20, నవంబర్ 2009, శుక్రవారం

మీ కోపం ఎలా వుండాలి __ స్వామి సుఖబోధానంద ...

" తన కోపమే తన శత్రువు " అన్నది శతకకారుడి అప్తవాక్యం. నవరసాల్లో రౌద్రానికి స్థానం వుంది. రౌద్ర రసం అంటే ఆగ్రహంలోని శక్తి. ఆ శక్తిని సంతరించుకోవాలంటే మనిషికి కోపం వుండాలి మరి. అలాగని అస్తమానం కారాలు, మిరియాలు నూరమని కాదు. ఆరోగ్యకరమైన కోపం మనిషికి చాలా అవసరం. గాంధీజీ కోపాన్ని అహింసా పథం లో నడిపించారు. దానికి సత్యాగ్రహం అని పేరు పెట్టారు కూడా! ఆరోగ్యకరమైన ఆగ్రహం జీవితాన్ని ప్రయోజనకరంగా మలుస్తుంది. అదే అనారోగ్యకరమైన కోపం బతుకును చిందరవందర చేస్తుంది. మనిషిలో కోపం లేకపోయినా ఇబ్బందే. అందరికి లోకువై పోతాడు. శ్రీ కృష్ణుడి అన్నబలరాముడు ఒక సారి తన తమ్ముడితో ఇలా అన్నాడు. ఏమిటిది కృష్ణ, నీకు నీకు అణిగిమణిగి ఉండేవాళ్ళు నీపట్ల కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తుంటే నీకు కోపం రావడం లేదేం? ఆ మాటలకు కృష్ణుడు నవ్వాడు --" నా కోపాన్ని కోడా నువ్వే తీసుకున్నావు కదా .... నాకు అగ్రహించే అవకాసం ఎక్కడఉంది అన్నయ్యా ? అంటూ చమత్కరించాడు. అది బలరాముడి కోపాన్ని రెట్టింపు చేసింది. అప్పుడు కృష్ణుడు--"నాకూ కోపం వుంది "..
-----
కాని నా కోపానికి, నా ఆగ్రహానికి తేడా ఉంది. నాలోని కోపానికి కళ్లు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, హృదయం ఉంది. అందువల్ల ఎప్పుడు ఎటు వెళ్ళాలో దానికి స్పష్టం గా తెలుసు. అది సాత్విక ఆగ్రహం నన్ను మరింత బలవంతుడిని చేస్తుంది తప్ప విచక్షణ కోల్పోయ్యేలాచేయదు" అన్నాడు.
------
సాత్వికమైన కోపం ఎలా ఉంటుందో శ్రీ కృష్ణుడి సమాదానం లో మనకు స్పష్టమవుతుంది. విచక్షణ కోల్పోయి ఉన్మాదిగా మార్చే కోపం హానికరమైనది. అలాంటి అసాత్వికమైన కోపాన్ని శుద్ధి చేయడం ద్వారా రౌద్రరసం లోని శక్తి మనకు ప్రయోజనకరమవుతుంది. కోపం వచినప్పుడు మనం కొంచెం కోపాన్ని, మనకు ఎదురైన పరిస్థితినీ చెరో వైపు నిలబెట్టి తూకం వేయాలి. పరిస్థితికి తగ్గట్టుగా ఉన్నా కోపం సరైనది, సత్వికమైనది. దానికి బిన్నంగా ఉన్నా కోపం అనారోగ్యకరమైనది, అవాన్చనీయమైనది .
-----
ఆగ్రహాన్ని బేరీజు వేయడానికి ధర్మ మీటర్ లాంటి భౌతిక ఉపకరణాలు లేవు. మనసులోని ఆధ్యాత్మిక కేంద్రం ద్వారానే ఇది వీలవుతుంది. పరిస్థితికి అనుగుణమైన కోపాన్ని ప్రదర్శించాల్సిందే. అలాంటి కోపం చెమట లాంటిది. శరీరంలోని మురికి చెమట ద్వారా బయటకు వచ్చినట్లుగా పరిస్థితికి సరితూగే ఆగ్రహాన్ని మనం వ్యక్తం చెయ్యాలి. లేకపోతే అది మనసులో పొరలు పొరలుగా పేరుకొని ఉంటుంది. కోపం గతానికి చెందినధైతే దాన్ని అక్కడే పూడ్చి పెట్టడం మంచిది. అలాకాకుండా గతం చూరును పట్టుకొని వేలాడితే వర్తమానం చెడుతుంది. భావిష్యతు పాడవుతుంది. పరిస్థితికి మించిన కోపం మీలో జాడలు విప్పినప్పుడు జాగ్రతగా గమనిస్తే దాని మూలాలు దుఖంలో కనిపిస్తాయి. అప్పుడు కోపాన్ని పక్కన పెట్టి దుఖానికి కారణాలు వెతకండి. మనసుపొరల్లో గూడుకట్టిన దుఃఖం చురుగ్గా మారినప్పుడు కోపం రూపంలో విరుచుకుపడుతుంది. ఈ కల్లోలాన్ని చక్కదిద్ది మానసిక స్థితిని శుద్ధి చేస్తే దుఃఖం తొలగిపోతుంది.__ స్వామి సుఖబోధానంద

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి