8, జూన్ 2008, ఆదివారం

డాక్టర్ అంటే ... ?... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

వైద్యో నారాయణో హరిః. వైద్యుడనే వాడు నారాయణుడని, భగవంతుడని మన పెద్దలు చెప్పారు. అసలు వైద్యుడనే మాటకు అర్ధం చూస్తే వైద్యం చూస్తే వైద్యం చేసేవాడు వైద్యుడు అంటారు. వైద్యము అంటే చికిత్స అని అర్ధము. చికిత్స చేసేవాడు వైద్యుడు. డాక్టర్ అనే మాటకు ఇంకొక అర్ధం చూస్తే భోదించేవాడు అని చెప్పబడింది. డాక్టర్ యొక్క అసలు డ్యూటీఏమిటంటే రోగికి చికిత్స చేయడం, ఆ తరువాత బోధించడం అనే రెండూ పనులు చేయడం. వచ్చిన జబ్బుకు చికిత్స చేసిన ఆ తరువాత రోగికి మళ్ళీ ఈసారి ఆ జబ్బు రాకుండా చూసుకోవాలంటే, ఏమి తప్పు చేస్తే ఆ జబ్బు వచ్చిందో, ఆ జబ్బు రాకుండా ఏమి చేయాలో, ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఆరోగ్యాన్ని ఎలా కాపడుకోవాలో అవగాహన కలిగించే బోధన చేయాలి. వైద్య శాస్త్రం లెక్కల ప్రకారం చేయవలసినది ఇది. డాక్టరు చెప్పిన మాట పరమాత్ముడు చెప్పిన మాటగా అనుకుని చెప్పినది చెప్పినట్లుగా విని, ఆచరించమని మన పెద్దల మాటలు. ఈ రోజులలో ఎక్కువ మంది వైద్యులు చికిత్సే తప్ప బోధన విషయాన్ని ప్రక్కనబెట్టారు. వచ్చిన జబ్బులను పోగొట్టి, లేని జబ్బులు రాకుండా కాపాడుకునే మార్గాన్ని చూపవలసినది వైద్యులే. అలాంటి అవగాహన ప్రజల్లో లేకే రోజు రోజుకి రోగాలు పెరుగుతున్నాయి. వైద్యులు బోధించే విదంగా మారి అవగాహన కలిగిస్తూ ఉంటే, దాని ప్రజలు చెప్పినది చెప్పినట్లుగా ఆచరణలో పెట్టగలిగినప్పుడు ఈ సమాజం ఆరోగ్యవంతంగా మారితుంది. ఇలాంటి మంచి మార్పు ఇద్దరిలోనూ రావాలని కోరుకుందాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి