31, జులై 2008, గురువారం

లంఖణం ని పరమ ఔషధం అని ఎందుకు అన్నారు ?

శరీరానికి ఏదైనా ఇబ్బంది (జబ్బు) వచ్చి నప్పుడు అది కూరినట్లుగా మనము తినకుండా, తిరగకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే శరీరంలో సుమారు ౭౫ శాతం శక్తి పొడుపు చీయబడుతుంది. ఆ పొదుపైన శక్తిని శరీరం రోగం నుంచి రక్షించుకునే పనిలో వాడుకుంటుంది. శరీరంలో ఎక్కడ జబ్బు ఉందో ఆ జబ్బు రావడానికి ఏ క్రిములు కారణమో ఆ క్రిములు ఎక్కడ ఎన్ని దాగి ఉన్నాయో శరీరానికి తెలుసు. ఒక్కొక్క సారి ఎన్ని రక్త పరీక్షలు చసిన జ్వారానికి కారణాలు తెలియవు. పరీక్షలు చేసే పరికరాలకు ఒక్కో సారి విషయం అందాకా పోవచ్చు గానీ ఈ శరీరానికి మాత్రం లోపల జరిగేదంతా తెలుసు. ఏ రకమైన ఇన్ఫెక్షన్ లోపల ఉన్నా దానిని త్రిప్పి కొట్టడానికి ఆ సూక్ష్మ జీవుల చర్యకు ప్రతి చర్యను చేపడుతుంది. మామూలు పరిస్థితిలో కంటే లంఖణం చేసినప్పుడు శక్తి పొదుపుకావడం వలన, వేరే పనులు నిర్వర్తించే బాధ్యత లేకపోవడం వలన, శరీరం మరింత ఉత్సాహంగా శక్తివంతంగా తన సైన్యాన్ని (యాంటీ బాడీస్) రోగ క్రిముల పైకి పంపుతుంది. శరీరంలో ప్రవేశించిన రోగ క్రిముల సంఖ్యను బట్టి, బలాన్ని బట్టి అప్పటికప్పుడు క్రొత్త గా యాంటీ బాడీస్ ని శరీరం తయారు చేసుకోగలుగుతుంది. ఈ యాంటీ బాడీస్ అనేవి చెడ్డ సూక్ష్మ జీవులను (బాక్టీరియా). హాని కలిగించే క్రిములను చంపుతాయే తప్ప, శరీరానికి పనికివచ్చే బ్యాక్టీరియాని మాత్రం చంపావు. అదే యాంటీ బయోటిక్ మందులు వాడితే చెడ్డ క్రిములతో పాటు శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా మరియు ఆరోగ్యంగా ఉండే కొన్ని కణాలు కూడా చనిపోతూ వుంటాయి. ఉదాహరణకు ఈ మధ్య ఇరాక్ కు, అమెరికాకు జరిగిన యుద్దంలో అమెరికా వారు ప్రయోగించిన మారణాయుధాల వల్ల ఇరాక్ సైనికులతో పాటు అనేక మంది సామాన్య పౌరులు కూడా మరణించడం జరిగిందీ. అదే లంఖణం చేస్తే మనలోని శక్తి అంతా రోగనిరోధక శక్తిని ప్రేరేపించే దాని ద్వారా ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ తో మన శరీరంలో చేసే యుద్దము ధర్మ యుద్దము లాంటిది. మన దేశ స్వరాజ్యం కొరకు గాంధీగారు పోరాడిన పోరాటం లాగా మన శరీరం లంఖణం లో పోరాడుతుంది. లంఖణం లో ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ మన శరీరంలో నిలువయింది అలాంటి క్రిములు, సూక్ష్మ జీవులు శరీరంలోకి మళ్ళీ ఎప్పుడైనా ప్రవేసించితే వెంటనే వాటిని చంపివేయడానికి సిద్దంగా ఉంటాయి. ఇంతకు ముందు వచ్చిన ఇబ్బంది లాంటిది మళ్ళీ ఇప్పట్లో రాకుండా శరీరం కాపలా కాస్తూ ఉంటుంది. లంఖణం లు చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ బయోటిక్ మందులు వాడితే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. మన శరీరము రోగాన్ని త్రిప్పి గొట్టడానికి నేను యాంటీ బాడీస్ ను తయారు చేయలేకపోతున్నానని మనల్ని హెచ్చరించినపుడు మనం యాంటీ బయోటిక్ మందులు వాడటం తప్పు కాదు. ముందు శరీరానికి కొంచెం కూడా అవకాశమివ్వకుండా డైరెక్టుగా మందు జోలికి వెళ్ళడమే పెద్ద పొరపాటు. ఈ ప్రపంచంలో ఈ మందునైనా ఔషదమే అని అంటారు. ఏ మందునీ పరమౌషధం అని ఇంతవరకూ పిలవలేదు. ఒక్క లంఖణం ని మాత్రమే పరమౌషధమని ఎందుకన్నారంటే ప్రతి ఔషధం ఒక పదార్దం నుండీ తయరైనదే. శరీరం తయారు చేసుకునే ఈ ఔషధం మాత్రమే పదార్ధం లేని, ఔషధం కాని ఔషధం. అందుకే దీనిని పరమౌషధం అన్నారు. లంఖణం చెయ్యని ప్రాణి అంటూ ఈ భూమి మీద ఉండదు. అవన్నీ నాచురల్ యాంటీ బయోటిక్ ఐన లంఖణం ని సందర్భానికి వాడుతూ ఉంటాయి. మనము కూడా ఇక నుండీ అవసరానికి లంఖణం చేస్తూ, సలక్షణంగా బ్రతుకుదాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి