21, నవంబర్ 2009, శనివారం

గ్యాసు బిగపట్టడం పోవాలంటే __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

కొందరికి గ్యాసు పొత్తి కడుపు భాగంలో బిగపట్టి బయటకు రాదు. ఏమి చేయాలో తూచని ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అపానవాయువు వస్తే బాగుంతుంధనిపిస్తుంది. అది ఎదురుచూడగా చూడగా ఎప్పటికో ఎన్నో ప్రయత్నాలు చేయగా గాని బయటకు రాదు. అది బయటకు వస్తే ప్రాణం హాయిగా వుంటుంది. అలా గ్యాసు బిగియడానికి కారణాలు చూస్తే ....
౧) ఎక్కువ సేపు ( మూత్రం సంచి నిండే దాకా) ఆపుకోవడం,
౨) నడుముకు బట్టలను టైటుగా బిగించడం,
3)మలద్వారం దాక మలం వచ్చి బిగిసిపోవడం మొదలగునవి.
౪) అలాగే ఛాతీ బాగంలో, పొట్ట భాగంలో గ్యాసు త్రేన్పురూపంలో రాకుండా పట్టేస్తుంది.
౫) త్రేన్చుదామనుకున్నా త్రేన్పు రాదు.
ఇలా గ్యసుపట్టినప్పుడు ఆ గ్యాసు ఫ్రీగా బయటకు రావాలంటే....
చిట్కాలు ()----
౧) ముందు బెల్టు, బట్టలు కాస్తా వదులు చేసుకోవడం మంచిది.
౨) మూత్రం రాకపోయినా వెళ్లి కూర్చుంటే అప్పుడు కొంత గ్యాసు ఆ టైములో బాగా కదిలి బయటకు పోతుంది.
౩) ఫై భాగంలో గ్యాసు పడితే వజ్రాసనం (నడుమును లైనుగా పెట్టి ఎలా కూర్చున్నా ఫరవాలేదు) లో కూర్చుంటే గ్యాసు రిలీజు అవుతుంది.
౪) ఇంకా బిగపట్టి ఉంటే ౫(ఐదు), ౧౦ (పది) సార్లు శ్వాసలను గట్టిగా పీల్చి వదిలితే, ఆ కదలికలకు గ్యాసు బయటకు వస్తుంది.
౫) ఇంకా రాకపోతే, వేడి నీటిని కాఫీలాగా మెల్లగా త్రాగితే ప్రేగులలో ఆ వేడి కదలికలను పెంచి గ్యాసు బయటకు వస్తుంది.
౬) ఇంకా ఇబ్బంది ఉంటే చాతీ ఫై గాని బొడ్డు క్రింద గాని కొంచెం నూనె రాసి వేడినీటి కాపడం పెడితే చాలావరకు వచ్చేస్తుంది. ఇంకా ఇబ్బంది ఉంటే డాక్టర్ల సలహా ఫై ఏదైనా మందు వాడు కోవచ్చు. పైన చెప్పిన వాటిలో మీకాసమయం లో ఏది అవకాశం ఉంటే దానిని చేసి చూడండి.
------డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు. -

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి