8, జూన్ 2008, ఆదివారం

ఆరోగ్యం అంటే.... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

ఏ రోగం లేకుండా ఉండడాన్ని ఆరోగ్యం అని అనుకుంటున్నాము. కానీ అది వాస్తవం కాదు. ఏ రోగం ఇప్పుడు లేకపోయినా, వైద్య పరీక్షలలో ఏదో ఒక రోగం బయటపడుతున్నది. అంటే లోపల పుట్టిన రోగం పరీక్షలకు దొరికే స్థితికి వచ్చిందని అర్ధం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని రోజులలో అది పూర్తి రోగం రూపంలో బయటపడుతుంది. రోగం రూపంలో బయటకు రాకపోయినా వచ్చే గుణం లోపల ఉంటే దానిని ఆరోగ్యం అని అనవచ్చా? రోగం పునాదుల్లో ఉన్నా దానిని ఆరోగ్యం అని అనకూడదు. ప్రస్తుతం ఏ రోగం లేకుండా ఉంది దానితో పాటు మనలో ఏ రోగం రాకుండా ఉండే స్థితి కూడా ఉంటే దానిని ఆరోగ్యం అని అనుకోవచ్చు. శరీరంలో ప్రతి కానము, ప్రతి అవయవం అది ఎంత వరకూ పనిచేయగాలదో అంత శక్తివంతంగా పని చేస్తూ మిగితా అవయవాలతో సహకరిస్తూ శరీరాన్ని సుఖంగా ఉండేలా నడిపిస్తే ఆ శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లు. శరీరం ఆరోగ్యంగా ఉన్నదని చెప్పడానికి బాహ్యమ్గా కొన్ని లక్షణాల ద్వారా మనం అంచనా వేసికోవచ్చు. అవి ఏమిటంటే పరిశుభ్రంగా, కాంతిగా ఉండే చర్మం, మెరిసే కళ్లు (కాంతివంతముగాఎముకలను కప్పి ఉంచిన బలమైన కండరాలు, తియ్యటి శ్వాస, మంచి ఆకలి, ప్రశాంతమైన నిద్ర, మల మూత్రాదులు ఏ రోజుకారోజు బయటకు వెళ్ళిపోవడం, నోరు, పాచి, లాలాజలం, మలం, మూత్రం, చెమట మొదలగునవి పూర్తిగా వాసనా రాకుండా, కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు ఇబ్బంది లేకుండా కదలడం మొదలగునవి. ఇలా వుంటే శరీరం ఆరోగ్యముగా ఉన్నదని అర్ధము. ఒక్క శారీరక ఆరోగ్యము మాత్రమే సరిపోతుందా? మనిషికి తప్ప మిగితా జీవులన్నింటికీ అది సరిపోతంది. ఆ జీవులకు ఒక్క శరీరము ఆరోగ్యముగా ఉంటే జీవితము హాయిగా గడిచిపోతుంది. మనిషికి మనసంటూ ఒకటుంది కాబట్టి దాని ఆరోగ్యం కూడా శరీర ఆరోగ్యమ్తో పాటు అవసరమౌతుంది. ఆరోగ్యవంతమైన శరీరంతోపాటు, ఆరోగ్యవంతమైన మనసు ఉంటే ఆ వ్యక్తి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పవచ్చు. శరీర ఆరోగ్యాన్ని లెక్కలు వేయడాన్ని పరికరాలుఉన్నాయి కాని మానసికమైన ఆరోగ్యాన్ని తెలియజేయడానికి ఎలాంటి పరికరాలు కనిపెట్టలేదు. ఒక వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడు అనడానికి కొన్ని లక్షణాలు వైద్య శాస్త్రపరంగా ప్రామనికంగా తీసుకుంటారు. అవి ముఖ్యంగా మానసికంగా ఎలాంటి సంఘర్షణ లేకపోవడం, పరిస్థితులకు సర్దుకుని పోయే తత్వం కలిగి ఉండడం, ఆత్మ నిగ్రహం కలిగి ఉండడం, ప్రతి చిన్నదానికి క్రుంగి పోకుండా ఉండడం, స్వంత తెలివితేటలతో అలోచించి నిర్ణయం తేసుకోవడం, సమస్యలను ఎదుర్కొనే శక్తి ని కలిగి ఉండడం మొదలగునవి ముఖ్యం గా చెప్పుకోవచ్చు. ఈ రెండింటిల్లో ఆరోగ్యం గురుంచి చెప్పుకునేటప్పుడు మనం శరీరం గురుంచే ముఖ్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే శరీరము ఎక్కువగా రోగాలపాలు అవుతూ ఉంటుంది. కాబట్టి అలాగే మనసుకీ, శరీరానికీ అవినాభావ సంబంధముంది. మనసు ఆరోగ్యంగా లేకపోతే దాని ప్రభావం శరీరం పై తప్పని సరిగా పడుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు కూడా తప్పని సరిగా పడుతుంది. శరీరము ఆరోగ్యముగా ఉంటేనే మనసు కూడా ప్రశాంతముగా ఉంటుంది. అందుచేత ముందు శరీరాన్ని బాగుచేసుకునే ప్రయత్నం చేసి తర్వాత మిగితా వాటి సంగతి చూడాలి. శారీరక ఆరోగ్యం పై డాక్టరు పాత్రా ఎంత? వైద్య విధానాల పాత్ర ఎంత? అసలు ఆరోగ్యం ఏమి చేస్తే వస్తుంది. ఇలాంటి విషయాలను ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి