6, ఆగస్టు 2008, బుధవారం

చుండ్రు తగ్గాలంటే...

1. చుండ్రు తగ్గాలంటే: - మన పెద్దలకు చుండ్రు అనే సమస్య తెలియదు. ఈ రోజుల్లో చుండ్రు అంటే తెలియని వారు ఉండరు. సహజంగా మన చర్మం వాతావరణం ని రక్షించుకోవడానికి ఒక రకమైన జిగురులాగా ఉండే క్రొవ్వు పదార్ధాన్ని వదులుతూ ఉంటుంది. దీనివలన చర్మం మెత్తగా ఉంచబడుతుంది. తలలో ఈ జిగురు గాలి సరిగా తగలక పేడుగా కట్టి పెచ్చులు పెచ్చులుగా ఊడుతూఉంటుంది. స్నానం రోజు శరీరం వరకే చేసి తల మనది కాదన్నట్లుగా కొందరు వదిలేస్తారు. దాని వలన తల శుభ్రం కాక చుండ్రు వస్తుంది. షాంపూలు తరచుగా వాడేవారికి కూడా అందులో కెమికల్స్ చర్మం ఫై పొరను పాడు చేసి ఎక్కువ పొట్టు రాలేతట్లు చేస్తాయి. షాంపూ పెట్టిన రోజున బాగానే వుండవచ్చు కాని తరువాత రోజునుండి వాటి నష్టం బయటపడుతుంది. చుండ్రును పోగొట్టే షాంపూ అని మనం మోసపోతున్నాము. కేవలం తల స్నానం చేయనందువల్ల వచ్చే సమస్యను పరిష్కరించుకోవటానికి ఎంత డబ్బు వృధా చేస్తున్నారు, దీని కోసం ఈ మందులు వాడవద్దు.
***
చిట్కాలు:
1. ప్రతిరోజు చన్నీళ్ళ తల స్నానం చేయండి, వేడి నీళ్లు తలకు పోయకూడదు. నీళ్లు మరీ చల్లగా వుంటే కొద్దిగా వేడి నీరు కలిపి (బావిలో నీటి లాగా) ఆ నీళ్లు పోసుకోండి.
***
2. వారానికి, పడి రోజుల కొకసారి కుంకుడు కాయ రసంతో తలన్తుకోండి. చుండ్రు మరీ ఎక్కువగా వున్నప్పుడు పొడి తలకు ఆ రసం బాగా పట్టించి 5, 10 నిమిషములు అలా వుంచి అప్పుడు చన్నీటి స్నానం చేయండి. ప్రతి రోజు ఇలా కుంకుడు రసంతో ఏడు, ఎనిమిది రోజులు చేయవచ్చు (సమస్య ఎక్కువగా వున్నవారే ప్రతిరోజూ కుంకుడు రసం వాడండి).
***
3. తల ఆరిన తరువాత కొబ్బరి నూనె రాసుకోండి. నూనె రాస్తే చుండ్రు ఎక్కువ అవుతుంది అనుకుంటారు. రోజూ తల స్నానం చేసేవారికి ఏమీ కాదు. చలి కాలంలో చర్మం తెల్లగా పొట్టు లేస్తున్నప్పుడు మనం కొబ్బరి నూనె రాస్తే అది కరుచుకుపోయి సమస్య తగ్గినట్లే. చుండ్రుకు కూడా నూనె రాయవచ్చు. మన పెద్దలు నూనె బాగా రాసుకున్నందుకే చుండ్రు రాలేదు.
***
4. తల నూనె జిడ్డుగా వుంటే ప్రతి రోజూ (ఒక చేకా లేదా కాయ) నిమ్మరసాన్ని తలకు (తల పై చర్మానికి) రాసుకొని తల స్నానం చేస్తే జిడ్డు పోతుంది. తలలో జిగురు గ్రంధులు ఊరించే ఎక్కువ జిగురును శుభ్రం చేయడానికి నిమ్మరసం బాగా పనికొస్తుంది.
***************

5, ఆగస్టు 2008, మంగళవారం

దొంగ గుర్రం___

ఒక బట్టల వ్యాపారి దగ్గర ఒక గుర్రం వుండేది. అతను ఆ గుర్రం వీపుపైన బట్టల మూటలు వుంచి, ఒరూరు తిరిగుతూ వ్యాపారం చేసేవాడు. ఆ పని చేయడం గుర్రానికి అస్సలు ఇష్టం వుండేది కాదు. ఎలాగైనా అక్కడి నుండి బయట పడి స్వేచ్చగా బ్రతకాలని ఆరాట పడసాగింది. యజమాని ఎంత బాగా చూసినా దానికి అసంతృప్తి గానే వుండేది.
***
ఒక రోజు ఒక దొంగ వ్యాపారి ఇంటికి కన్నం వేసాడు. ఆ సమయంలో వ్యాపారి ఘాడ నిద్రలో వున్నాడు. దొంగ వ్యాపారి ఇంటిలోకి చొరబడి ధాన్యపు మూటలు ఒక్కొక్కటి ఇంటి వెనకాల నిలబెట్టివున్న బండి పైకి చేరవేయ సాగాడు.
***
జరుగుతున్న తతంగాన్ని పసికట్టింది గుర్రం. యజమానిని అప్రమత్తం చేయాలన్న ఆలోచనే దానికి రాలేదు. నిశ్సబ్దంగా చూస్తూ వుండిపోయింది. దొంగ చివరి బస్తాను మోసుకు వెల్లుతుండటంతో....
***
"అయ్యా అదే చేత్తో నా కట్లు కూడా విప్పండి" అని అడిగింది.
***
"ఎందుకు?" దొంగ అడిగాడు.
***
"ఇక్కడ బ్రతకడం నాకు ఇష్టం లేదు"
***
"మరి నీ కట్లు విప్పితే నాకేంటి లాభం?" దొంగ అడిగాడు.
***
"కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి వుంటాను" అంది.
***
దాని మాటలకు ఒక్క క్షణం అలోచించి చిన్నగా నవ్వాడు దొంగ. "అవునూ... నేను దొంగని. నీకా విషయం ఇప్పటికే అర్ధమయి వుండాలి. మరి నీ యజమానిని నిద్రలేపలేదేమి.
***
"నాకు నా యజమాని అంటే అసహ్యం. అతని సొత్తు పోతే నాకేం? చూడు... నువ్వు దొంగిలిస్తుంటే నీ పనికి అవకాసం వున్నా అడ్డు పడలేదు నేను. మరి కృతజ్ఞతగా నేను చెప్పిన పని చేయడం నీ ధర్మం" అంది గుర్రం.
***
గుర్రం మాటలకు నవ్వాడు దొంగ, " కృతజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీలో అవి వున్నాయా? నిన్ను సంరక్షించే నీ యజమాని పట్ల నీకు క్రుతగ్నతే లేదు. వుంటే నువ్విలా స్వార్ధంగా ప్రవర్తించవు. నీలాంటి దాన్ని వెంట తీసుకుపోయి వుంచుకోవటం ఎప్పటికీ ప్రమాదమే. విశ్వాసం లేని పని వాడికి యజమాని అయ్యే కంటే అసలు.... పని వాడు లేక పోవడమే మేలు..." అంటూ అక్కడి నుంచి నిశ్సబ్దంగా జారుకున్నాడు దొంగ.
***
ఒక దొంగలో వున్న నీతి తనలో లేనందుకు విచారిస్తూ మౌనంగా నిలబడిపోయింది గుర్రం.

4, ఆగస్టు 2008, సోమవారం

ఈజీ వే ......

" ఈ గొర్రెల మందలోని గొర్రెలను ఎవరు ముందుగా లెక్క పెడతారో చూద్దాం" ఉపాద్యాయుడు పడి మంది విద్యార్దులకు పోటీ పెట్టాడు.
***
అందులో గణేష్ అందరికంటే ముందు లెక్కబెట్టి బహుమతి గెల్చుకున్నాడు.
***
'అందరి కంటేముందు నువ్వు ఎలా లెక్క బెట్టగలిగావు' అడిగాడు ఉపాద్యాయుడు ఆశ్చర్యకరంగా
***
ఈముంది సార్ ఈజీ. ముందు గొర్రెల కాళ్ళను చక చకా లెక్కబెట్టాను. తర్వాత నలుగుతో భాగించానంటే' జవాబిచ్చాడు గణేష్.

ద్విన చర్య ......

ఒక ప్రసిద్ధ కదా కదారచయితను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు ఓ విలేఖరి.
***
"మీ దిన చర్య ఎలావుంతుందండీ" అడిగాడు.
***
"ఉదయం ఆరుగంటలకు నిద్రలేస్తాను. వెంటనే పళ్ళు తోముకొని కాఫీ తాగి స్నానం వగైరాలు ముగించుకొని టిఫిన్ చేస్తాను, గంట సేపు పేపర్లన్నీ చదివి కాసేపు పిల్లలతో గడిపి ఆఫీసుకు వెళ్ళిపోతాను. సాయంత్రం క్లుబ్బుకెళ్ళి ఫ్రెండ్స్ తో గడిపి తొమ్మిది గంటలకు ఇంటికొచ్చి స్నానం చేసి భోంచేసి నిద్రపోతాను" అని చెప్పాడు రచయిత.
***
"మరి మీరు రచనలు ఎప్పుడు చేస్తారండీ" విలేకరి అడిగాడు.
***
"అవి మరుసటి రోజు చేసుకుంటాను" జవాబిచ్చాడు రచయిత.
-------------

స్పెషల్ ...

"ఎంటీ? మామూలు కాఫీ రొండు రూపాయలు. స్పెషల్ కాఫీ ఆర్రూపాయలా ? ఏమిటయ్యా స్పెషల్ ?" సర్వర్ని అడిగాడు సుందరం.
****
"అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీకు మొదటి సారి కాఫీ ఎలా ఇస్తారో మా స్పెషల్ కాఫీ ఎప్పుడూ అలాగే ఉంటుంది." చెప్పాడు సర్వర్.
-----------

నెట్టండి... నెట్టండి.....

విమానం కొద్ది సేపట్లో ఎగురుతుందనగా ఓ పల్లెటూరి ఆసామి క్యాబిన్లోకి వెళ్లి పైలెట్ ని ఇలా అడిగాడు ... "సార్ విమానంలో పెట్రోలుందో లేదో చెక్ చీసుకున్నారు కదా?"
***
"ఆ" పైలెట్ జవాబు ఇచ్చాడు.
***
"ఇంజన్ బాగా పని చేస్తోంది కదా?"
***
"ఆ అన్నీ సరిగ్గానే ఉన్నాయి"
***
"బ్యాటరీ గీట్రే అన్నీ బాగానే ఉన్నాయి కదా?" అన్నాడు ఆ ఆసామీ.
***
"దేనికడుగుతున్నారు ఇదంతా?"
***
పైలట్ అడిగాడు సందేహంగా.
***
"విమానం మద్యలో ఆగిపోయిందనుకోండి... దిగి నెట్టండి బాబూ అంటారు... అందుకే ముందే అడుగుతున్న" అన్నాడు ఆ పల్లెటూరి అతను.
*******