7, జులై 2008, సోమవారం

పిక్కల నెప్పులు పోవాలంటే ... మంతెన సత్యనారాయణ రాజు

బలహీనత వల్ల ఎక్కువగా పిక్కల నొప్పులు వస్తూ వుంటాయి. ఆహరం మంచిగా తినకుండా ఎక్కువ పని చేసుకునే వారికి ఆ నీరసంలో ముందు పిక్కలు లాగుతాయి. ఎక్కువగా నడిచే వారికి ఆ కండరాలు శ్రమను తట్టుకోలేక వస్తూ వుంటాయి. శరీరంలో ఉప్పు, మెగ్నీషియం లాంటి లవణాలు తక్కువగా ఉన్నా పిక్కలు పట్టేస్తూ వుంటాయి. ఉప్పును పూర్తిగా మానిన వారికి క్రొత్తలో వారం, పది రోజులు వచ్చి ఆ తరువాత తగ్గుతుంటాయి. దీనికి పరిష్కారం ఏమిటంటే మనం చేసే పనికి శరీరం తట్టుకునేతట్లు మంచి ఆహరం తింటే సరిపోతుంది.

***

చిట్కాలు:

౧. తెల్లటి అన్నం మాని ముడి బియ్యం అన్నాన్ని వండుకొని రెండు పూటలా సరిపడా తింటే ౧౫, ౨౦ రోజులలో తగ్గుతాయి. ఎక్కువ పని వలన వచ్చే పిక్కల నొప్పులు ముడి బియ్యం అన్నానికి తగ్గిపోతాయి.

౨. ప్రతి రోజూ మధ్యాహ్నం భోజనంలో ఆకు కూరలను ముఖ్యమ్గా పాల కూర లాంటి వాటిని రోజూ వండుకుని బాగా తింటే లవణాల లోపం తగ్గుతుంది.

౩) పిక్కలు పట్టేస్తూ వుంటే లేదా ప్రయాణాలలో నడక ఎక్కువగా నడిచినందుకు నొప్పిగా వుంటే కొద్దిగా కొబ్బరి నూనె పిక్కలకు రాసి మర్దనా చేసి వేడి నీటి కాపడం ౧౦ నిమిషాలు పెట్టుకుంటే ఆ బడలిక అంతా పోతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి