21, నవంబర్ 2009, శనివారం

ఏది సరైన చికిత్స __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

నేడు వైద్య విధానం ఎంతో అభివృద్ది చెందింది. ఇంకా ఎంతో చెందాలి. అది ఈ సమాజానికి చాలా అవసరం. మానవుని మీలు కోరి ఎందరో మహానుభావులు ఎన్నోరకాల వైద్య విధానాలు రూపొందించారు. అవి, ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి, యునాని మొదలగునవి. ఇవన్ని మనిషికి ఎంతో లాభాన్ని కలిగిస్తున్నాయి. బాధ తో వెళ్ళిన మనకు ఎంతో ఉపసమానాన్నిసుఖాన్ని కలిగిస్తున్నాయి. మనకొచ్చిన సమస్యకు ఎ వైద్య విధానము పాటించినా దానివల్ల మనకు పూర్తి లాభం రావచ్చులేదాకొంత వరకే ఉపసమనం కలుగవచ్చులేదా అసలు కొంచెం కూడా తగ్గకపోవచ్చు. ఒకసారి తగ్గకపోగా దుష్ఫలితాలైన రావచ్చు. ఏ లాభాన్నిచ్చినా సరే, మనకు ఏదైనా జబ్బు వచ్చాకే అవి అవసరమవుతున్నై. జబ్బు రాని వారు ఏ వైద్య విధానం జోలికి పోరు. ఏ జబ్బు రాకుండా అవి మనకు సహకరించలేక పోతున్నై. ఉదాహరణకు కడుపునొప్పి వచ్చాక మాత్ర వేసుకుంటే నొప్పి తగ్గవచ్చు, మిగితావారికి నొప్పి రాకుండా ముందునుండీ ఆ నొప్పి మాత్ర వేసుకున్దామంటే అది పనిచేయ్యకపోగా హాని చేస్తుంది. వైద్య విధనాలన్నీఇలా ఉంటే, ప్రకృతి వైద్య విధానం మాత్రం వీటన్నిటికి భిన్నం గా పని చీస్తుంది. ఉదాహరణకు కడుపు నొప్పి తగ్గడానికి ఎనిమా చేసి, ప్రేగులను క్లీన్ చేసి, మంచి ఆహరం పెట్టి నొప్పి తగ్గిస్తారు. ఈ చికిత్సా పద్దతిని కడుపునొప్పి లీనివారు, రాకుండా ఇలా ముందు జాగ్రత చర్యగా చేసుకుంటే, వారికి ఆ సమస్య భవిష్యత్ లో రాకుండా ప్రేగులు పరిశుభ్రంగా ఉంటాయి. అంటే ఇక్కడ చేసే ప్రతి చికిత్స కూడా జబ్బు వచ్చిన వారికి ఏది తగ్గించడానికి పనికొస్తుందో, అదే చికిత్స జబ్బు లేని వారికి రాకుండా సహకరిస్తుంది. రెండు పక్కల పదునున్న కత్తి లాంటిందన్న మాట . సరైన చికిత్స అంటే, రాగి చెంబు చిల్లు పడితే రాగిముక్క అతుకు వేయడం ఎంత సరైనదో, ఈ ప్రకృతి సిద్దమైన శరీరానికి ప్రకృతి చికిత్సలు కూడా అంత సరిగా సూటు అవుతాయి. పాలలో పాలు కలుసినట్లుగా, చికిత్స, శరీరం రెండు ఒకటిగా కలసి పోతాయి. వీటి మధ్య ఘర్షణ రాదూ. అంటే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. ఇలాంటి ప్రకృతి సహజమైన పద్దతుల ద్వారా మనందిరికీ వచ్చే సాధారణ సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నించడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. మన శరీరానికి ఏదన్నా సమస్య వస్తే సహజముగా, ప్రకృతి సిద్ధముగా ఆ సమస్యను తగ్గించు కోవడానికి ముందు మనం ప్రయత్నించాలి. అలా చేసినా ఫలితం లభించక సమస్య పెరుగుతూ వుంటే అప్పుడు ఇతర వైద్య విధానాల జోలికి వెళ్ళడం తప్పు కాదు. కాని మనం ముందే వాటిని వాడుకుంటూ శరీరానికి విరుద్దంగా ప్రయత్నిస్తున్నాము. ఇక నుండైనా ఈ శరీరానికి ఏది వచ్చినా ప్రకృతి సిద్దంగా తగ్గించే ప్రయత్నం ప్రారంభిస్తే మనకు ఎక్కువ లాభం జరుగుతుందని ఈ చికిత్సా పద్దతులను వ్రాస్తున్నాను. ఈ ప్రకృతి చికిత్స పద్దతులను కొంతకాలం చేసి ఆపవలసిన పని లేదు. ఎందుకంటే, ఇది మందు కాదు కాబట్టి, జబ్బులున్నా లేకపోయినా, ఇంటిల్లిపాది అందరం ఇలాంటి మంచి అలవాట్లను ఆచరణలో ఉంచుకొని ఆరోగ్యాన్ని బాగు చేసు కొంటారని ఈ ఆర్టికల్స్ వ్రాస్తున్నాను. మంచి మనసుతో ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.
___
____
జంతువులకు ఏ సమస్య వచ్చినా వెంతనీ ప్రకృతి సిద్దం గా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నై. వికారం గా వుంటే, తనకు గిట్టని ఆహారాన్ని తిని వెంటనే వాంతి చేసుకుని సమస్యను తగ్గించుకుంటాయి. ఆకలి వెయ్యకపోతీ పొట్టను మాడ్చి మళ్ళీ ఆకలి పుట్టే లాగా చేసుకుంటాయి. ఇలా చికిత్స చేసుకోవడం కూడా వాటి జీవితం లో ఒక భాగంగా చేసుకుని బ్రతుకుతాయి. అలా చికిత్స చేసుకోవాలని అవి ఎక్కడ చదువు కోవు , ఎవరి చేత చెప్పించుకోవు. మనకు వచ్చింది కూడా అలాంటి శరీరమే. అలాంటి జన్మే. అయినా వాటికీ లేని తెలివితేటలు, జ్ఞానం అదనం గా మనకు లభించినందుకు వాటి కంటే మనము ఇంకా తెలివిగా ప్రవర్తించి సమస్యలను తేలిగ్గా పోయేట్లు మనకి మనమే ప్రయత్నించాలి. మరి మన శరీరానికి, సహజంగా సమస్యలను తగ్గించే మార్గాలు తెలిసినా చేసుకోలేక పోతే నష్టం మనకే. మన ఇంట్లో ఉండే వాటినుపయోగించుకుంటూ, మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకునే ఈ సదవకాసాన్ని అందరూ వినియోగించుకుని, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోశాలతో, ఆనందం గా జీవించే ప్రయత్నాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను...

గ్యాసు బిగపట్టడం పోవాలంటే __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

కొందరికి గ్యాసు పొత్తి కడుపు భాగంలో బిగపట్టి బయటకు రాదు. ఏమి చేయాలో తూచని ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అపానవాయువు వస్తే బాగుంతుంధనిపిస్తుంది. అది ఎదురుచూడగా చూడగా ఎప్పటికో ఎన్నో ప్రయత్నాలు చేయగా గాని బయటకు రాదు. అది బయటకు వస్తే ప్రాణం హాయిగా వుంటుంది. అలా గ్యాసు బిగియడానికి కారణాలు చూస్తే ....
౧) ఎక్కువ సేపు ( మూత్రం సంచి నిండే దాకా) ఆపుకోవడం,
౨) నడుముకు బట్టలను టైటుగా బిగించడం,
3)మలద్వారం దాక మలం వచ్చి బిగిసిపోవడం మొదలగునవి.
౪) అలాగే ఛాతీ బాగంలో, పొట్ట భాగంలో గ్యాసు త్రేన్పురూపంలో రాకుండా పట్టేస్తుంది.
౫) త్రేన్చుదామనుకున్నా త్రేన్పు రాదు.
ఇలా గ్యసుపట్టినప్పుడు ఆ గ్యాసు ఫ్రీగా బయటకు రావాలంటే....
చిట్కాలు ()----
౧) ముందు బెల్టు, బట్టలు కాస్తా వదులు చేసుకోవడం మంచిది.
౨) మూత్రం రాకపోయినా వెళ్లి కూర్చుంటే అప్పుడు కొంత గ్యాసు ఆ టైములో బాగా కదిలి బయటకు పోతుంది.
౩) ఫై భాగంలో గ్యాసు పడితే వజ్రాసనం (నడుమును లైనుగా పెట్టి ఎలా కూర్చున్నా ఫరవాలేదు) లో కూర్చుంటే గ్యాసు రిలీజు అవుతుంది.
౪) ఇంకా బిగపట్టి ఉంటే ౫(ఐదు), ౧౦ (పది) సార్లు శ్వాసలను గట్టిగా పీల్చి వదిలితే, ఆ కదలికలకు గ్యాసు బయటకు వస్తుంది.
౫) ఇంకా రాకపోతే, వేడి నీటిని కాఫీలాగా మెల్లగా త్రాగితే ప్రేగులలో ఆ వేడి కదలికలను పెంచి గ్యాసు బయటకు వస్తుంది.
౬) ఇంకా ఇబ్బంది ఉంటే చాతీ ఫై గాని బొడ్డు క్రింద గాని కొంచెం నూనె రాసి వేడినీటి కాపడం పెడితే చాలావరకు వచ్చేస్తుంది. ఇంకా ఇబ్బంది ఉంటే డాక్టర్ల సలహా ఫై ఏదైనా మందు వాడు కోవచ్చు. పైన చెప్పిన వాటిలో మీకాసమయం లో ఏది అవకాశం ఉంటే దానిని చేసి చూడండి.
------డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు. -

20, నవంబర్ 2009, శుక్రవారం

యద్భావం తద్భావతి__ ఇదే జీవిత మర్మం

జీవితం ఒక రణరంగం అనుకొనే వారికి అదొక "యుద్ద రంగం"----

***
జీవితం ఒక సమస్యల సుడిగుండం అనుకునే వారికి అదొక అంతు చిక్కని "పద్మవ్యూహం"----
***
జీవితాన్ని చూసి భయపడే వారికి అదో పెద్ద పెనుభూతం -------
***
తామరాకు ఫై నీటి బిందువులా జీవితాన్ని భావించే వారికి అదో గీతర్ధ సారం ----
***
జీవితం అంటే ఒక మధుర స్వప్నం అనుకునే వారికి అదొక "భూలోక స్వర్గం "
***
"యద్భావం తద్భావతి " అన్న రీతిగా ఉంటుంది--- జీవితం
***
ఇక్కడ మీకో చిన్న కధ చెప్పాలి ....
***
ఒక రోజు ఒక చాకలివాని బట్టలు మోసే గాడిద పొరపాటున కాలుజారి, ఆ ఊరి వెలుపలి పాడుపడిన బావిలో పడింది. ఎత్తు నుంచి పడటంతో దాని నడుము విరిగిపోయినంత పని అయ్యింది. దీనితో స్ప్రుహ తప్పి సొమ్మ సిల్లి అలా ఆ బావిలోనే ఉంది పోయింది. సాయంత్రానికల్లా ఇంటికి రావలసిన గాడిద రాక పోవడంతో చాకలి దిగులుతో తన గాడిద కోసం ఊరు వాడ అంతా గాలింపు ప్రారంభించి... సాయం సమయానికి... నీరు లేని, వాడుకలో లేని ఊరు వెలుపలి దిగుడు బావిలో తన గాడిద పడిపోయి ఉండడాన్ని గమనించి, అది చనిపోయిందని భావించి అదే బావిలో మరో మనిషో, మరో జంతువో పది ప్రాణాలు కోల్పోకుండా తన ప్రియమైన గాడిదను బలిగొన్న ఆ బావిని పూడ్చి వేయాలని నిశ్చయించుకొని ఆ పనీదో ఆ రాత్రికి రాత్రే చెయాలని నిర్ణయించి అప్పటికప్పుడు ఊరివారి సాయంతో పది బల్ల మట్టి తెప్పించి ఆ రాత్రి తనతో పాటు మరో ఇరువురు కలిసి మట్టిని బావిలో పరలతో నెడుతూ బావి పూడ్చడం ఆరంబించారు. అంత ఎత్తునుండి మట్టి తన ఒంటి పై పడటంతో గాడిదకు తెలివి వచ్చింది. జరుగుతుందేమితో, జరగబోయేదేమిటో దానికి అర్ధమైపోయింది. అది తెలివిగా పై నుండి మట్టి బావిలోకి పది అది తన వంటిపై పడినప్పుడల్లా తన ఒంటిని విదిలించడం మొదలు పెట్టింది. ఫలితంగా తెల్లవారే సరికి బావైతే మట్టితో మునిగిపోయింది కానీ ఆ మట్టిలో గాడిద సమాధి కాలేదు. తోక ఊపుకుంటూ ఆ మట్టితో పాటు పైకి వచ్చేసింది.
***
ఈ కధలోని మర్మం గుర్తించగలిగితే మన "జీవితం" మహాత్తరంగా మారిపోతుంది.
***
"జీవితం" లో కష్టాలు బావిలో ఉన్నా గాదిధపై పడిన తట్టల తట్టల మట్టిలా మనపై పడటం మనల్ని నొప్పించడం అతిసహజంగానే జరిగుతూనే ఉంటుంది. వాటి కారణంగా మనం అటు శారీరకంగా ఇటు మానసికంగా క్రున్గిపోయామా వాటిలో మన జీవితం సమాధి అయిపోవడం తద్యం.
***
కష్టాలు, నష్టాలు, భాధలు కన్నీళ్లు కట్ట కట్టుకొని, చుట్ట చుట్టుకొని సుడిగుండాల్లా మనల్ని చుట్టుముట్టినా సరే సింహం జూలు విదిలించినట్లు ఒక్కసారి విదిలించి వీసి చిరుతపులిలా జీవించడంలో ముందుకు దూసుకు పోవాలి. అలా దూసుకుపోయిననాడు ఏదో ఒక నాటికి మీరనుకున్నది సాధించగల్గుతారు

***
ఇందుకు మీరు సిద్దం కావాలన్నమీ మనసును సిద్దం చెయ్యాలన్నా మీరు కొన్ని నియమాలు పాటించక తప్పదు......
***
౧) మీలోని భయాలను తొలగించుకోండి.
౨) అవి ఏ రూపంలో ఉన్నా వాటినుండి బయటపడే ప్రయత్నం చెయ్యండి.
౩) పలురకాల ఆందోళనలు మిమ్మల్ని తరచూ వర్రీ చేస్తుంటాయి. ఏ వర్రీ మిమ్మల్ని ఎంతగా వర్రీ చేసినా మీరు వర్రీ అయిపోకండి. ఆ వర్రీలన్నీ ఒక డైరీలో వ్రాసుకోవడం అలవాటు చేసుకోండి.
***
కొన్ని రోజుల తరువాత ఆ డైరీ చదివితే అనవసరమైన విషయాలకు అనవసరంగా ఇంతకాలం వర్రీ అయిపోయామని మీరే గ్రహిస్తారు. " అసూయా ద్వేషాలకు అతీతంగా జీవించండి.
***
మీ జీవితంలో జరిగిన సుఖాలను, మంచినీ మరీ మరీ తలచుకొని ఆనందించండి.
***
కష్టాలను, నష్టాలను, అవమానాలను, అవహేలనలను అప్పటికప్పుడే మరిచిపోయే ప్రయత్నం చెయ్యండి. అవి తీపి జ్ఞాపకాలు కావు మరల మరల గుర్తు తెచ్చుకునేందుకు.
***
పల్లీలు తింటూ ఆనందించే (సమయంలో ) తరుణంలో చెడు పప్పు తగిలితే వెంటనే తుపుక్కున ఊసేసి ఎలా అయితే చెడు రుచిని నోటి నుంచి దూరం చెయ్యడానికి మంచి పల్లీలు తింటారో అలానే జీవితంలో చెడు అనుభవాలను ఆ క్షణంలో చెడు అనుభవాలను ఆ క్షణంలోనే మీలోంచి తుదిచేయండి. మరలా జీవితంలోకి తీపిని ఆహ్వానించండి.
***

మీ కోపం ఎలా వుండాలి __ స్వామి సుఖబోధానంద ...

" తన కోపమే తన శత్రువు " అన్నది శతకకారుడి అప్తవాక్యం. నవరసాల్లో రౌద్రానికి స్థానం వుంది. రౌద్ర రసం అంటే ఆగ్రహంలోని శక్తి. ఆ శక్తిని సంతరించుకోవాలంటే మనిషికి కోపం వుండాలి మరి. అలాగని అస్తమానం కారాలు, మిరియాలు నూరమని కాదు. ఆరోగ్యకరమైన కోపం మనిషికి చాలా అవసరం. గాంధీజీ కోపాన్ని అహింసా పథం లో నడిపించారు. దానికి సత్యాగ్రహం అని పేరు పెట్టారు కూడా! ఆరోగ్యకరమైన ఆగ్రహం జీవితాన్ని ప్రయోజనకరంగా మలుస్తుంది. అదే అనారోగ్యకరమైన కోపం బతుకును చిందరవందర చేస్తుంది. మనిషిలో కోపం లేకపోయినా ఇబ్బందే. అందరికి లోకువై పోతాడు. శ్రీ కృష్ణుడి అన్నబలరాముడు ఒక సారి తన తమ్ముడితో ఇలా అన్నాడు. ఏమిటిది కృష్ణ, నీకు నీకు అణిగిమణిగి ఉండేవాళ్ళు నీపట్ల కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తుంటే నీకు కోపం రావడం లేదేం? ఆ మాటలకు కృష్ణుడు నవ్వాడు --" నా కోపాన్ని కోడా నువ్వే తీసుకున్నావు కదా .... నాకు అగ్రహించే అవకాసం ఎక్కడఉంది అన్నయ్యా ? అంటూ చమత్కరించాడు. అది బలరాముడి కోపాన్ని రెట్టింపు చేసింది. అప్పుడు కృష్ణుడు--"నాకూ కోపం వుంది "..
-----
కాని నా కోపానికి, నా ఆగ్రహానికి తేడా ఉంది. నాలోని కోపానికి కళ్లు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, హృదయం ఉంది. అందువల్ల ఎప్పుడు ఎటు వెళ్ళాలో దానికి స్పష్టం గా తెలుసు. అది సాత్విక ఆగ్రహం నన్ను మరింత బలవంతుడిని చేస్తుంది తప్ప విచక్షణ కోల్పోయ్యేలాచేయదు" అన్నాడు.
------
సాత్వికమైన కోపం ఎలా ఉంటుందో శ్రీ కృష్ణుడి సమాదానం లో మనకు స్పష్టమవుతుంది. విచక్షణ కోల్పోయి ఉన్మాదిగా మార్చే కోపం హానికరమైనది. అలాంటి అసాత్వికమైన కోపాన్ని శుద్ధి చేయడం ద్వారా రౌద్రరసం లోని శక్తి మనకు ప్రయోజనకరమవుతుంది. కోపం వచినప్పుడు మనం కొంచెం కోపాన్ని, మనకు ఎదురైన పరిస్థితినీ చెరో వైపు నిలబెట్టి తూకం వేయాలి. పరిస్థితికి తగ్గట్టుగా ఉన్నా కోపం సరైనది, సత్వికమైనది. దానికి బిన్నంగా ఉన్నా కోపం అనారోగ్యకరమైనది, అవాన్చనీయమైనది .
-----
ఆగ్రహాన్ని బేరీజు వేయడానికి ధర్మ మీటర్ లాంటి భౌతిక ఉపకరణాలు లేవు. మనసులోని ఆధ్యాత్మిక కేంద్రం ద్వారానే ఇది వీలవుతుంది. పరిస్థితికి అనుగుణమైన కోపాన్ని ప్రదర్శించాల్సిందే. అలాంటి కోపం చెమట లాంటిది. శరీరంలోని మురికి చెమట ద్వారా బయటకు వచ్చినట్లుగా పరిస్థితికి సరితూగే ఆగ్రహాన్ని మనం వ్యక్తం చెయ్యాలి. లేకపోతే అది మనసులో పొరలు పొరలుగా పేరుకొని ఉంటుంది. కోపం గతానికి చెందినధైతే దాన్ని అక్కడే పూడ్చి పెట్టడం మంచిది. అలాకాకుండా గతం చూరును పట్టుకొని వేలాడితే వర్తమానం చెడుతుంది. భావిష్యతు పాడవుతుంది. పరిస్థితికి మించిన కోపం మీలో జాడలు విప్పినప్పుడు జాగ్రతగా గమనిస్తే దాని మూలాలు దుఖంలో కనిపిస్తాయి. అప్పుడు కోపాన్ని పక్కన పెట్టి దుఖానికి కారణాలు వెతకండి. మనసుపొరల్లో గూడుకట్టిన దుఃఖం చురుగ్గా మారినప్పుడు కోపం రూపంలో విరుచుకుపడుతుంది. ఈ కల్లోలాన్ని చక్కదిద్ది మానసిక స్థితిని శుద్ధి చేస్తే దుఃఖం తొలగిపోతుంది.__ స్వామి సుఖబోధానంద

18, నవంబర్ 2009, బుధవారం

పసిడి పలుకులు -1

1.  జీవించడం ఇవ్వడానికే! ఇచ్చేవారే జీవిస్తారు. 

2.  ధనికుడిగా మరణించేవాడు అపకీర్తితో మరణిస్తాడు.  మరణం రావడానికి ముందు మనచుట్టూ వున్న ప్రపంచానికి సేవ చేసే నిమిత్తం కావలసినంతగా ఇద్దాం. 

3.  కొందరే సంపద కలిగి వుంటారు. మనలో చాలామందిని సంపద సొంతం చేసుకుంటుంది. 

4. ధనంతో నీవు ఎన్నిటినో కొనుక్కో వచ్చు.  కాని గొప్పగా ఎంచుకొనే శీలం, నీతి, విదీయులైన మిత్రులూ, ఆధ్యాత్మిక సంపదను మాత్రం నీవు కొనలేవు. 

5. నీకేంతమంది సేవకులు ఉంటారో చూసి లోకులు అంత మర్యాదను నీకు ఇస్తారు.  ఇహలోకంలో నీవు ఎంతమందికి సేవ చేసావో దాన్ని బట్టి నీ గొప్పతనం నిర్ణయించబడుతుంది.

6.  మౌనంగా సేవ చేయి.  ప్రియంగా సేవ చెయ్యి.  నిరాడంబరంగా సేవ  చెయ్యి ప్రతిఫలాన్ని దేన్నీ కోరుకోకుండానే సేవ చేయి.  "కృతజ్ఞున్ని!" అనే మాటను కూడా ఎదురుచూడకు.

7.  జీవితం స్వల్పం.  దురదృష్ట జీవుల సీవలో నీకు వీలైనంతగా సేవ చేయడానికి త్వరపడు.

8.  నీవు ఇవ్వాలనుకుంటే ఆలస్యం చేయు. వెంటనే ఇచేయ్యి.

9.  నీకు మల్లి తిరిగి ఎన్నటికీ ఇవ్వలేని వారికి నీవు ఈడైనా ఇచీదాక నీవు పరిపూర్ణంగా జీవిన్చానట్లే!

10.  మనిషి జీవితంలో మూడు అతి ముఖ్యమైనవి.  మొదటిది ఇవ్వడం.  రెండోది ఇచి, ఇచినదాన్ని పద్దులో రాసుకోకపోవడం.  మూడోది ఇవ్వడం - ఇచినట్లు నీవు పూర్తిగానే మర్చిపోవడం! 

13, నవంబర్ 2009, శుక్రవారం

వికారం తగ్గాలంటే ..మంతెన సత్యనారాయణ రాజు

జీర్ణ క్రియలో దోషాల వలన ఎక్కువగా వికారం వస్తుంది.  నిద్ర లేచిన వెంటనే ప్రేగులలో పసర్లు ఎక్కువగా వున్నా తిన్నది సరిగా అరగకపోయినా ఆహారం తిని బస్సు, కారు లాంటివి ఎక్కినా, ఆహారంలో సరిపడని విష పదార్ధాలు వున్నా వికారాలు వస్తూ వుంటాయి.  వికారం వున్నప్పుడు వాంతి అయితే బాగున్తుందనిపిస్తుంది.  ఈ లోపు కళ్ళు కూడా తిరుగుతూ కుదురు లేనట్లు వుంటుంది.  వాంతి వచ్చినట్లుంటుంది  కానీ వాంతి రాదు.  వాంతి అయితే బాగుంటుందని ఆందరికీ అనిపించినా వాంతి చేసుకోవాలనే ఆలోచన పట్టాడు.  వికారం ముదిరితే కానీ వాంతి అవదు.  వాంతి ఐతీ కానీ తిక్క తగ్గదు.

చిట్కాలు:  
1 .  అవకాశం వుంటే గోరువెచ్చని నీరు, లేనప్పుడు బిందెలో నీరు 5, 6  గ్లాసులు గ్లాసులు (ఉప్పు కలపకుండా) ఆపకుండా త్రాగండి.  ఇంకా త్రాగ గలిగితే త్రాగండి.  నీరు త్రాగుతుంటే వికారం ముదరాలి.  త్రాగేతప్పుడే వాంతి వచ్చేటట్లు త్రాగండి.  త్రాగాలేనప్పుడు ఆపి వ్రేళ్ళను నోటిలో పెట్టి వాంతి చేసుకోండి.  మనము త్రాగిన నీళ్ళు వెళ్లి లోపల వున్నా దోషాన్ని పట్టుకొని బయటకు వచేస్తాయి.  పొట్టలో ఆహరం వున్నా సరే ఎప్పుడు వికారం వుంటే అప్పుడు ఇలా వాంతి చేసుకోవచ్చు.  వెంటనే ఏమి తినకుండా కాసేపు విశ్రాంతి తీసుకొని తేనె నిమ్మరసం కానీ కొబ్బరి నీళ్ళు కాని త్రాగితే హాయిగా వుంటుంది... 

10, నవంబర్ 2009, మంగళవారం

అసలైన ఆరోగ్యానికి, సిసలైన అవసరాలు __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

1. వేలుగోచ్చే వరకు పరుండటం మాని, వేకువ జామునే లేవడం మంచిదను....!
2. బెడ్ కాఫీలు మాని, పరగడుపున ఎక్కువ మంచినీరు మంచిదను!
3. పేపరు పై మనస్సు మాని, సుఖవిరేచనం పై మనసు మంచిదను....!
4. నడకే శ్రమ అనడం మాని, ఆసన ప్రానయామాలు మంచిదను....!
5. చెమట పట్టకుండా తినడం మాని, చమట పడితేనే తినడం మంచిదను....!
6. వీడి నీరు స్నానం మాని, ఉదయం చన్నీళ్ళు తలకు మంచిదను....!
7. సబ్బులు, షాంపూలు మాని, గుడ్డతో చర్మం మర్దన మంచిదను....!
8. పూరీలు, దోసెలు మాని మొలకెత్తిన విత్తనాలు మంచిదను!
9. పచ్చి కొబ్బరిని క్రొవ్వు అనడం మాని, సంపూర్ణాహారం అనడం మంచిదను....!
10. తినేటప్పుడు నీరు త్రాగడం మాని తినే అరగంట ముందు లీటరు నీరు మంచిదను....!
11. కష్టంగా జీర్ణమయ్యేవి రాత్రికి మాని, ఉదయం తినడం మంచిదను....!
12. ముత్యాల్లాంటి మర బియ్యం మాని, ముడి బియ్యం మంచిదను....!
13. కూరలకు తొక్కలు తీయడం మాని, తినడం మంచిదను....!
14. కూరలను వేయించడం మాని, కొద్దిగా ఉడక నివ్వడం మంచిడను....!
15. కూరలలో నీటిని వార్చడం మాని, త్రాగడం మంచిదను....!
16. పచ్చి కూరలు పడవు అనడం మాని, సహజారోగ్యానికి మంచిదను....!
17. భోజనం చేసేటప్పుడు మాటలు మాని, మనస్సు పెట్టి తినడం మంచిదను...!
18. అన్నంలో కూర కలపడం మాని, కూరలో అన్నం కలపడం మంచిదను....!
19. ఆహారాన్ని నమలకుండా మ్రింగడం మాని, పడే పడే నమలడం మంచిదను....!
20. భోజనం అయ్యాక నీరు మాని, భోజనం అరిగాక త్రాగడం మంచిదను....!
21. పగటి పూట నిద్దర మాని, రాత్రికి గాఢ నిద్ర మంచిదను....!
22. ఖరీదు గల హైబ్రీడ్ పళ్ళు తినడం మాని, నాటు పళ్ళు తినడం మంచిదను....!
23. పళ్ళు రొంప అనడం మాని, రోగ నిరోధకానికి మంచిదను....!
24. పల్లలోని పిప్పి ఊసి వేయడం మాని, అది మింగడం మంచిదను....!
25. రసాలను త్రాగానడం మాని, నమలడం మంచిదను....!
26. పనికిరాని కాలక్షీపం మాని, మనస్సుకు దైవ చింతన మంచిదను....!
27. గదులలో మగ్గడం మాని, ఎండా తగలడం రోగనిరోధకానికి మంచిదను....!
28. ఫ్యాన్లు, ఏ.సి లు మాని, చెమట పడితే ఆరోగ్యానికి మంచిదను....!
29. పలుమార్లు విరేచనం బలహీనమని మాని, ౩,౪, సార్లు సాఫీగా అవడం మంచిదను....!
30. పైకి పౌడర్లు, అత్తర్ల పూత మాని, రెండు పూటలా స్నానం మంచిదను.
31. పొద్దుపోయాక భోజనం మాని, పొద్దు ఉండగానే భోజనం మంచిదను.
32. ఉన్నదని తినడం మాని, శ్రమకు తగిన తిండి మంచిదను....!
33. రాత్రికి పీకలదాకా తినడం మాని, ఫ్రీ గా తినడం మంచిదను....!
34. రాత్రికి సినిమాలు, షికార్లు మాని, సత్ సాంగత్యము మంచిదను....!
35. తిని పాడుకోవడం మాని, అరిగాక పాడుకోవడం మంచిదను ....!
35. కృత్రిమమైన ఆహారాలు మాని, సహజ దేహానికి సహజాహారం మంచిదను....!
37. ఫ్రిజ్ ల వాడకం మాని పళ్ళు, కూరలకు గాలి, వెలుతురు మంచిదను....!
38. రోజూ బీరు, కూల్ క్రింక్స్ మాని, కనీసం ౬ లీటర్ల మంచి నీరు మంచిదను....!
39. ముప్పు తెచ్చే ఉప్పును తాకటం మాని ఆహరాంలో ఉన్నా ఉప్పే ఆరోగ్యానికి మంచిదను....!
40. కఫాన్ని పెంచే పంచదార, బెల్లాలు మాని, అన్ని విధాలా తేనె వాడటం మంచిదను....!
41. చింతపండు వాడకం మాని, పచ్చి చింతకాయ వాడకం మంచిదను....!
42. ఎందు మిర్చిని వాడడం మాని, గుణాలు గల పచ్చి మిర్చి మంచిదను....!
43. అపకారం చేసే నూనె, నీతులు మాని, నేటి కాలానికి ఇది మంచిదను....!
44. మషాలాలు ఆహారంలో మాని, ముందుగా వాడటం మంచిదను...!
45. చీటికి, మాటికి మందులు మాని, అత్యవసరానికి మంచిదను....!
46. రుచులతో రోజూ తినడం మాని, పెళ్లి పండుగలకు మాత్రమే మంచిదను....!
47. జీవాలను తినడం మాని, సత్వాన్నిచ్చే సాత్విక భోజనం మంచిదను....!
48. "రుచులను తిననివాడు మనిషా..." అని మనడం మాని, మనిషి అదుపులో రుచి మంచిదను....!
49. రోగాలు లేవని రుచులను తినడం మాని, రోగాలు రాకుండా ఆహరం తినడం మంచిదను....!
50. రోగం వచ్చాక తినడం మాని, ఉపవాసం చెయ్యడం మంచిదను....!
51. ఆకలి లేనప్పుడు ఆహరం మాని, నీరు త్రాగడం మరీ మంచిదను....!
52. "ఛీ ! ఎనిమా " అనడం మాని, రూగానికి ఎనిమా మంచిన్డను....!
53. ప్రకృతి వికృతి చేయడం మాని, ప్రకృతి ఆరోగ్యాన్నికి మంచిదను....!
54. రోగం తగ్గే వరకే ప్రకృతి చేయడం మాని, జీవితకాలం ఆచరించడం మంసిడను....!
55. భాద్యతలు తీరే వరకు బ్రతికితే చాలు అనడం మాని, ౧౦౦ సంవత్సరాలు బ్రతకాలని కోరడం మంచిదను....!
56. అసంతృప్తిని మాని, తృప్తి ఆరోగ్యానికి మంచిదను....!
57. కోపం, ఈర్ష్య, చిరాకులు మాని, శాంతం ఆరోగ్యానికి మంచిదను....!
58. ఎదుటివారితో చేయించుకోవడం మాని, మన పని మనమే చేసుకోవడం మంచిదను....!
59. సాటివారిని ద్వీషించడం మాని, ప్రేమించడం ఆరోగ్యానికి మంచిన్దు....!
60. ప్రకృతి విధానాన్ని, వైద్యం అనడం మాని, జీవన విధానం అనడం మంచిదను....!