21, నవంబర్ 2009, శనివారం

ఏది సరైన చికిత్స __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

నేడు వైద్య విధానం ఎంతో అభివృద్ది చెందింది. ఇంకా ఎంతో చెందాలి. అది ఈ సమాజానికి చాలా అవసరం. మానవుని మీలు కోరి ఎందరో మహానుభావులు ఎన్నోరకాల వైద్య విధానాలు రూపొందించారు. అవి, ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి, యునాని మొదలగునవి. ఇవన్ని మనిషికి ఎంతో లాభాన్ని కలిగిస్తున్నాయి. బాధ తో వెళ్ళిన మనకు ఎంతో ఉపసమానాన్నిసుఖాన్ని కలిగిస్తున్నాయి. మనకొచ్చిన సమస్యకు ఎ వైద్య విధానము పాటించినా దానివల్ల మనకు పూర్తి లాభం రావచ్చులేదాకొంత వరకే ఉపసమనం కలుగవచ్చులేదా అసలు కొంచెం కూడా తగ్గకపోవచ్చు. ఒకసారి తగ్గకపోగా దుష్ఫలితాలైన రావచ్చు. ఏ లాభాన్నిచ్చినా సరే, మనకు ఏదైనా జబ్బు వచ్చాకే అవి అవసరమవుతున్నై. జబ్బు రాని వారు ఏ వైద్య విధానం జోలికి పోరు. ఏ జబ్బు రాకుండా అవి మనకు సహకరించలేక పోతున్నై. ఉదాహరణకు కడుపునొప్పి వచ్చాక మాత్ర వేసుకుంటే నొప్పి తగ్గవచ్చు, మిగితావారికి నొప్పి రాకుండా ముందునుండీ ఆ నొప్పి మాత్ర వేసుకున్దామంటే అది పనిచేయ్యకపోగా హాని చేస్తుంది. వైద్య విధనాలన్నీఇలా ఉంటే, ప్రకృతి వైద్య విధానం మాత్రం వీటన్నిటికి భిన్నం గా పని చీస్తుంది. ఉదాహరణకు కడుపు నొప్పి తగ్గడానికి ఎనిమా చేసి, ప్రేగులను క్లీన్ చేసి, మంచి ఆహరం పెట్టి నొప్పి తగ్గిస్తారు. ఈ చికిత్సా పద్దతిని కడుపునొప్పి లీనివారు, రాకుండా ఇలా ముందు జాగ్రత చర్యగా చేసుకుంటే, వారికి ఆ సమస్య భవిష్యత్ లో రాకుండా ప్రేగులు పరిశుభ్రంగా ఉంటాయి. అంటే ఇక్కడ చేసే ప్రతి చికిత్స కూడా జబ్బు వచ్చిన వారికి ఏది తగ్గించడానికి పనికొస్తుందో, అదే చికిత్స జబ్బు లేని వారికి రాకుండా సహకరిస్తుంది. రెండు పక్కల పదునున్న కత్తి లాంటిందన్న మాట . సరైన చికిత్స అంటే, రాగి చెంబు చిల్లు పడితే రాగిముక్క అతుకు వేయడం ఎంత సరైనదో, ఈ ప్రకృతి సిద్దమైన శరీరానికి ప్రకృతి చికిత్సలు కూడా అంత సరిగా సూటు అవుతాయి. పాలలో పాలు కలుసినట్లుగా, చికిత్స, శరీరం రెండు ఒకటిగా కలసి పోతాయి. వీటి మధ్య ఘర్షణ రాదూ. అంటే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. ఇలాంటి ప్రకృతి సహజమైన పద్దతుల ద్వారా మనందిరికీ వచ్చే సాధారణ సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నించడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. మన శరీరానికి ఏదన్నా సమస్య వస్తే సహజముగా, ప్రకృతి సిద్ధముగా ఆ సమస్యను తగ్గించు కోవడానికి ముందు మనం ప్రయత్నించాలి. అలా చేసినా ఫలితం లభించక సమస్య పెరుగుతూ వుంటే అప్పుడు ఇతర వైద్య విధానాల జోలికి వెళ్ళడం తప్పు కాదు. కాని మనం ముందే వాటిని వాడుకుంటూ శరీరానికి విరుద్దంగా ప్రయత్నిస్తున్నాము. ఇక నుండైనా ఈ శరీరానికి ఏది వచ్చినా ప్రకృతి సిద్దంగా తగ్గించే ప్రయత్నం ప్రారంభిస్తే మనకు ఎక్కువ లాభం జరుగుతుందని ఈ చికిత్సా పద్దతులను వ్రాస్తున్నాను. ఈ ప్రకృతి చికిత్స పద్దతులను కొంతకాలం చేసి ఆపవలసిన పని లేదు. ఎందుకంటే, ఇది మందు కాదు కాబట్టి, జబ్బులున్నా లేకపోయినా, ఇంటిల్లిపాది అందరం ఇలాంటి మంచి అలవాట్లను ఆచరణలో ఉంచుకొని ఆరోగ్యాన్ని బాగు చేసు కొంటారని ఈ ఆర్టికల్స్ వ్రాస్తున్నాను. మంచి మనసుతో ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.
___
____
జంతువులకు ఏ సమస్య వచ్చినా వెంతనీ ప్రకృతి సిద్దం గా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నై. వికారం గా వుంటే, తనకు గిట్టని ఆహారాన్ని తిని వెంటనే వాంతి చేసుకుని సమస్యను తగ్గించుకుంటాయి. ఆకలి వెయ్యకపోతీ పొట్టను మాడ్చి మళ్ళీ ఆకలి పుట్టే లాగా చేసుకుంటాయి. ఇలా చికిత్స చేసుకోవడం కూడా వాటి జీవితం లో ఒక భాగంగా చేసుకుని బ్రతుకుతాయి. అలా చికిత్స చేసుకోవాలని అవి ఎక్కడ చదువు కోవు , ఎవరి చేత చెప్పించుకోవు. మనకు వచ్చింది కూడా అలాంటి శరీరమే. అలాంటి జన్మే. అయినా వాటికీ లేని తెలివితేటలు, జ్ఞానం అదనం గా మనకు లభించినందుకు వాటి కంటే మనము ఇంకా తెలివిగా ప్రవర్తించి సమస్యలను తేలిగ్గా పోయేట్లు మనకి మనమే ప్రయత్నించాలి. మరి మన శరీరానికి, సహజంగా సమస్యలను తగ్గించే మార్గాలు తెలిసినా చేసుకోలేక పోతే నష్టం మనకే. మన ఇంట్లో ఉండే వాటినుపయోగించుకుంటూ, మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకునే ఈ సదవకాసాన్ని అందరూ వినియోగించుకుని, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోశాలతో, ఆనందం గా జీవించే ప్రయత్నాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి