చేస్తే త్వరగా తగ్గుతుంది.

31, మార్చి 2008, సోమవారం

కంటి చూపు పెరగాలంటే __ మంతెన సత్యనారాయణ రాజు

కంటి చూపు పెరగాలంటే :-

పూర్వం కంటి చూపు తగ్గితే ఇక అక్కడ నుండీ ముసలి వయస్సు వచినట్లుగా లెక్కవేసుకునేవారుఈ మధ్య బాల్యదశ పూర్తి కాకుండానే కంటి చూపు తగ్గి పోతుంది. కొన్ని జీవులు 400 నుండీ 1000 సంవత్సరాల వరకు జీవించేవి ఉన్నవి. అంతకాలం జీవించినా ఏ జీవికి ఇంత వరకు కళ్ళజోడు అవసరం తెలియకుండానే జీవించగలుగుతున్నాయి. అన్నీ ఉడికించి, వార్చి, మాడ్చి, అందులో ఉప్పు, నూనెలు కలుపుకుని తినే సరికి, కంటి అవసరాలు ఆహరం ద్వారా తీరడం లేదు. ప్రకృతిలో పచ్చదనాన్ని చూసి విశ్రాంతి పొందవలసింది పోయి జిగేలు మనే రంగు రంగుల బొమ్మలు చూసేసరికి శుబ్రంగా చెడిపోతున్నాయిదీనికి పరిష్కార మార్గం, మళ్ళీ సహజంగా జీవించడమే.

చిట్కాలు:-
౧) ప్రతీ రోజూ ఉదయం క్యారెట్ కొంచెం ఎక్కువగా వేసుకుని పచ్చికూరాల రసం త్రాగాలి.
౨) అవకాసమున్న వారూ మునగ ఆకుని రోజూకొంత పచికూరాల రసం లో వేసుకుని త్రాగితే మంచిది. లీద వారానికి 1,2, రోజులు విడిగా మునగ ఆకు రసాన్ని తీసి దీనిలో నీరు ఎక్కువగా కలిపి, తేనే, నిమ్మ రసం కలుపుకొని త్రగాగాలిగినా మంచిదే.
౩) రోజూ మద్యాహ్నం భోజనంలో ఆకుకూరాలను తప్పనిసరిగా వండుకుని తినాలి.
౪) అవకాశముంది దొడ్డిలో ఆకుకూరాలను స్వయముగా పండించుకున్నవి అయితే పచికూరాల రసం లో రోజూ ఆకుకూరాలను వేసుకుని త్రాగితే మరీ మంచిది.
౫) ఏకాలం లో దొరికితే పండ్లను ఆ కాలంలో రూజుకి 20 శతమన్న తినాలి.
౬) ఉప్పును ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది. ఆ ఉప్పు వల్ల కంటిలో సూక్ష్మమైన రక్తనాళాలు తొందరగా పాడైపోతున్నై.

కాని వాని చేత గాసు వీసంబిచ్చిన __ vemanna

కాని వానిచేత గాసు వీసంబిచ్చి
వెంట దిరుగువాడే వెర్రివాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వదాభి రామ వినుర వేమ.

_______

దుర్మార్గుని చేతికి ధనము ఇచ్చి దానికొరకు మరల అతని వెంట తిరుగుట తెలివితక్కువ తనము. పిల్లి మ్రింగిన కోడి పిలిచిననూ పలకదు..___ వేమన్న

చెరచు __ vemanna

ఒరుని చెర చెధమని యుల్ల మందేంతురు
తమకు చేతెరుగని ధరని నరులు
తమ్ముం జెరచువాడు దైవంబు లేడోకో
విశ్వ దాభి రామ వినుర వేమ.

--------------------

ఇతరులను పాడు చేయవలయునని కొందరు ఆలోచన చేయుదురు. కాని, తమకు కలుగు ఆపదలను గ్రహింపలేరు. ఒకరిని పాడుచేయవలయుననిన భగవంతుడు వారినే పాడు చేయును.___ వేమన్న

పట్టు పట్ట రాదు__ వేమన్న

పట్టు పట్టరాదు పట్టి విడువ రాదు
పట్టెనేని బిగియ బట్టవలయు
బట్టి విడచుకన్న బరగ జచ్చుట మేలు
విశ్వదాభి రామ వినుర వేమ.
--------------

పట్టుదలయే వహింపరాదు. వహించినచో ఆ పట్టు వదల రాదు. పట్టినపట్టు నడిమిలోనే విడుచతకంటే మరణము మేలు. ____ వేమన

భుక్తాయాసం తగ్గాలంటే__ మంతెన సత్యనారాయణ రాజు

వెలితిగా భోజనం చేస్తే సరిపోతుంది కదా! అనిపించవచు కానీ కంచం దగ్గర కూర్చున్నాక అల మాత్రం లేవలేక పోతున్నామని చాలా మంది అంటారు. భోజనం నిండుగా తింటూ దానికి తోడు మంచి నీటిని కూడా త్రాగుతారు. దీనితో పొట్ట ఫుల్లుగా నిండి ఈ బరువంతా వెళ్లి ఊపిరితిత్తుల చివరి భాగాల ఫై పడి, వాటిని సుమారుగా 25,30 శాతం నొక్కి వేస్తుంది. భోజనాన్ని ఆరగించడానికి శరీరానికి ఎక్కువగాలి అవసరం ఉంటుంది. దానికి తోడు ఊపిరితిత్తులు మూసుకుని పోయే సరికి శరీరానికి పూర్తిగా గాలి సరిగ్గా చాలక, భోజనం ఐన దగ్గరనుండీ భుక్తాయాసం వస్తుంది.
చిట్కాలు :-
1) భోజనాన్ని తినేటప్పుడు టేబుల్ ఫై కాకుండా క్రింద కూర్చుని తింటే మంచిది. క్రింద కూర్చునే సరికి పొట్ట పావు వంతు మూసుకుంటుంది. మీరు పూర్తిగా, నిండుగా తిని లేచేసరికి, మీకు తెలియకుండా కొంత ఖాళీ వచ్చి ఆయాసం ఉండదు.
2) తినేటప్పుడు నీరు త్రాగకుండా, తినడానికి అరగంట ముందువరకు త్రాగి, తిన్న రెండు గంటల తరవాత అప్పుడప్పుడు ఒక్కొక్క గ్లాసు త్రాగుతూ ఉంటే భుక్తాయాసం రాదు.
3) పొట్టను 80 శాతం కంటే నింపే విధం గా తినకుండా జాగర్త పడటం మంచిది.

27, మార్చి 2008, గురువారం

ఓవర్ బ్లీడింగ్ తగ్గాలంటే __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

మెన్సాస్లు నెల నెలాటైం ప్రకారం వస్తూ రక్తస్రావం మాత్రం ౮, ౧౦ రోజులకు అవుతూ ఉంటుంది. ఈ సమస్య రక్తహీనత ఎక్కువగా ఉన్నవారిలో, మానసికమైన వత్తిడి ఎక్కువగా ఉన్నా వారిలో తరచుగా వస్తూ ఉంటుంది. కొందరికి గర్భాకోశానికి కంతులు (ఫ్రై బ్రాయిడ్స్) ఉంది బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. మరికొందరిలూ ఎండో క్రయీన్గ్రంధులు సరిగా పనిచేయక పోవడం వలన కూడా రావచ్చు.

చిట్కాలు:-

1) బ్లీడింగ్ అయ్యే రోజులలో ఐస్ ముక్కలుగా చేసి దానిని గుడ్డలో పేర్చి, ఆ గుడ్డను పొత్తికడుపు భాగం అంతా పరిస్తే మంచిది. అలా ౧౫, ౨౦ నిమిషాలు ఉంచితే సరిపోతుంది (మధ్యలో గుడ్డను త్రిప్పితే సరిపోతుంది). ఆ చల్లదనాన్ని తట్టుకోవడానికి రక్తప్రసరణ లో మార్పు రావడం వల్ల బ్లీడింగ్ తగ్గుతుంది. ఇలా ౩,౪ సార్లు వేసుకోవచ్చు.

౨) ప్రతి రోజు ౧,౨ నెలల పాటు తొట్టి స్నానం చేస్తే పూర్తిగా తగ్గుతుంది. ప్లాస్టిక్ తొట్టి గాని, సిమెంటు తొట్టి గాని ( ౨ అడుగుల ఎత్తు, ౨ అడుగుల వైశాల్యం) ఉంటే అందులో నీళ్లు పోసి పిర్రాలు ఆనించి కూర్చుని కాళ్ళను బయటకు వ్రేలడేసి ఉంచాలి. ఆ నెలలో మీ పొట్టి కడుపు భాగం నుండి తొడల వరకు ఉంది మిగతా భాగం తడవకుండా ఉంటుంది. ఇలా ౨౦ నిమిషాల పటు తరువాత లేవొచ్చు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే తొట్టి స్నానం చేయాలి.

౩) రక్తం బాగా పట్టే ఆహార నియమాలు ఆచరిస్తే మంచిది. ఇలా ౨,౩ నెలలు ప్రయత్నించినా తగ్గాక పోతే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.






24, మార్చి 2008, సోమవారం

కీళ్ళ నెప్పులు తగ్గాలంటే__ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

40, 50 సంవత్సారాలు రాక ముందే కీళ్ళ నెప్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కీళ్ళ సందుల్లో జిగురు తగ్గిపోయింది, వయసు వల్ల ఎముకలు అరిగి పోయాయి అంటున్నారు. మనం ఏమి తప్పు చేసినందుకు జిగురు పోతున్నదో ఆలోచన చేయకుండా, వయసు మీద మోపుతున్నాము. మన శరీరము 100 సంవత్సరములు పని చేయాడానికి పుడితే 40, 50 సంవత్సరాలకే ఎందుకు పోతాయి. ఏనుగు కూడా ఆయుషు ౧౦౦ సంవత్సరాలే. అంత బరువున్న ఏనుగుకు కీళ్ళనెప్పులు గాని, వాపులు గాని, అరిగిపోవడం గాని, జిగురు తగ్గడం గాని ఎందుకు లేదు? ఏనుగు ఏది తినాలో బాగా తెలుసు. మనకు అన్నీ తినడం తెలుసు. మనం అన్నీ వండి నవి తినడం వల్ల జిగురు తయారయ్యే గుణం, అరుగుదలను నివారించే గుణం శరీరానికి పూర్తిగా నశించి పోతున్నది. పైగా ఆ ఉడికిన వాటిని ఉప్పుతో తినడం వలన ఆ ఎక్కువైనా ఉప్పు కీళ్ళ సందుల్లో పూర్తిగా పేరుకొని ఆ కీల్లను తినివేయడం, కార్టిలేజ్ ను పాడుచేయడం జరుగుతుంది. ఆ శని అనే ఉప్పును తిన్నంత కలం ఎవరికీ కీళ్ళు మళ్ళీ తిరిగి బాగుపడడం అనేది జరగడం లేదు. ఈ ఉప్పును మనకుండా ఎందరో అన్నో రకాల వైధ్యాలను చేయించినా డబ్బులు పోవడమే తప్ప నొప్పులు పూర్తిగా పోయి మామూలు నడక రావడము లేదు. కీళ్ళ నొప్పులు రాకూదదన్నా, పూర్తిగా పూవాలన్న ఉప్పును త్యాగం చేయక తప్పదు.

చిట్కాలు:-
1) ప్రతీ రోజూ ఉదయం కాఫీ లు మాని 7, 8 గంటలకు పచ్చి కూరల రసం త్రాగితే అందులో వుండే సహజ లవణాల వల్ల కీళ్ళ మధ్యలో జిగురు తయారవుతుంది.
2) ఉదయం టిఫిన్ క్రింద మొలకెత్తిన గింజలను తప్పని సరిగా తినాలి. అందులూ నువ్వుల ఉండను తింటే కీళ్ళ అరుగుదలను నివారిస్తాయి.
3) మధ్యాహ్నం, సాయంకాలం భోజనంలో ఉప్పును పూర్తిగా మాని వండుకుని, ఆ కూరలను గోధుమ రొట్టెలలో పెట్టుకుని తినాలి. సాయం కాలం రొట్టె లలో ఉడికిన కూర కంటే పచ్చి కూరను తింటే మరీ మంచిది.
4) మోకాళ్ళకు నువ్వులనూనె రాసి, వేడి నీటి కాపడం 15 నిమిషాల పాటు పెట్టికుని, ఆ తరువాత మో కాళ్ళపై తడిపిన నల్లటి మట్టి (ఒండ్రు) వేసి పైన గుడ్డ చుట్టి ౧౫, ౨౦ నిమిషాలు ఉంచుకుని కడిగి వేస్తే ఉపసమనం వస్తుంది. ఒండ్రు మట్టి లేని వారు తడి గుడ్డ చుట్టుకొని ఉంచుకోవచ్చు. పైన చెప్పినట్లు చేస్తే 2,3 నెలల్లో తగ్గుతాయి. ఎవరికైతే నొప్పులు వాచి 5, 6 సంవత్సరాలు దాటుతుందో వారికి మాత్రం చాల టైము పడుతుంది. ముదిరితే ఇలా చేసినా ఫలితం రాదు. అన్డుచీత కొంచెం ప్రారంభమైనప్పుడే మేలుకుంటే పూర్తిగా పోతాయి.

నీరసం తగ్గాలంటే __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

ఈరోజుల్లో ౭౦(డెబ్బై), ౮౦ (ఎనభై) సంవత్సరాల వయసులో ఉన్నా ముసలి వారికి ఉన్నా ఓపిక ౪౦(నలభై), ౫౦ (యాభై) సంవత్సరాల వయసులో ఉన్నవారికి లేదు. ౪౦ (నలభై), ౫౦ (యాభై) సంవత్సారాల వారితూ పోలిస్తే పెల్లీడుకి వచ్చిన పిల్లలకు లేదు. పెళ్లీడు పిల్లలతో పోలిస్తే చిన్న వయసు పిల్లలు మరీ బలహీనంగా వుంటున్నారు. ఇలా రాను రాను చూస్తూ ఉంటే భవిష్యత్తు లో తినే ఓపిక కూడా లేక తిని పెట్టు అనే రోజులు రాబోతున్నాయి. దీనికి కారణం బలం లేని ఆహరం తినడం. రుచికి తింటున్నారే గాని బలానికి, ఆరోగ్యానికి కాదు. రూజుకి ౧౫ (పదిహేను), ౧౮ (పద్దెనిమిది) గంటలు పనిచేసినా ఓపిక తగ్గకూడదంటే

చిట్కాలు :--

౧) అన్నింటికంటే ఎక్కువ బలమైన ఆహరం కొబ్బరి. రోజుకి ఒక పచ్చి కొబ్బరికాయను పూర్తిగా ఉదయం పూట టిఫిన్ లాగ తింటే (మొలకేత్తిన విత్తనాల తో పాటు) మంచిది.

౨) ఖర్జూరం పండు చాల ఎక్కువ శక్తిని తక్కువ టైములో అందిచ గలదు. రూజుకి ౨౦ (ఇరవై) ఖర్జూరం పండ్లను ఉదయం కొబ్బరితోగాని సాయం కాలం పండ్ల తో గాని కలిపి తింటే లాభం చాల త్వరగా వస్తుంది.

౩) ముడి బియ్యం అన్నం వండుకుని రెండు పూటలా తింటే ౧౦ (పది), ౧౫ (పదిహఏను) రోజులలోనే ఓపిక పెరుగుతుంది.

ఈ మూడు విషయాలు ఆచరిస్తే ఒక నెలలోనే పూర్తిగా ఒపికను, బలాన్ని సంపా దించు కోవచ్చు.

౪) ఎప్పుడన్నా ఉన్నట్లుండి నీరసం వచ్చి కళ్లు తిరిగితే అలాంటప్పుడు వెంటనే శక్తి కొరకు తేనెను ౩ (మూడు), ౪ (నాలుగు) స్పూన్లు తీసుకుని మెల్లమెల్లగా నాకుతుంటే, ౫ (ఐదు), ౧౦ (పది) నిమిశాములలో (minutes) లో ఓపిక వచేస్తుంది.

17, మార్చి 2008, సోమవారం

సూక్తులు ____ ౧

౧. విసుగుదల నుంచి విముక్తి కోసం పురుషుడు పెళ్లి చేసుకుంటే , స్త్రీ ఆసక్తి కొద్ది పెళ్లి చేసుకుంటుంది. అందుకీ వాళ్ళిద్దరూ వివాహిక జీవితం లో నిరాశ పడుతుంటారు.___ ఆస్కార్ వైల్డ్
౨. లోకులు తొందరగా నిందిస్తారు లేదాతొందరగా అభినందిస్తారు అందుచేత ఇతరులు నిన్ను గురుంచి అనుకునే మాటలకు పెద్దగ విలువ ఇవ్వవద్దు. __ రామకృష్ణ పరమహింస
౩. నొప్పి ఉన్నపన్ను ఊడ బెరుకుట మేలు. మూర్ఖుడైన మిత్రుని పోగొట్టు కొనుట ఉత్తమము.__ బక్సటర్
౪. మానవుని కష్టాలన్నీ టికి కారణం అతని అజ్ఞానం, క్రమశిక్షణ రాహిత్యం.__ కౌటిల్యుడు
౫. మనలో ప్రశాంతతను కనుగోనలేని పక్షంలో దాని కోసం ఇతర చోట్ల వెతకడం వ్యర్థం __ లరోచేఫౌకల్దే
౬. సందర్భోచితమైన మౌనం మాటల కంటే ఎక్కువ వాగ్దాటిని గలిగి వుంటుంది.
౭. మీ కష్టాలను ఇతరులతో ఏకరువు పెట్టుకోకండి. చాలామంది వాటిని పట్టించుకోరు. మిగితా వారు మీకష్టాలను విని సంతోషిస్తారు.
౮. గొప్పవారు లేనిదే మనం ఎ గోప్పదాన్నిసాధించలేము. తాము గొప్ప వారం కావాలని నిర్నయిన్చుకున్నప్పుడే మనుషులు గొప్పవారౌతారు__ చార్లెస్ దిగాలే ..
౯. పెద్ద పెద్ద విషయాలకు సంభందించిన ప్రనాలికను తయారు చేసుకోవడం కంటే చిన్న చిన్న విషయాలకు తాయారు చేయడం మెరుగైనది.
౧౦. చిరకాలం నిలిచిపోయే పనులపై జీవితాన్ని వేచ్చించడమే పరమ ప్రయోజనం అవుతుంది.__ విల్లియం జేమ్స్.