8, ఏప్రిల్ 2008, మంగళవారం

చెమట దాని కధ __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

చర్మం ఒక విసర్జకావయవము. చర్మాన్ని మూడవ కిడ్నీ అంటారు. ప్రతి రోజూ చర్మాన్ని రెండు లీటర్ల వ్యర్ధ పదార్ధాలను విసర్జిస్తుంది. మనలో వున్నా మాలిన్యాలు కొన్ని చర్మ రంద్రాల ద్వారా చెమట రూపంలో బయరకు పోతుంటాయి. చెమట పట్టనప్పుడు చర్మపు పోరలలోనే దాగి ఉంటాయి. చెమట పట్టినవారికి, ఆ చెమటతో కలిసి బయటకు రావడానికి వీలుంటుంది. ఉదాహరణకు మనం ఇల్లు నీటితో కడుగుతుంటాము. ఇంటిలోని మురికి, నీటితో కలిసి, కరిగి, నీటి ద్వారా బయటకు పోతుందిగదా ! అలాగే చర్మంలోని మురికి చెమట పట్టిన వారికే బాగా బయటకు వస్తుంది కానీ చెమట పట్టని వారికీ రాదు. అందుకనే మన పెద్దలు చెమట పట్టిన వాడికే తినే అర్హత వుంటుంది అనేవారు. ఇది మహాత్మా గాంధీగారు చెప్పిన మాట. వారు అన్నది అక్షరాలా నిజం అనిపిస్తుంది ఇక్కడ. చెమట పట్టాలంటే శరీరం వేడెక్కాలి. శరీరం వేడెక్కాలి అంటే పని చెయ్యాలి. అంటే పని చేసిన వాడికే శరీరం వేడెక్కుతుంది అని అర్ధం. శరీరం వేడెక్కినప్పుడు రక్త ప్రవాహం అన్ని భాగాలకు, కణాలకు స్పీడుగా జరుగుతుంది. పనిచేసే వారికి ఊపిరితిత్తులు ఎక్కువ గాలిని పీల్చుకుంటూ వుంటాయి. ఎక్కువ గాలి శరీరంలోకి వెళ్ళడం వలన వేడి ఎక్కడం ప్రారంభమవుతుంది. శరీరం లోని చెడు దహన మవడానికి, బయటకు విసర్జించబడడానికి ఎక్కువ ప్రాణ శక్తి కావాలి. ఖాళీగా కూర్చుంటే ప్రాణ శక్తి లోపలకు వెలితే ఎక్కువ చెమట వెంటనే పడుతుంది. పనిచేసే వారికి పట్టే చెమటలో చెడు - చర్మం ద్వారా బహిష్కరించబడుతూ వుంటుంది. కదల కుండా ఇంట్లో కూర్చున్నప్పుడు గాలి ఆడక పట్టే చెమటలో నీరు వుంటుంది గాని చెడు పదార్ధాలు వుండవు. అప్పుడు పట్టిన చెమటకు క్రొవ్వు కరగదు. ఆరోగ్యం రాదు. ఎక్కువ ప్రాణ శక్తి పీల్చుకోవడం వలన, పనిలో పట్టే చెమట ఆరోగ్యదయకము. అది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చెమట పట్టనివాడు మూడు పూటలా భోజనం చేస్తూవుంటే, ఆహారం జీర్ణమైన తరువాత ఆహరం ద్వారా వచ్చిన చెడు పదార్ధం మరి ఎక్కడ నుండి బహిష్కరింప బడుతుంది ? అదే చెమట పట్టేవాడికి అయితే చర్మం తో బాటు మిగితా విసర్జకావయవాలు కూడా చెడును విసర్జిస్తూ వుంటాయి. చెమట పట్టేవాడు బాగా నీరు తాగుతాడు. అందు వల్ల మూత్రం లో వెళ్లవలసిన చెడు వెళ్లి పోతుంది. చెమట పట్టేతట్లు పని చేయడం వలన ఆకలి బాగా అవుతుంది. ఆ ఆకలితో ఎక్కువ భోజనం తృప్తిగా తినగాలుగుతాడు. తినే ఆహారంలో పీచుపదార్ధం ఎక్కువగా ఉన్నట్లయితే విరోచానము ఎక్కువగా తయారవుతుంది. ఎక్కువ విరోచానము త్వరగా ప్రేగులలో కదిలి బయటకు విసర్జించ బడుతుంది. పని చేసే వాడు ఎక్కువ ఒక్సిజేన్ ను శ్వాసలో దీర్ఘంగా తీసుకోగలుగుతాడు. ఎప్పుడైతే ఎక్కువ ఒక్సిజేన్ ను ఊపిరితిత్తులలోనికి వెళ్ళిందో గాలి బయటకు వచ్చేటప్పుడు కార్బోన్ డై ఆక్సైడ్ ఎక్కువగా వచ్చేస్తుంది . అందువల్ల ఊపిరితిత్తుల ద్వారా పోవలసిన చెడు వాటి ద్వారా ఏ రోజుకారోజు పనిచేసే వారికి బయటకు పోతుంది. ఊపిరితిత్తులు, మూత్రము, చెమట, మలం, ఈ నాల్గింటి ద్వారా చెడు ఏ రోజు కారోజు బయటకు పోతే అయిదవది అయిన "లివరు" తీలిక అవుతుంది. పని వారు సక్రమంగా పనిచేస్తుంటే యజమానికి సుఖం గా వుంటుంది గదా! ఇక్కడా కూడా అంతే! ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతే వేరే వారికి భారం వుండదు కదా. అలాగే "లివరు" గారికి కూడా శ్రమ వుండదు. "లివరు" దేహం నుండి అన్ని విసర్జకావయవముల ద్వారా పంపవలసిన చెడును బయటకు పంపెతట్లు చూసుకుంటూ వుంటుంది.
అందుకని చెమట పట్టిన వాడికి యివన్నీ జరుగుతాయా? శరేరం వేడెక్కినప్పుడు ఆ వేడికి చెడు పదార్ధం త్వరగా కణాల నుంచి బహిష్కారానికి సిద్దమవుతుంది. ఏదైనా వేడికి విశాలమవుతుంది. చలికి బిగుసుకుంటుంది. మనం కూడా చూడండి. వేసవి కాలంలో విశాలంగా చాపుని పడు కుంటాము. చలికాలంలో ముడుచుకుని పడు కుంటాము. వేడి కి ఏ పదార్ధమైనా వ్యాకోచిస్తుంది. వ్యామం ద్వారా వేడెక్కినప్పుడు రక్తనాళాలు, కండరాలు, కణాలు వ్యాకోచించి ప్రసరణలు పెరుగుతాయి. అందువల్ల కణాలలోని చెడు త్వరగా బయటకు రావడానికి అవకాసము ఎక్కువ వుంటుంది. పని చేయకుండా భోజనం చేస్తే తయారయిన చెడు లోపలే వుండి రోగ కణాలను తయారు చేస్తుంది. చెమట ద్వారా పోవలసిన చెడు, చెమట లేనప్పుడు చర్మపు పోరలలోనే ఉండిపోతుంది. మనిషికి రోగాలు పుట్టడం అక్కడే మొదలవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి