31, జులై 2008, గురువారం

లంఖణం ని పరమ ఔషధం అని ఎందుకు అన్నారు ?

శరీరానికి ఏదైనా ఇబ్బంది (జబ్బు) వచ్చి నప్పుడు అది కూరినట్లుగా మనము తినకుండా, తిరగకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే శరీరంలో సుమారు ౭౫ శాతం శక్తి పొడుపు చీయబడుతుంది. ఆ పొదుపైన శక్తిని శరీరం రోగం నుంచి రక్షించుకునే పనిలో వాడుకుంటుంది. శరీరంలో ఎక్కడ జబ్బు ఉందో ఆ జబ్బు రావడానికి ఏ క్రిములు కారణమో ఆ క్రిములు ఎక్కడ ఎన్ని దాగి ఉన్నాయో శరీరానికి తెలుసు. ఒక్కొక్క సారి ఎన్ని రక్త పరీక్షలు చసిన జ్వారానికి కారణాలు తెలియవు. పరీక్షలు చేసే పరికరాలకు ఒక్కో సారి విషయం అందాకా పోవచ్చు గానీ ఈ శరీరానికి మాత్రం లోపల జరిగేదంతా తెలుసు. ఏ రకమైన ఇన్ఫెక్షన్ లోపల ఉన్నా దానిని త్రిప్పి కొట్టడానికి ఆ సూక్ష్మ జీవుల చర్యకు ప్రతి చర్యను చేపడుతుంది. మామూలు పరిస్థితిలో కంటే లంఖణం చేసినప్పుడు శక్తి పొదుపుకావడం వలన, వేరే పనులు నిర్వర్తించే బాధ్యత లేకపోవడం వలన, శరీరం మరింత ఉత్సాహంగా శక్తివంతంగా తన సైన్యాన్ని (యాంటీ బాడీస్) రోగ క్రిముల పైకి పంపుతుంది. శరీరంలో ప్రవేశించిన రోగ క్రిముల సంఖ్యను బట్టి, బలాన్ని బట్టి అప్పటికప్పుడు క్రొత్త గా యాంటీ బాడీస్ ని శరీరం తయారు చేసుకోగలుగుతుంది. ఈ యాంటీ బాడీస్ అనేవి చెడ్డ సూక్ష్మ జీవులను (బాక్టీరియా). హాని కలిగించే క్రిములను చంపుతాయే తప్ప, శరీరానికి పనికివచ్చే బ్యాక్టీరియాని మాత్రం చంపావు. అదే యాంటీ బయోటిక్ మందులు వాడితే చెడ్డ క్రిములతో పాటు శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా మరియు ఆరోగ్యంగా ఉండే కొన్ని కణాలు కూడా చనిపోతూ వుంటాయి. ఉదాహరణకు ఈ మధ్య ఇరాక్ కు, అమెరికాకు జరిగిన యుద్దంలో అమెరికా వారు ప్రయోగించిన మారణాయుధాల వల్ల ఇరాక్ సైనికులతో పాటు అనేక మంది సామాన్య పౌరులు కూడా మరణించడం జరిగిందీ. అదే లంఖణం చేస్తే మనలోని శక్తి అంతా రోగనిరోధక శక్తిని ప్రేరేపించే దాని ద్వారా ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ తో మన శరీరంలో చేసే యుద్దము ధర్మ యుద్దము లాంటిది. మన దేశ స్వరాజ్యం కొరకు గాంధీగారు పోరాడిన పోరాటం లాగా మన శరీరం లంఖణం లో పోరాడుతుంది. లంఖణం లో ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ మన శరీరంలో నిలువయింది అలాంటి క్రిములు, సూక్ష్మ జీవులు శరీరంలోకి మళ్ళీ ఎప్పుడైనా ప్రవేసించితే వెంటనే వాటిని చంపివేయడానికి సిద్దంగా ఉంటాయి. ఇంతకు ముందు వచ్చిన ఇబ్బంది లాంటిది మళ్ళీ ఇప్పట్లో రాకుండా శరీరం కాపలా కాస్తూ ఉంటుంది. లంఖణం లు చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ బయోటిక్ మందులు వాడితే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. మన శరీరము రోగాన్ని త్రిప్పి గొట్టడానికి నేను యాంటీ బాడీస్ ను తయారు చేయలేకపోతున్నానని మనల్ని హెచ్చరించినపుడు మనం యాంటీ బయోటిక్ మందులు వాడటం తప్పు కాదు. ముందు శరీరానికి కొంచెం కూడా అవకాశమివ్వకుండా డైరెక్టుగా మందు జోలికి వెళ్ళడమే పెద్ద పొరపాటు. ఈ ప్రపంచంలో ఈ మందునైనా ఔషదమే అని అంటారు. ఏ మందునీ పరమౌషధం అని ఇంతవరకూ పిలవలేదు. ఒక్క లంఖణం ని మాత్రమే పరమౌషధమని ఎందుకన్నారంటే ప్రతి ఔషధం ఒక పదార్దం నుండీ తయరైనదే. శరీరం తయారు చేసుకునే ఈ ఔషధం మాత్రమే పదార్ధం లేని, ఔషధం కాని ఔషధం. అందుకే దీనిని పరమౌషధం అన్నారు. లంఖణం చెయ్యని ప్రాణి అంటూ ఈ భూమి మీద ఉండదు. అవన్నీ నాచురల్ యాంటీ బయోటిక్ ఐన లంఖణం ని సందర్భానికి వాడుతూ ఉంటాయి. మనము కూడా ఇక నుండీ అవసరానికి లంఖణం చేస్తూ, సలక్షణంగా బ్రతుకుదాము.

9, జులై 2008, బుధవారం

పొట్టను మాడిస్తే జబ్బులేలా తగ్గుతాయి?

మన శరీరానికి ఏదన్నాసమస్య వచ్చినప్పుడు తనంతట తానుగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అలవాటు శరీరానికి పుట్టుకతో వచ్చింది. అదే మన అదృష్టం. శరీరము ఈ పని చెయ్యకపోతే మనం ఏనాడో చచ్చిపోయేవాళ్ళము . (వాస్తవానికి చచ్చేది మనము కాదు శరీరము). తనకు వచ్చిన ఇబ్బంది నుండి రక్షించుకోవడానికి శరీరానికి అదనంగా శక్తి కావలసి వస్తుంది. మన శరీరములోని శక్తిలో ఎక్కువ భాగం ఆహారాన్ని అరిగించడానికి, శ్రమ చేయడానికి ముఖ్యమ్గా ఖర్చు ఐపోతూ ఉంటుంది. సుమారుగా మనలో ఉన్నా శక్తిలో 75 శతం శక్తిని ఈ రెండు పనులు చెయ్యడానికి శరీరం ప్రతి రోజూ ఖర్చు చేయవలసి ఉంటుంది. శరీరానికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బంది నుండి రక్షించుకోవడానికి తనలో రోజూ ఖర్చు అయ్యే ఈ 75 శతం శక్తిని పొడుపు చేసుకుని, రక్షణ కార్యక్రమానికి ఉపయోగించే పన్నాగం పన్నుతుంది. రోజంతా మనిషి అలవాటుగా తింటూ ఉంటే, అలాగే తిరుగుతూ ఉంటే మనలో శక్తి పొడుపు కాదు కాబట్టి, తినకుండా తిరగకుండా చేయడానికి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. నూరు తియ్యగా లాలాజలం ఊరుతూ ఉంటే తినాలని ఉంటుంది కాబట్టి నాలుకను పాచితో నింపి, దాన్ని చేదుగా చేసి, లాలాజలం ఊరకుండా చేసి మనకు ఆహరం మీద వాంఛ లేకుండా చేసి, పొట్టలో ఆహరం పడకుండా మొదటి జాగ్రత్త చర్య తీసుకుంటుంది. మనం హుషారుగా ఉంటే అటూ ఇటూ తిరుగుతూ పనిచేస్తాము కాబట్టి, తిరగకుండా ఉంచడం కోసం ఒళ్ళు నొప్పులుగా, పులపరంగా, నీరసంగా చేసి పడుకుంటే బాగుంటుందని మనకనిపించేతట్లుగా చేసి రెండవ జాగ్రత్త చర్య తీసుకుంటుంది. ఇలా రెండు రకాలుగా శరీరం శక్తిని పొదుపు చేసే ప్రయత్నం చేసి, రక్షణ కార్యాన్ని నిర్వహించడానికి ఆ శక్తి వినియోగిస్తూ ఉంటుంది. ఆ రక్షణ పని పూర్తయ్యే వరకూ మనకు తినాలని ఉండదు, తిరగాలని ఉండదు. ఇది శరీర ధర్మం. మీకు పుట్టాక ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా వచ్చాయా? రాలేదని ఎవరూ అబద్దం చెప్పలేరు. మనం తింటే తినవచ్చు, తిరిగితే తిరగవచ్చు. ఒక్క సారి ఆలోచించండి! శరీరం ఎవరిని బాగుచేయడానికి ఈ కష్టమంతా పడుతోంది. మన సుఖం గురించే కదా దాని తాపత్రయమంతా. అమెరికా నుండి బుష్ ను అడిగి కాస్త శక్తి అప్పుగా తెచ్చి ఇవ్వమని మనల్ని ఇబ్బంది పెట్టడం లేదే! మనల్ని నూతులలో, గోతుల్లో దూకమనడం లేదే! రక్షణ కార్యక్రమం చేపట్టడానికి కావలసిన శక్తి అంతా నాలో ఉన్నది నాకు సరిపోతుంది, నీవు ఆ శక్తిని వృధా చేయకుండా ఉంటే అదే నా అదృష్టంగా భావిస్తానంటుంది. అది అడిగింది ఒక చిన్న కోరికే గదా! ఇన్నాళ్ళూ నీవు శుభ్రంగా తినేటట్లు, తిరిగేతట్లు చేశాను, ఐనా ఈనాడు ఒక సారి కూడా థాంక్స్ చెప్పిన పాపాన పోలేదు. ఐనా పట్టించుకోకుండా నా డ్యూటీని నేను చీసుకుంటూ పోతున్నాను. కానీ, ఈ రోజు నాకు బాగోలేదు కాస్త రెస్టు ఇవ్వమని అడిగినా నా మాట వినవా! అని శరీరం సందర్భమొచ్చినప్పుడు ప్రదీయపడుతూ ఉంటుంది. ప్రతి రోజూ పట్టించుకోక పోయినా కనీసం ఆపద వచ్చినప్పుడైనా ఆదుకుంటే మన జీవనయానం, సుఖంగా సగేతట్లు చేస్తుంది గదా ! శరీరం గోడు వినిపించుకోవడానికి చదువు సంధ్యలు, తెలివి తేటలు, వైద్య శాస్త్రాలు అవసరం లేదు. అసలు మనకు ఆ గోడు వినిపించక పోవడానికి ఇవే అడ్డుగోడలు. పొట్టను మాడిస్తే జబ్బులేలా తగ్గుతాయి? అవన్నీ మూఢ నమ్మకాలు, సైంటిఫిక్ విషయాలు కాదు అని కొందరు వైద్యులు తిడుతూ ఉంటారు. పొలాన్ని దున్ని ఎండ గట్టినప్పుడే గట్టినప్పుడే తెగుళ్ళు తగ్గుతాయి. విద్యా శాస్త్రాలు, సైన్సు అనే మాట పుట్టక ముందే అసలు మనిషి పుట్టక ముందే పొట్టను మాడ పెడితే జబ్బులు తగ్గుతాయనే సైన్సు పుట్టింది. అదే ప్రకృతి సైన్సు. ఈ సైన్సు ను ఎవ్వరూ మార్చడానికి లేదు. జీవులున్నంత వరకూ ఈ సైన్సు వాటిని రక్షించేది కూడా. చివరకు మనకు కూడా అదే గతి. నమ్మిన వాడు ఆ జంతువుల్లాగా బాగుపడతాడు. నమ్మని వాడు మనిషిలా బాధపడతాడు.

7, జులై 2008, సోమవారం

పిక్కల నెప్పులు పోవాలంటే ... మంతెన సత్యనారాయణ రాజు

బలహీనత వల్ల ఎక్కువగా పిక్కల నొప్పులు వస్తూ వుంటాయి. ఆహరం మంచిగా తినకుండా ఎక్కువ పని చేసుకునే వారికి ఆ నీరసంలో ముందు పిక్కలు లాగుతాయి. ఎక్కువగా నడిచే వారికి ఆ కండరాలు శ్రమను తట్టుకోలేక వస్తూ వుంటాయి. శరీరంలో ఉప్పు, మెగ్నీషియం లాంటి లవణాలు తక్కువగా ఉన్నా పిక్కలు పట్టేస్తూ వుంటాయి. ఉప్పును పూర్తిగా మానిన వారికి క్రొత్తలో వారం, పది రోజులు వచ్చి ఆ తరువాత తగ్గుతుంటాయి. దీనికి పరిష్కారం ఏమిటంటే మనం చేసే పనికి శరీరం తట్టుకునేతట్లు మంచి ఆహరం తింటే సరిపోతుంది.

***

చిట్కాలు:

౧. తెల్లటి అన్నం మాని ముడి బియ్యం అన్నాన్ని వండుకొని రెండు పూటలా సరిపడా తింటే ౧౫, ౨౦ రోజులలో తగ్గుతాయి. ఎక్కువ పని వలన వచ్చే పిక్కల నొప్పులు ముడి బియ్యం అన్నానికి తగ్గిపోతాయి.

౨. ప్రతి రోజూ మధ్యాహ్నం భోజనంలో ఆకు కూరలను ముఖ్యమ్గా పాల కూర లాంటి వాటిని రోజూ వండుకుని బాగా తింటే లవణాల లోపం తగ్గుతుంది.

౩) పిక్కలు పట్టేస్తూ వుంటే లేదా ప్రయాణాలలో నడక ఎక్కువగా నడిచినందుకు నొప్పిగా వుంటే కొద్దిగా కొబ్బరి నూనె పిక్కలకు రాసి మర్దనా చేసి వేడి నీటి కాపడం ౧౦ నిమిషాలు పెట్టుకుంటే ఆ బడలిక అంతా పోతుంది.

4, జులై 2008, శుక్రవారం

లంఖణం ( ఉపవాసం) ని కనిపెట్టింది ఎవరు.... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు..,.,

దాహం వేస్తే నీరు త్రాగాలని మనకు తెలుస్తున్నది. శరీరానికి నీరు కావలసి వచ్చినప్పుడు అది అడుగుతోంది. మనము త్రాగుతున్నాము. ఈ విషయంలో అన్ని జంతువులు ఇలానే ప్రవర్తిస్తాయి. దాహానికి నీరు త్రాగాలనే విషయం తెలియడానికి ఇంకొకరు మనకి చెప్పనవసరం లేదు. మనం ఇంకొకరిని అడగవలసిన పని లేదు. దాని కొరకు చదువుకోవలసిన పని లేదు. వైద్యుల సలహా అక్కర్లేదు. ఆకలి వేస్తే శరీరం నాకు ఆహారము కావాలని మనల్ని అడుగుతుంది. అప్పుడు మనం తింటే దాని అవసరం తీరి ఊరుకుంటుంది. ఆకలి వేస్తే ప్రతి జంతువు శరీరానికి ఆహారాన్ని అందించాలని తెలుసుకుని అందిస్తున్నాయి. అలాగే శరీరము అలసిపోతే, నాకు అలసటగా ఉందని తెలియ చేస్తుంది. అప్పుడు మనం విశ్రాంతి తీసుకుని దానికి సహకరిస్తున్నాము. జంతువులన్నీ అలసిపోతే విశ్రాంతి తీసుకోవాలని తెలుసుకుని అలానే తీసుకుంటున్నాయి. ఈ విషయంలో కూడా వాటికీ ఎవరూ బోధించవలసిన పనిలేదు. పైన చెప్పిన మూడు విషయాలలో జంతువులు, మనము కూడా ఒకే విధముగా ప్రవర్తిస్తున్నాము. ఏ శరీరమైనా ఈ ధర్మాలు ఒక్కటేనని మనకు తెలుస్తున్నది. ఇప్పుడు నాలుగో విషయం ఆలోచిద్దాము. శరీరానికేప్పుడైనా బాగోకపోయినా, ఆకలి లేకపోయినా, పొట్ట మందంగా ఉన్నా, జ్వరంలా వచ్చినా అప్పుడు శరీరం, నాకు బాగోలేదు, ఈ రోజుకి నీవు కాస్త తినడం మాని, తిరగకుండా పడుకుంటే బాగుంటుందని కోరుకుంటుంది. అప్పుడు మనకు వెంటనే శరీరం చెప్పినట్లు విందామనిపిస్తుంది. మనకు బుడ్డి, జ్ఞానమున్నది కదా! కాసేపటికి వేరే విధముగా ఆలోచనలు మారతాయి. అప్పుడు మనం ఏమి చేస్తాము. మన అమ్మకో, నాన్నకో లేదా ఇంట్లో పెద్దవారికో మన పరిస్థితి చెప్పుకుంటాము. ఇప్పటికే భోజనం లేటు అయ్యింది, తినకపోతే నీరసం వస్తుంది, ఈ పూటకు తిను, సాయం కాలం డాక్టరు దగ్గరకు పోదాములే అని సలహా ఇస్తారు. వండింది వేస్తూ అవుతుంది అనో, తినక పోతే నీరసం వస్తుందనో, ప్రక్కవారు తినమన్నారనో మనకు ఇష్టం లేకపోయినా తింటాము. మనం ఇక్కడ శరీరం కోరినట్లుగా కాక దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి చివరకు డాక్టరు దగ్గరకు పోయి శరీరాన్ని అప్పగిస్తాము. ఈ విషయంలో 84 లక్షల జీవరాసులు ఏమి చేస్తాయో చూద్దాము.

***

శరీరం నాకు బాగోలేదు, నీవు తినవద్దు, తిరగ వద్దు అని కోరింది కాబట్టి వెంటనే ఆ క్షణం నుండీ తినడాన్ని పూర్తిగా ఆపేస్తాయితినవలసిన పనిలేకపోతే ఇంకా తిరగవలసిన పని వాటికేముంటుంది. కాబట్టి విశ్రాంతి కూడా శరీరం కోరినట్లు ఇచ్చి హాయిగా పడుకుంటాయి. తిండి మనడం, విశ్రాన్తినివ్వడం అనే రెండు పనులు చెయ్యడానికి వల్ల అమ్మ, నాన్నలనో, ప్రక్కనుండే స్నీహితులతోనో ముచ్చటించవలసిన పనిలేదు. ఇక్కడ ఇవి శరీర ధర్మాన్ని గౌరవించి వట్టిగా పాడుకుంటాయి. "ధర్మో రక్షతి రక్షితః" అన్నట్లు ఆ ధర్మమే వాటిని కాపాడుచున్నది. ఇలా శరీరం వద్దన్నానని రోజుల పాటు విశ్రాంతి నిచ్చి, మరలా నాకు ఆహరం కావాలని శరీరం కోరినప్పుడు తినడం ప్రారంభిస్తాయి. ఇలా శరీరం వద్దన్నప్పుడు ఆహారాన్ని తినడం మాని, విశ్రాంతి నివ్వడం అనేదాన్ని ఆనాటి నుండీ ఈనాటి వరకూ ఆచరించి చూపుతూ వాటి ఆరోగ్యాన్ని అవే కాపాడు కుంటున్నాయి. ఈ ధర్మాన్ని అవి వాటి పిల్లలకు, మనుమలకు అలా బోధించవలసిన పని లేకుండా, తరతరాలుగా ప్రతి జీవికి పుట్టుకతో ఈ జ్ఞానం తెలుస్తూనే ఉంటున్నది. ఈ జ్ఞానం జంతువుల వలె మనిషికి కూడా అనాదిగా వస్తూ ఉన్నది. మనిషి కూడా నియమం తప్పకుండా ఈ శరీర ధర్మాన్ని గౌరవించడం జరిగిందీ. పేరు పెట్టడం వరకే మనిషి హస్తం తప్ప లంఖణం ని మనిషి కనిపెట్టలేదు. మనిషి పుట్టక ముందే లంఖణం పుట్టింది. అది ఈ భూమి పై జీవులు శరీరాన్ని ధరించినప్పటి నుండీ ఉన్నా ధర్మం. దాహానికి నీరు, ఆకలికి ఆహరం, అలసటకు విశ్రాంతి ఎలాంటి ధర్మాలో రోగానికి లంఖణం ఉండడం అలాంటి ధర్మమే. ఈ లంఖణం అనేది ఒక మతానికి గాని, ఒక కులానికి గానీ, ఒక దేశానికి గానీ, ఒక జాతికి గానీ, ఒక ప్రకృతి వైద్యానికే గానీ సంబంధించినది కాదు. శరీరమున్న ప్రతి జీవికి సంబంధించిన విషయం. ఇదేదీ మూదాచారమూ కాదు. చదువుకొని, వైద్య శాస్త్రం తెలియని మన పెద్దలు కనిపెట్టింది కాదు. అది శరీరానికి పుట్టుకతో వచ్చే సహజ ధర్మమూ. ఇన్ని కూతల రకాల శరీర నిర్మాణ సారధి ఎవరో, ఆయన ఈ శరీరాలకు ఆరోగ్య నిమిత్తం ఇచ్చిన వరం. దానిని జంతువుల వలె మనిషి కూడా గౌరవిస్తే ఆరోగ్యం వరం. లేదా రోగాల పరం.

3, జులై 2008, గురువారం

మనం చేసే పెద్ద పొరపాటు ___ మంతెన సత్యనారాయణ రాజు

వివేకముతో ఆలోచిస్తే మనం వేరు. మన శరీరం వేరు. మనం జన్మ తీసుకున్తున్నమంటే (పుడుతున్నామంటే) శరీరాన్ని ధరించి భూమి పైకి వస్తున్నాం. చనిపోతున్నమంటే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. విశేషమేమిటంటే పుట్టుక నుండి చావు వరకు మనము, మన శరీరము ఒకటిగానే జీవిస్తున్నాము. శరీరము లేకుండా జీవితమనేదే లేదు. చావుపుట్టుకలు మన చేతిలో లేవు గాని ఆ రెండింటి మధ్యన వుండే జీవితం మన చేతిలోనే వుందిఅలాంటి జీవితం ఆరోగ్యమ్గా, సుఖంగా సాగినా లేదా అనారోగ్యంతో, బాధలతో సాగినా దానికి మనమే బాధ్యులం తప్ప శరీరానికి సంబంధం లేదు. ఈ శరీరానికి ఏ ఇబ్బందులు వచ్చినా ఆ తప్పు మనదే. శరీరం మనం ప్రయాణిస్తున్న వాహనం కాబట్టి మనం చెప్పినట్లు అది నడవాలి. అలాగే మనం దాన్ని ఇబ్బంది లీకుండా నడిపించుకోవాలంటే అది చెప్పినట్లు కూడా మనం వింటూ వుండాలి. అపుడే జీవితమనే ప్రయాణం గమ్యం చేరే వరకు సుఖంగా సాగుతుంది. కానీ మనం అందరం చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే శరీరం చెప్పినట్లు మనం వినడం లేదు. దాని అవసరాల్ని మనం పట్టించుకోవడం లేదు. అందు చేతనే రకరకాల రోగాలతో ఇబ్బందులు పడుతున్నాము. మన ఇష్టా ఇష్టాలు దానిమీద రుద్దుతున్నాము తప్ప దానిగోడు వినిపించుకోవడం లేదు. ప్రతి జీవి శరీరము ఒక ఆటోమాటిక్ యంత్రము లాంటిది. శరీరానికి తనంతట తనే బాగు చేసుకునే శక్తి పుట్టుకతోనే వచ్చింది. ఆ శక్తి పనిచెయ్యాలంటే శరీరము చెప్పినట్లుగా మనం విని దానికి అనుకూలంగా మనం ప్రవర్తించాలి. ఈ శ్రుష్టిలో 84 లక్షల జీవరాసులుంటే, అవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాటి శరీరాన్ని ఏ డాక్టరుకి అప్పగిస్తున్నాయి? ఏ రకాల రక్తపరీక్షలు, ఎక్స్ రే లు తీయించు కుంటున్నాయి? వాటి ఆరోగ్య రహస్యం ఏమిటి? నూటికి నూరు శాతం అవి ఆరోగ్యాన్ని పొందడానికి అవి ఆచరించే ఆరోగ్య రహస్యం ఒక్కటే. అదే శరీరం చెప్పినట్లు వినడమే.
***
మనిషి కూడా కొన్ని వేళ సంవత్సరాలు ఇదే ధర్మాన్ని ఆచరించి డాక్టరు లేకుండా రోగం రాకుండా జీవించగాలిగాడు.
***
ఇంతమంది వైద్యులు, ఇన్ని రకాల వైద్య విధానాలు ఉంచుకుని కూడా పూర్తి ఆరోగ్యాన్ని ఎందుకు పొందలేకపోతున్నాడు? మనకి వైద్యుడికి అవకాసమిద్దామని తెలుస్తోంది కానీ వైద్యుడి కంటే ముందు శరీరానికి అవకాసమిద్దామని తెలియడం లేదు. అసలు శరీరానికి జబ్బులు తగ్గించుకునే గుణం ఉన్నట్లే చాలా మందికి తెలియదు. మనం తాయారు చేసిన వాహనానికి ఏదైనా రిపేరు వస్తే తనంతట తానూ బాగు చేసుకోలేదు. దానిని తయారు చేసినది మనిషే కాబట్టి చివరికి మనిషే దానిని రిపేరు చేయవలసి వస్తున్నది. మరి మన శరీరాన్ని మనం తయారు చేసామా? మనం తయారు చేసినది కాదు కాబట్టే మన ఊహకు అందని, మన తెలివితేటలకు సాధ్యం కాని అద్భుతమైన యంత్రాంగం ఈ శరీరంలో ఉంది. ఆటోమాటిక్ గా నడిచే కార్లు ఇంతవరకు మనిషి కనిపెట్టలేక పోయాడు కానీ మనం ప్రయాణించే ఈ శరీరమనే కారు మాత్రం ఆటోమాటిక్ గా నడుస్తుంది. అలానే ఆటోమాటిక్ గా రిపేరు చేసికొనే శక్తి కూడా దానికి వుంది. ఆ శక్తిని మనం చెడగొట్టకుండా ఉంటే చాలు, దాని పని దానికి వుంది. ఆ శక్తిని మనం చెడగొట్టకుండా ఉంటే చాలు, దాని పని అదే చేసుకొని పోతుంది. మనకు తెలియకుండానే మనం శరీరానికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ వుంటాము. దానికి నెలలు కావలసి వచ్చినప్పుడు నీళ్లు త్రాగం. మనకి ఇష్టమైనప్పుడు త్రాగుతాం. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాం. నాకిప్పుడు రెస్ట్ తీసుకునే టైము అయిపోయింది నేనిక అరిగించలేను అని అది చెప్తున్నా వినకుండా రాత్రి పొద్దుపోయి అన్నం పెడతాము. మనం తిన్నదంతా అరిగించి మిగిలిన వేస్ట్ విసర్జించడానికి రెడీ గా పెట్టుకొని ఉన్నా దానిని బయటకు పంపకుండా ఆపేస్తాము. ఏదైనా రోగ పదార్ధము లోపలికి ప్రవేశించినప్పుడు దానిని బయటకు పంపే ప్రయత్నంలో జ్వరం రూపంలో నోరు చెడు రూపంలో మనకి అది సూచనలిచ్చినా పట్టించుకోకుండా, దానికి బాగు చేసుకునే అవకాసం ఇవ్వకుండా డాక్టరు దగ్గరకు వెంటనే పరిగెడతాము. డాక్టరు ఏదో మందు వేస్తాడు. దానితో తను చెయ్యాల్సిన పని ఆపేస్తుంది. ఇలా మందులు వేస్తూ వుండటం వల్ల శరీరానికి వున్నా రోగాన్ని నిరోధించుకునే శక్తి క్రమంగా తగ్గిపోతుంది. జబ్బులను తగ్గించే అవకాసము ముందు మన శరీరనికిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరమే ఒక గొప్ప డాక్టరు అని గ్రహించాలి. మన శరీరము తగ్గించలేనపుడు మందు వేసుకోవడం తప్పు కాదు. ముందు శరీరం కోరినట్లుగా మనం మారడం, దానికి అనుకూలంగా బ్రతకడం అలవాటు చేసుకుందాం.

1, జులై 2008, మంగళవారం

ఫుడ్ ఎలేర్జీ తగ్గాలంటే ?... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

మంచికీ, చెడుకీ మధ్యా ఘర్షనే ఎలేర్జీ అంటే. భార్యా భర్తలిద్దరూ మంచివారైతే వారిద్దరి మధ్యా ఈ గొడవలు రాకుండా జీవితం సాఫీ గా నడుస్తుంది. అదీ మాదిరిగా అటు ఆహారము, ఇటు శరీరము రెండూ (ఆహారము ప్రకృతి సిద్దముగా ఉంది, శరీరము కూడా సహజంగా ఉంటే) ఒకే విధంగా ప్రకృతి సహజముగా ఉంటే వాటి మధ్య ఏ గొడవా (ఎలర్జీ) రాదు. భార్యాభర్తలిద్దరూ చేద్దవారైనా వారి మధ్యా ఏ గొడవలూ ఉండవు. వాళ్ళిద్దరూ బాగా కలిసిపోతారు. అలాగే, అటు ఆహారము చెడ్డదిగాఉండి ఇటు శరీరము కూడా చేదిపూయి అసహజంగా ఉంటే ఈ రెండూ కలిసిపోయి ఏ ఎలర్జీ రాదు. ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారు అయినప్పుడీ గొడవలు మొదలయ్యేది. ఈ మధ్య జనాలకు, తేనెకు, కొబ్బరికి, నిమ్మకాయలకు ఇతర పులుపులకు, ఎండకు, మంచుకు, దుమ్ముకు, కూరగాయలకు, గింజలకు (ఇవన్నీ ప్రకృతి సిద్దమైనవి) మొదలగు వాటితో ఎలేర్జీ వస్తున్నది. ఇలాంటి వాటికి ఎలర్జీ వస్తున్నదంటే శరీరంలో అసహజమైనవి నిల్వయుండి, ఎలర్జీని కలిగించే పదార్ధాలు పుట్టి, లోపల అసహజంగా మారి పైన చెప్పినలాంటివి తగిలే సరికి దురదలు, దద్దుర్లు, వాపులు, గొంతులో తీదాలు మొదలగునవి వచ్చేస్తాయి. అవి పడటం లేదు కాబట్టి, వాటిని పూర్తిగా మానేస్తే పోతుంది గదా అని వాటిని మానివేస్తూ ఉంటారు. లోపల అసహజత పెరుగుతూ నిదానంగా ఇతర ప్రకృతి సిద్దమైన ఆహారాలకు కూడా ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది. మాంసం పడటం లేదని కానీ, ఆవకాయ పడటంలేదని, చాక్లెట్లు, బిస్కెట్లు పడటంలేదని డాక్టరు దగ్గరకు వెళ్లి వీటికి నాకు ఎలర్జీ వస్తుందనే వారు ఎవరన్నా ఉన్నారా? ఇలాంటివి శరీరానికి బాగా పడుతున్నాయి. మన శరీరం చెడిపోయి ఉండేసరికి చెడులో చెడు పడే సరికి కలిసి పోతున్నాయి. రా, రా ! మనమిద్దరం ఫ్రెండ్స్ అంటూ కలుస్తాయి. ఎలర్జీ పూవాలంటే వేటినీ మనడం పరిష్కారం కాదు, మనలో ఎలర్జీ లకి మూలాన్ని కదిగివేసి శరీరాన్ని సహజంగా మార్చుకుంటే అన్నీ మళ్ళీ పడతాయి.
చిట్కాలు:
1) మంచినీరు తక్కువగా త్రాగే వారికి ఎకువగా ఎలర్జీలు వస్తాయి. కాబట్టి 5 లీటర్లు నీరు ప్రతిరోజూ అలవాటు చేసుకోవాలి.
2) ముందు 2,3 రోజుల పాటు తేనె నీళ్ళలో ఉపవాసం (నిమ్మపడక పోతే మానివేసి వట్టి తేనె + నీళ్లు త్రాగవచ్చు) చేస్తే మంచిది. ఉపవాసంలో అవసరమైతే కొబ్బరినీళ్లు రెండవ, మూడవ రోజుగానీ త్రాగవచ్చు.
3) నాల్గవ రోజు నుండీ ఏ పళ్ళు పడితే, ఏ రసాలు పడితే వాటితోనే రోజుకి 5,6సార్లుగా అందులోనే తేనె వీసుకుని త్రాగుతూ 3,4 రోజులుంటే మంచిది. చెరుకురసం పడితే త్రాగవచ్చు.
4) ఆ తరువాత రోజు నుండే ఉదయం పూట 8 గంటలకు రసాలు, 9,10 గంటలకు పండ్లు తిని మద్యాహ్నం భోజనంలో పుల్కాలతో చప్పటి కూర (ఏది పడితే అది కూర) తో తిని, సయంకాలం 5,6 పండ్లు తిని ఆపాలి. ఇలా 5,6 రోజులు చీస్తే శరీరం లోపల శుభ్రం అయి, రక్తం మారి కొంత సహజత్వము వస్తుంది.
5) ఇలా 10, 12 రోజులు గడిచాక మీకు పడని వాటిని మెల్లగా ఒక్కటీ అలవాటు చేసుకుంటే అవే సరిపడుతుంటాయి. లేదా ఇంకో 10 రోజుల తారవాతైనా అలవాటు చేసుకోండి. ఎవరికన్నా ఇంకా తగ్గకపోతే ఆహారము, ఉప్పు నూనెలు సాంతం మాని తింటే అప్పుడు పూర్తిగా తగ్గి పోతాయి.

ఆకలి మందం తాగ్గాలంటే...?

చాలామంది టైం అయ్యిందని తింటారేతప్ప ఆకలి తెలియదు. ఆకలి మందం అనేది ముఖ్యంగా పిల్లలలో ఉంటుంది. దీనికి ముఖ్య కారణం మలబద్దకం. ఎవరిలో మలబద్దకం ఉన్నా వారికి ముందు ఆకలి తగ్గిపోతుంది. విరేచనం సాఫీగా కానందుకు మలం ప్రేగంతా మలంతో నిండిపోయి ఉంటుంది. అది వెళ్ళాక పోయినా పైనుండి తినేది ఆపరు. బయటకు వెళ్ళే దాన్ని బట్టి లోపలకు వచ్చేది ఆదారపడి ఉంటుంది. ప్రేగుల వాతావరణం చెడిపోయి ఆకలి మందగిస్తుంది. ఆకలి లేకపోయినా తినకపోతే నీరసం అని తినేసరికి ఇంకా సమస్య మరీ ముదిరిపోతుంది.
చిట్కాలు:
1) 5,6 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం పూట ఎనిమా చేసి ప్రేగులను శుభ్రపరచుకోవడం మంచిది.
2) ఉదయం పాలు, జావలు, టిఫిన్లు మొలక గింజలు మొదలగునవి పూర్తిగా మనాలి, నీళ్లు త్రాగడం పూర్తయ్యాక 8, 9 గంటలకు టిఫిన్ కింద బొప్పాయి, సపోటా, ఖర్జూరం పండు, దానిమ్మ లాంటి పండ్లను సరిపడా తినవచ్చు.
3) మద్యాహ్నం తేలికగా అరిగేతట్లు కూరలను చప్పగా చేసుకును (ఆకుకూరలు, దుంపలు, కండి, పెసరపప్పు) పులకాలతో ఎక్కువ కూర పెట్టుకుని తినాలి.
4) రాత్రికి భోజనంగా 5,6, గంటలకే పండ్లు తిని ఆపాలి. పొట్టను రాత్రికి మాడ పెట్టడం వల్ల ఆకలి పుడుతుంది. సమస్య తగ్గాక రోజూ విరేచనం సాఫీగా అయ్యేటట్లుగా చూసుకుంటే ఆకలి మందం కలగదు.

నరాల కొంకర్లు తగ్గాలంటే.... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

నరాలు కొంకర్లు తగ్గాలంటే :- ఒక్కొక్క సారి చేతి వ్రేళ్ళు గాని, కళ్ళ వ్రేళ్ళు గానీ బిగుసుకొని పోయి క్రిందకు వంగిపోయినట్లుగా అవుతాయి. (వ్రేళ్ళ మీద వ్రేళ్ళు ఎక్కుతుంటాయి.) అలా కాసేపు ఆగిపోయి విపరీతమైన భాద కలుగుతుంది. అలా తరుచుగా ఎవరికన్నా వస్తున్నాయంటే వారిలో కాల్షియం బాగా తగ్గినట్లు గ్రహించాలి.
చిట్కాలు: 1) దొరికినప్పుడల్లా లేదా వారికి 2,3 సార్లు తమలపాకులను (1,2 ఆకులూ) తినండి. తంబూలంగా వద్దు, వట్టి ఆకులను నమలవచ్చు. లేదా వాటికి తేనె పూసుకుని తింటే నూరు పొక్కకుండా ఉంటుంది. తమల పాకుల్లో కాల్షియం బాగా ఉంటుంది.
2) తెల్ల నువ్వులను రోజుకు 3,4స్పూన్లు తింటే మంచిది. విడిగా తినలేనప్పుడు వాటిని తేనెతో కానీ ఖర్జూరంతో కానీ దంచి ఉండగా చేసి ఒక ఉండ తింటే త్వరగా తగ్గిపోతుంది.
3) రాగులు మొలక గట్టుకొని కానీ రాగులపిందిని జావగా చేసుకొని కానీ త్రాగితీ వీటిలో ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల పైన చెప్పిన ఇబ్బంది రాకుండా నివారించుకోవచ్చు. కాల్షియం మాత్రలు మాని పైన చెప్పిన సూచనలు పాటించండి.

అర్ధ రూపాయి ....

భిక్షగాడు : బాబూ అర్ధరూపాయి ధర్మం చేయండి..

ఎదుటి వ్యక్తి: అర్ధ రూపాయికి ఏమొస్తుంది... కొంచెం ఎక్కువ అడుక్కోవచ్చుగా....

భిక్షగాడు: నేను మనుషుల్ని బట్టి అడుగుతాను బాబయ్య....

ఎందుకు ?...

'మీ అబ్బాయి ఏడుస్తున్నప్పుడు నువ్వెందుకు లాలిపాట పాడి సముదాయించవు ?' అడిగింది రాణిని మిత్రురాలు.

'నేను జోల పాట పాడినప్పుడల్లా పక్కింటివాళ్ళు వచ్చి మాకు పిల్లాడి ఏడుపే బావుంది. అంటున్నారు' అంది రాణి విచారంగా.
---------------